Karnataka assembly elections : ఈ రాష్ట్రంలో.. 95శాతం మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులే!-karnataka assembly elections 95 of mlas are crorepatis 35 percent have criminal cases adr report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Karnataka Assembly Elections 95% Of Mlas Are Crorepatis, 35 Percent Have Criminal Cases: Adr Report

Karnataka assembly elections : ఈ రాష్ట్రంలో.. 95శాతం మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులే!

Sharath Chitturi HT Telugu
Mar 24, 2023 09:49 AM IST

Karnataka assembly elections : ఏడీఆర్​ నివేదిక ప్రకారం.. కర్ణాటకలోని ఎమ్మెల్యేల్లో 95శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. 26శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్​ కేసులు ఉన్నాయి!

ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న బీజేపీ 'పెద్దలు'
ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న బీజేపీ 'పెద్దలు' (PTI)

Karnataka assembly elections : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ఏడీఆర్​ (అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రిఫార్మ్స్​) ఓ నివేదికను విడుదల చేసింది. నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని ఎమ్మెల్యేల్లో 95శాతం మంది కోటీశ్వరులే ఉన్నారు!

ట్రెండింగ్ వార్తలు

నేరాలు కూడా ఎక్కువే..!

కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లున్నాయి. వీరిలో 219మంది ఆర్థిక, నేర చరిత్రలపై డేటాను రూపొందించింది ఏడీఆర్​. ఈ 219లో 15 మంది ఎమ్మెల్యేలు.. 2018 ఎన్నికల అనంతరం పార్టీలు మారిపోయారు. ఈ 15 మందిలో 10 ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్​ నుంచి బీజేపీకి వలస వెళ్లినవారే.

2023 Karnataka assembly elections : ఏడీఆర్​ నివేదిక ప్రకారం.. తమపై తీవ్రమైన క్రిమినల్​ కేసులు ఉన్నట్టు 26శాతం మంది ఎమ్మెల్యేలు వారివారి అఫిడవిట్​లలో పేర్కొన్నారు. వీరిలో అత్యధిక మంది బీజేపీ(30శాతం)కి చెందిన వారే ఉన్నారు. ప్రధాన పార్టీల విషయానికొస్తే.. బీజేపీలోని 112 మంది ఎమ్మెల్యేల్లో 49మందిపై నేర కేసులు ఉన్నాయి. కాంగ్రెస్​కు చెందిన 67 మంది ఎమ్మెల్యేల్లో 16మందిపై, జేడీఎస్​లోని 30మందిలో 9మందిపై క్రిమినల్​ కేసులు ఉన్నట్టు తేలింది. నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల్లోని ఇద్దరిపై క్రిమినల్​ కేసులు ఉన్నాయి. బీజేపీలోని 35మంది, కాంగ్రెస్​కు చెందిన 13మంది, జేడీఎస్​లోని 8మందిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నట్టు తెలుస్తోంది.

అన్ని పార్టీల్లోనూ.. కోటీశ్వరులు!

మరోవైపు 118 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో 112 మంది కోటీశ్వరులు ఉన్నారు. ఇందులోనూ కమలదళం టాప్​లోనే ఉంది. మరోవైపు సిట్టింగ్​ ఎమ్మెల్యే సగటు ఆస్తుల విలువ రూ. 29.85కోట్లుగా ఉంది. ఇందులో.. కాంగ్రెస్​ ఎమ్మెల్యేల సగటు ఆస్తుల విలువ 48.58 కోట్లుగాను, బీజేపీ సగటు ఆస్తుల విలువ రూ. 19.60కోట్లుగాను ఉంది. జేడీఎస్​ ఎమ్మెల్యేల సగటు ఆస్తుల విలువ మాత్రం రూ. 4.34కోట్లుగానే ఉంది!

Karnataka polls latest news : కర్ణాటకలోని మొత్తం ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్​ సీనియర్​ నేత డీకే శివకుమార్​కు ఉన్న అస్తులే (రూ. 840కోట్లు) ఎక్కువ. ఆ తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్​ పార్టీకే చెందిన బీ సురేస్​ (రూ. 416కోట్లు), ఎం కృష్ణప్ప (రూ. 236కోట్లు)లు ఉన్నారు.

నివేదిక ప్రకారం.. మొత్తం ఎమ్మెల్యేల్లోని ఇద్దరికి మాత్రమే డాక్టరేట్​ డిగ్రీ ఉంది. 219 ఎమ్మెల్యేల్లో కేవలం 9మంది మాత్రమే మహిళలు ఉన్నారు. అంటే అది 4శాతం.

ADR report on Karnataka assembly elections : కర్ణాటకలో ఈ ఏడాది మేలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనిపై త్వరలోనే ఈసీ నుంచి ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం