Vaginal yeast infection: మహిళల్లో అక్కడ మంట, దురదకు కారణం ఈస్ట్ ఇన్ఫెక్షన్, దీన్ని ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకోండి
24 September 2024, 9:30 IST
- Vaginal yeast infection: మహిళల్లో ఈస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల యోనిలో మంట, దురద అనిపిస్తుంది. ఇది చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుందో, చికిత్స ఎలా తీసుకోవాలో తెలుసుకోండి.
ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది?
Vaginal yeast infection: మహిళల్లో ఎక్కువగా వచ్చే సమస్య ఈస్ట్ ఇన్ఫెక్షన్. దీని వల్ల యోని భాగంలో తీవ్రమైన మంట, దురద వస్తుంది. దీనికి సింపుల్ చికిత్సలే అందుబాటులో ఉన్నాయి. కానీ మహిళలు ఈ సమస్యను వైద్యులకు చెప్పేందుకు సిగ్గుపడి చికిత్సను తీసుకోవడం లేదు. ఈస్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం, ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా దీన్ని బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు.
ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది?
మహిళల్లో హార్మోన్ల మార్పులు అధికంగా ఉన్నా, మధుమేహంతో బాధపడుతున్నా, రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా మారినా, హార్మోన్ల మార్పులు అధికంగా ఉన్నా, బిగుతుగా ఉండే ప్యాంటీలు వేసుకున్నా... ఇలా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఈస్ట్ ఇన్ఫెక్షన్‌ను క్యాండియాసిస్ అని కూడా పిలుస్తారు. యోనిలో ఈస్ట్ లేదా క్యాండిడా అల్బికాన్స్ అధికంగా పెరగడం వల్ల వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇది. సాధారణంగా మహిళ యోనిలో క్యాండిడా అని పిలిచే బాక్టీరియా ఉంటుంది. బ్యాక్టిరియా, ఈస్ట్‌లు యోనిలో సమతుల్యంగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ సమతుల్యత చెదిరిపోతుందో... ఈస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇదే ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది.
ఎందుకు వస్తుంది?
చాలామంది మహిళలు యాంటీబయోటిక్స్ వాడాక నాలుగు నుండి ఆరు వారాల తర్వాత యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్ సమస్యను అనుభవిస్తారు. యాంటీ బయోటిక్స్ వల్ల ఈస్ట్ పెరిగిపోతుంది. మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. దీనివల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతుంది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థతో ఉన్నవారు, హెచ్ఐవి ఎయిడ్స్ వంటి సమస్యలు ఉన్నవారు కూడా ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. మధుమేహంతో బాధపడే మహిళలు కూడా ఈస్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తడి బట్టలు వాడడం, చెమటతో కూడిన దుస్తులను వేసుకోవడం, పరిశుభ్రత లేకపోవడం అనేది కూడా యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్‌కు కారణం. కాబట్టి ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉండడం అవసరం.
చికిత్స ఎలా?
యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్‌తో బాధపడే వారికి కొన్ని రకాల మందులను సూచిస్తారు. ఇవి యాంటీ ఫంగల్ మందులు. వీటిని నోటి ద్వారా వేసుకోవచ్చు. లేదా క్రీములు ఆయింట్మెంట్లను యోని ప్రాంతంలో అప్లై చేయవచ్చు. వీటి వల్ల దురద త్వరగా తగ్గుతుంది.
ఈస్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండాలంటే ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇది యోనిలో బ్యాక్టీరియా, ఈస్ట్‌ల సహజ సమతుల్యతను కాపాడతాయి. కాబట్టి ప్రతి రోజు కప్పు పెరుగును తినడం అలవాటు చేసుకుంటే మీరు ఈస్ట్ ఇన్ఫెక్షన్ బారిన తక్కువగా పడతారు. అలాగే తేనెను తినడం ద్వారా కూడా ఈస్ట్ ఇన్ఫెక్షన్‌ను బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.
యోని ప్రాంతాన్ని పరిశుభ్రంగా, పొడిగా ఉంచుకుంటే ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావు. లోదుస్తులను వదులుగా ఉండేలా చూసుకోవాలి. అలాగే కాటన్ లోదుస్తులను వేసుకుంటే మంచిది. ఆహారంలో కూడా కొన్ని రకాల మార్పులు చేసుకోవడం అవసరం. డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా కాపాడుకోవాలి. పండ్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
టాపిక్