Police generosity : భుజాన భార్య శవంతో నాలుగు కిలోమీటర్ల నడక…ఆదుకున్న పోలీసులు
Police generosity ఊరు కాని ఊళ్లో అనారోగ్యంతో భార్య చనిపోయింది. ఆటో డ్రైవర్ నడిరోడ్డుపై మృతదేహాన్ని దింపేసి వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో ఓ వ్యక్తి భుజాన శవంతో walked with dead body నాలుగు కిలోమీటర్లు నడిచాడు. ఆ మార్గంలో వెళుతున్న వారు ఆరా తీసిన భాష రాక సమాధానం చెప్పలేకపోయాడు. చివరకు పోలీసుల చొరవతో బాధితుడికి ఊరట లభించింది.
Police generosity అనారోగ్యంతో చనిపోయిన భార్య మృతదేహాన్ని సొంతూరు తీసుకెళ్లడానికి కాలి నడకన బయల్దేరిన అభాగ్యుడిని చూసి అంతా అయ్యో అనుకున్నారు. నిస్సహాయ పరిస్థితిలో భుజాన శవంతో walked with dead body నాలుగు కిలోమీటర్లు నడిచిన అభాగ్యుడిని చూసిన వారంతా చలించిపోయారు. చివరకు పోలీసులు స్పందించి అంబులెన్సు ఏర్పాటు చేసి గమ్య స్థానానికి పంపారు.
ఒడిశాలోని కొరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్ సొరడ గ్రామానికి చెందిన ఈడె గురు అనే మహిళ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. స్థానికంగా చికిత్స చేయించిన ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో విశాఖపట్నం వచ్చారు.
వారం రోజుల క్రితం గురును ఆమె భర్త సాములు విశాఖ జిల్లా తగరపువలసలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో పాటు చేతిలో డబ్బులు లేకపోవడంతో బుధవారం ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేసేశారు. సాలూరు వరకు వెళ్లి, అక్కడి నుంచి సొంతూరుకు మరో వాహనంలో వెళ్దామని ఆటో మాట్లాడుకున్నారు.
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం వంతెన వద్దకు చేరుకోగానే గురు మృతి చెందింది. ఆ విషయం తెలియడంతో ఆటో చోదకుడు మృతదేహాన్ని అక్కడే దింపేసి వెళ్లిపోయాడు. నిస్సహాయ స్థితిలో ఏం చేయాలో తెలియక భార్య మృత దేహాన్ని సాములు భుజాన వేసుకొని బయలుదేరాడు. దారిలో ఎదురైనవారిని సాలూరుకు ఎటు వైపు వెళ్లాలో అడుగుతూ కదిలాడు. అతనికి ఒడియా తప్ప మరో భాష తెలియకపోవడంతో ఏమి అడుగుతున్నాడో ఎవరికి అర్థం కాలేదు.
తగరపు వలస నుంచి సాలూరు వెళ్లాల్సిన మార్గంలో కాకుండా, ఆటోలో దిగిన తర్వాత తిరిగి నాలుగు కిలోమీటర్లు వెనక్కి వచ్చాడు. ఈ క్రమంలో రోడ్డుపై వెళుతున్న వారు గమనించి గంట్యాడ పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక సీఐ టి.వి.తిరుపతిరావు, గంట్యాడ ఎస్సై కిరణ్‌కుమార్ రామవరం వద్ద నడిచి వెళుతున్న సాములు వద్దకు చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అప్పటికే అలసిపోయి ఉన్న అతడికి భోజనం పెట్టించారు. మృతదేహాన్ని తరలించడానికి ప్రైవేటు అంబులెన్సు ఏర్పాటు చేశారు. 125 కిలోమీటర్ల దూరంలో బాధితుడి స్వగ్రామానికి పంపించారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని పాచిపెంట సీఐ, ఎస్సైలకు గంట్యాడ పోలీసులు సమాచారమిచ్చారు. బాధితుడి బంధువులకు విషయం తెలియజేయాలని, అవసరమైన సహకారం అందించాలని కోరారు. పోలీసులు స్పందించిన తీరుపై స్థానికులు అభినందనలతో ముంచెత్తారు.
టాపిక్