తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Valentine's Day 2023 : భార్య బర్త్ డే మరిచిపోతే జైలుకే.. ఈ రూల్ మనకుంటే అంతే ఇక!

Valentine's Day 2023 : భార్య బర్త్ డే మరిచిపోతే జైలుకే.. ఈ రూల్ మనకుంటే అంతే ఇక!

HT Telugu Desk HT Telugu

13 February 2023, 14:19 IST

google News
    • Wife Birthday : మీకు మీ భార్య పుట్టిన రోజు గుర్తుందా? లేదంటే అడగ్గానే తలగొక్కుంటున్నారా? పెళ్లి రోజు కూడా కొన్నిసార్లు మరిచిపోతాం.. ఇంకా బర్త్ డే.. ఏం గుర్తుంటుందిలే అనుకుంటున్నారా?. కానీ ఇలా భార్య బర్త్ డే మరిచిపోతే.. ఓ దేశంలో జైలు శిక్ష తప్పదు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

ప్రతీకాత్మక చిత్రం

వాలెంటైన్స్ డే(Valentine's Day) వచ్చింది. మీ ప్రియురాలు.. కావాలనే కొన్ని ప్రశ్నలు అడగొచ్చు. అందులో మనం మెుదట ఎప్పుడు కలుసుకున్నాం? లవ్ ప్రపోజ్ చేసిన డేట్ ఏంటి? నా బర్త్ డే తేదీ ఎప్పుడు? లాంటి ప్రశ్నలు రావొచ్చు. కాస్త ప్రిపేర్ అయి ఉండండి. లేదంటే.. ఇక ఆ రోజంతా.. రచ్చ రచ్చే. బుంగమూతి పెట్టుకుని హర్ట్ అవుతారు. సరే ఇదంతా పక్కనపెడితే.. ఓ దేశంలో మాత్రం భార్య బర్త్ డే మరిచిపోతే.. మాత్రం కఠినమైన శిక్షలు ఉన్నాయి.

ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టినరోజు అనేది ప్రత్యేకమనైది. ఆ రోజున ఆ వ్యక్తికి మంచి ఫీల్ కలిగించాలి. అయితే మరిచిపోతే మాత్రం.. సమోవా అనే ద్వీపంలో చట్టరీత్యా నేరం. జైలు శిక్ష వేస్తున్నారు. భార్య పుట్టిన రోజు(Wife Birthday)ను మరిచిపోవడం కూడా నేరమే అన్నమాట. ఇది వినడానికి విచిత్రంగానే ఉంది కదా. కానీ నిజంగానే అమలు చేస్తున్నారు. ఫసిఫిక్ మహాసముద్రంలోని పాలినేషియన్ ప్రాంతంలోని సమోవా ద్వీపంలో ఇలాంటి రూల్ ఉంది. అక్కడకు వెళ్లి ఉండాలి అనుకుంటే.. ఏం కాదు. కానీ భార్య పుట్టిన రోజును మరిచిపోతే మాత్రం.. తప్పకుడా అది నేరం కింద లెక్క.

ఇక్కడి రూల్ ప్రకారం.. అనుకుని మరిచిపోయాడా.. లేదంటే.. అనుకోకుండా మరిచిపోయాడా అనేది చూడరు. మరిచిపోయాడు అంతే.. దీనితో న్యాయపరమైన చిక్కుల్లో పడతారు. ఈ విషయాన్ని భార్య వెళ్లి.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చాలు. ఇబ్బందుల ఎదుర్కోవాల్సి వస్తుంది. భర్తను తీసుకెళ్లి జైలులోకి పంపిస్తారు. అందుకే.. భర్త జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ.

అయితే ఈ చట్టంలో కాస్త వెసులుబాటు ఉంది. మెుదటిసారి భార్య పుట్టినరోజును మరిచిపోతే.. కాస్త చూసీచూడనట్టుగా వ్యవహరిస్తారు. మరోసారి అలా చేయోద్దని.. పోలీసులు హెచ్చరిస్తారు. మళ్లీ అదే రిపీట్ చేశారనుకో.. తప్పు అవుతుంది. జైలు రూపంలో శిక్ష పడుతుంది.

మన దేశంలో ఇలాంటి చట్టాలు అమలులో ఉంటే.. చాలా మంది భర్తలు జైలుకే వెళ్తారేమో. ఇక వాలెంటైన్స్ డే(Valentines Day) సందర్భంగా.. మీ ప్రియురాలి బర్త్ డేను కూడా గుర్తుపెట్టుకుని వెళ్లండి. నా బర్త్ డే ఎప్పుడు బంగారం.. అని అడిగితే.. మీరు సమాధానం చెప్పకపోతే.. తర్వాత ఏం చేయలేరు. ఇలాంటి వెరైటీ చట్టాలు కొన్ని దేశాల్లో ఉన్నాయి. ఉత్తర కొరియాలో నీలిరంగు జీన్స్ తో ఇంటి నుంచి బయటకు వెళ్లడం చట్టవిరుద్ధం.

తదుపరి వ్యాసం