Pak Citizen Illegal Entry : భారత్‌లోకి అక్రమ ప్రవేశం, ఆపై వివాహం…! ఆపై జైలుకు..
Pak Citizen Illegal Entry భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన పాక్ పౌరుడు ఆంధ్రాకు చెందిన మహిళను పెళ్లి చేసుకుని, తొమ్మిదేళ్లు కాపురం చేశాడు. సౌదీ మీదుగా పాకిస్తాన్ తిరిగి వెళ్లే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇమ్మిగ్రేషన్ అధికారులకు దొరికిపోయి జైలు పాలయ్యాడు. నాలుగేళ్లుగా జైల్లో ఉండటంతో అతని కుటుంబ వీధిన పడింది. భర్తను విడుదల చేయాలని ఐదుగురు బిడ్డల తల్లి పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరుగుతోంది.
Pak Citizen Illegal Entry ఏపీలోని నంద్యాలకు చెందిన ఓ మహిళతో పాక్ జాతీయుడికి పద్నాలుగేళ్ల క్రితం 2010 ఫోన్‌లో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఆమె కోసం దొంగతనంగా ముంబై మీదుగా భారత్‌లో ప్రవేశించిన అతను ఎట్టకేలకు ఆమెను చేరుకున్నాడు. అప్పటికే పెళ్లై భర్త చనిపోయిన ఆ మహిళను నిఖా చేసుకున్నాడు. వారికి నలుగురు పిల్లలు కూడా పుట్టారు. తిరిగి విదేశాలకు వెళ్లే క్రమంలో ఇమ్మిగ్రేషన్ అధికారులకు దొరికిపోయి జైలు పాలయ్యాడు.
మిస్డ్ కాల్‌తో పరిచయమైన మహిళ కోసం భారత్‌లో అడుగు పెట్టడమే కాకుండా పెళ్ళి చేసుకుని పిల్లల్ని కన్న పాక్ జాతీయుడు జైలు పాలయ్యాడు. తిరిగి స్వదేశానికి వెళ్లే క్రమంలో అరెస్టయ్యాడు. ఫోన్ కాల్ ద్వారా పరిచయమైన మహిళను పెళ్లి చేసుకునేందుకు దేశంలోకి చొరబడిన పాకిస్థాన్ పౌరుడు తొమ్మిదేళ్లు ఆమెతో కాపురం చేయడమే కాకుండా నలుగురు పిల్లలను కూడా కన్నాడు.
2010లో వచ్చిన ఫోన్ కాల్ ద్వారా పాక్ జాతీయుడితో దౌలత్ బీకి పరిచయం ఏర్పడింది. ఫోన్ కాల్స్ ద్వారా పాకిస్థాన్ పౌరుడైన గుల్జార్‌ఖాన్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన గుల్జార్ అప్పట్లో సౌదీ అరేబియాలో పెయింటర్‌గా పని చేసే వాడు. ఫోన్ పరిచయంతో ఇద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకునే వారు. దౌలత్‌బీని కలిసేందుకు గుల్జార్‌ఖాన్ సౌదీ నుంచి ముంబై మీదుగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు.
ముంబై నుంచి నేరుగా గడివేములకు వచ్చి 2011 జనవరి 25న దౌలత్‌బీతో నిఖా చేసుకున్నాడు. తొమ్మిదేళ్లుగా అక్కడే కాపురం ఉన్నారు. ఈ జంటకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం కలిగారు. తొమ్మిదేళ్ల పాటు సంసారం సాఫీగానే సాగింది. గుల్జార్ గడివేములలోనే ఆధార్ కార్డు కూడా పొందాడు. దాని ఆధారంగా తనతో పాటు భార్య, ఐదుగురు పిల్లలను సౌదీ అరేబియాకు తీసుకెళ్లేందుకు వీసాలు తీసుకున్నాడు. అక్కడి నుంచి పాకిస్థాన్ వెళ్లాలనుకున్నారు.
భార్యా పిల్లలతో సహా పాకిస్తాన్ వెళ్లేందుకు గుల్జార్ 2019లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. సిబ్బంది పరిశీలనలో గుల్జార్‌ఖాన్ అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఎయిర్‌పోర్టులో భర్తకు దూరమైన దౌలత్ బీ, పిల్లలతో సహా గడివేముల గ్రామానికి తిరిగి వచ్చింది. ఒంటరిగాా సంసారం నెట్టుకురాలేక సతమతమవుతోంది. ఐదుగురు సంతానంతో పాటు బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న సోదరి పోషణ భారం కూడా ఆమెపైనే పడింది. ప్రస్తుతం ఇళ్లల్లో పనులు చేస్తూ పిల్లల్ని పోషిస్తోంది.
పెద్ద కుమారుడు మహమ్మద్ ఇలియాస్ కూలీ పనులకు వెళ్తుండగా, మిగిలిన వారంతా పదేళ్లలోపు చిన్నారులే. గుల్జార్‌ఖాన్ అరెస్టయిన ఆరు నెలల తర్వాత కోవిడ్ మహమ్మరి కారణంగా జైలు నుంచి విడుదలయ్యాడు. ఏడాది పాటు భార్య పిల్లలతో కలిసున్నాడు. 2022లో పోలీసులు అతడిని మళ్లీ హైదరాబాద్‌లోని జైలుకు తరలించారు. తన భర్తను విడుదల చేయాలని అధికారులు, కోర్టుల చుట్టూ దౌలత్ బీ తిరుగుతోంది.
టాపిక్