Karnataka political analysis: కర్నాటకలో మోదీ బీజేపీ వర్సెస్ రాహుల్ కాంగ్రెస్-modis bjp faces close fight with rahul s congress in india s swing state karnataka assembly elections ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Modi's Bjp Faces Close Fight With Rahul's Congress In India's Swing State Karnataka Assembly Elections

Karnataka political analysis: కర్నాటకలో మోదీ బీజేపీ వర్సెస్ రాహుల్ కాంగ్రెస్

Sudarshan Vaddanam HT Telugu
Mar 29, 2023 02:54 PM IST

Karnataka political analysis: మరో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. కీలకమైన దక్షిణాది రాష్ట్రమైన కర్నాటక (Karnataka assembly elections)లో మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని భావిస్తున్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ

వచ్చే సంవత్సరం జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఓటరు నాడి ఎలా ఉండబోతోందో అంచనా వేయడానికి ఈ కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnataka assembly elections) ఉపయోగపడబోతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ (PM Modi), బీజేపీ (BJP) ల హవా కొనసాగుతుందా?, లేక విజయం అందించి ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ (Congress) కు ఆక్సిజన్ అందిస్తుందా? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు

Modi image: మోదీ ఇమేజే బీజేపీ అస్త్రం

కర్నాటక (Karnataka)లో బీజేపీ అధికారంలో ఉంది. 2018 ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచి అధికారంలో వచ్చింది. కానీ, ఈ ఐదేళ్లలో బీజేపీ పాలనపై కొంతవరకు వ్యతిరేకత పెరిగింది. ప్రభుత్వంలో వేళ్లూనుకుపోయిన అవినీతి, అన్ని కాంట్రాక్టుల్లో 40 శాతం లంచం తీసుకుంటున్నారని ఆరోపిస్తూ.. 40% ప్రభుత్వం అన్న కాంగ్రెస్ (Congress) ప్రచారం, కాంట్రాక్టర్ ఆత్మహత్య ఇష్యూ, స్వయంగా ముఖ్యమంత్రి బొమ్మైపై అవినీతి ఆరోపణలు రావడం, బెంగళూరులో మౌలిక వసతుల కల్పనలో వైఫల్యం, పార్టీలో అంతర్గత విబేధాలు.. (Karnataka assembly elections) బీజేపీ విజయానికి ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది. అయితే, సంస్థాగతంలో బీజేపీ కర్నాటకలో బలంగా ఉంది. వాటికి తోడు మోదీ (PM Modi) ఇమేజ్, అమిత్ షా (Amit Shah) చాణక్యం బీజేపీకి కలిసొచ్చే అంశాలు. మోదీ మరోసారి ‘డబుల్ ఇంజిన్’ మంత్రంతో ఓటర్ల ముందుకు వచ్చే అవకాశముంది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విజయ ప్రస్థానాన్ని బీజేపీ కర్నాటకలో కూడా కొనసాగిస్తే, అది ఆ పార్టీకి రానున్న లోక్ సభ ఎన్నికల్లో (Lok sabha elections) గొప్ప బూస్టర్ (booster) గా పని చేస్తుందనడంలో సందేహం లేదు.

Congress strategy: డీకే శివకుమార్, సిద్ధరామయ్యల సమన్వయం

మరోవైపు, కాంగ్రెస్ (Congress) కు ఈ కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka assembly elections) విజయం సాధించడం అత్యవసరం. ఇప్పటికీ సంస్థాగతంగా, నాయకత్వ పరంగా కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో కర్నాటక (Karnataka) ఒకటి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ఎన్నికల్లో కొనసాగుతున్న పరాజయ పరంపరకు ఈ ఎన్నికల్లో అడ్డుకట్ట వేస్తే, కాంగ్రెస్ (Congress) కు అది రానున్న లోక్ సభ ఎన్నికల్లో పార్టీ పునరుత్తేజానికి కచ్చితంగా ఆక్సిజన్ లా పని చేస్తుంది. కర్నాటక ఓటర్లు దాదాపు ప్రతీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీని ఓడించే సంప్రదాయం పాటిస్తుంటారు. ఈ సారి ఆ సంప్రదాయం కూడా పని చేస్తే, అది కాంగ్రెస్ (Congress) కు సహాయపడుతుంది. 2018లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka assembly elections) కాంగ్రెస్ బీజేపీ సాధించిన ఓట్ల కన్నా 2% ఓట్లను మాత్రమే తక్కువ సాధించింది. ఈ సారి మెరుగైన పోల్ స్ట్రాటెజీ తో వ్యవహరిస్తే, కాంగ్రెస్ (Congress) కు విజయావకాశాలుంటాయి. అలాగే, రాష్ట్రంలో కాంగ్రెస్ కు కీలక నేతలైన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddha Ramaiah), డీకే శివ కుమార్ (DK Shiv kumar) లు సమన్వయంతో పనిచేయడం కూడా కాంగ్రెస్ (Congress) కు చాలా అవసరం.

Rahul Gandhi impact: రాహుల్ గాంధీ కి పరీక్ష

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని లోక్ సభలో అనర్హుడిగా (Rahul Gandhi disqualification) ప్రకటించడం, విమర్శలు, ప్రతి విమర్శలు సాధారణమైన భారతీయ రాజకీయాల్లో విమర్శల ఆధారంగా జైలు శిక్ష విధించడం, పార్టీలకు అతీతంగా దాదాపు విపక్ష పార్టీలన్నీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడం.. ప్రజల్లో కొంతవరకు రాహుల్ (Rahul Gandhi) కు సానుభూతి పెరగడానికి కారణమయ్యాయి. అది కర్నాటక ఎన్నికల్లో ప్రతిఫలించవచ్చు. అలాగే, రాహుల్ (Rahul Gandhi) చేపట్టిన దేశవ్యాప్త పాదయాత్ర ‘భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)’కు రాష్ట్రంలో మంచి స్పందన లభించింది. ఈ ఎన్నికల్లో అది కూడా కాంగ్రెస్ విజయానికి దోహదపడే అవకాశముంది. కాంగ్రెస్ (Congress) ప్రకటించిన ఉచిత విద్యుత్, ఇంటి పెద్దగా ఉన్న మహిళకు నెలకు రూ. 2 వేలు ఇస్తామన్న కాంగ్రెస్ హామీలు కూడా సానుకూల ప్రభావం చూపవచ్చు.

JDS role: జేడీఎస్ ప్రభావం

కుమార స్వామి (Kumara swami) నేతృత్వంలోని జేడీఎస్ (JDS) ఈ ఎన్నికల్లో కూడా కీలక పాత్ర పోషించనుంది. దానికి తోడు, కొత్తగా కర్నాటక (karnataka )లో అడుగుపెట్టిన తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్ (KCR) నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (BRS) జేడీఎస్ కు మద్దతు ప్రకటించే అవకాశముంది. అది తెలుగు ప్రజలు విజయావకాశాలను నిర్ణయించే నియోజకవర్గాల్లో జేడీఎస్ కు అనుకూలిస్తుంది. కర్నాటకలో మే 10న మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ (Karnataka assembly elections)) జరగనుంది. మే 13న కౌంటింగ్ తో పాటు ఫలితాల ప్రకటన ఉంటుంది.

IPL_Entry_Point