తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dangerous Forests : ప్రపంచంలో డేంజర్ అడవులు.. అక్కడకు వెళ్తే అంతే సంగతులు

Dangerous Forests : ప్రపంచంలో డేంజర్ అడవులు.. అక్కడకు వెళ్తే అంతే సంగతులు

Anand Sai HT Telugu

06 March 2024, 9:30 IST

google News
    • Dangerous Forests In World : ప్రపంచంలో ఎన్నో వింతైన ఘటనలు ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే వెన్నులో వణుకు పడుతుంది. అలా కొన్ని అడవులు ఉన్నాయి. అక్కడ వింతైన పరిస్థితులు జరుగుతాయి.
అడవుల్లో రహస్యాలు
అడవుల్లో రహస్యాలు (Unsplash)

అడవుల్లో రహస్యాలు

అడవులు మానవులకు ప్రకృతి ప్రసాదించిన వరం. మనిషి మనుగడలో అడవుల పాత్ర చాలా ముఖ్యమైనది. కానీ అన్ని అడవులు ఆహ్లాదంగా ఉండవు, కొన్ని అడవులు అనేక రహస్యాలు కలిగి ఉంటాయి. ప్రపంచంలోని కొన్ని అడవుల్లో ఎన్నో వింతలు ఉన్నాయి. ఈ అడవుల్లోకి వెళ్లడం అనేది ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. గుండెల్లో భయం ఉన్నవారు సాధారణంగా ఈ అడవులను సందర్శించకుండా ఉంటారు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన అడవుల గురించి తెలుసుకుందాం..

అకిగహారా ఫారెస్ట్ ప్రపంచంలోని అత్యంత అపఖ్యాతి పాలైన అడవులలో ఒకటి. దీనికి కారణం అక్కడ జరిగిన అనేక ఆత్మహత్యలు. ఈ అడవి దట్టమైన చెట్లు, నిశ్శబ్దంతో నిండి ఉండటమే కాకుండా, సందర్శకులను తీవ్రంగా భయపెట్టే అనేక ఘటనలు కలిగి ఉంది. ఇక్కడ చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.

హోయా పాసియు ఫారెస్ట్ గ్రహాంతర అంతరిక్ష నౌకలు, అదృశ్యాలు, ఇతర దృశ్యాలతో సహా అనేక రకాల సంఘటనలు ఇక్కడ జరిగాయి. ఇక్కడకు వెళ్లాలంటే చాలా గుండె ధైర్యం కావాలి. ఎన్నో ఇక్కడ మిస్ అయ్యాయి.

ఉత్తర ఐర్లాండ్‌లోని బల్లిపోలి ఫారెస్ట్ లో వింతలు జరుగుతాయి. తెలుపు రంగులో ఉన్న ఒక మహిళ వెంటాడుతుందని పుకారు వచ్చింది. బల్లిపోలి ఫారెస్ట్ చాలా మంది సందర్శకులకు భయానక భావాన్ని కలిగించింది. ఈ అడవి ప్రపంచంలోని అత్యంత వింత అడవులలో ఒకటి. ఎందుకంటే చాలా మంది స్థానికులు వింత లైట్లు, దృశ్యాలను అడవిలో చూసినట్లు చెబుతారు.

ఎపింగ్ ఫారెస్ట్.. ఇంగ్లండ్‌లోని అత్యంత ప్రమాదకరమైన అడవులలో ఒకటిగా ఉంది. ఎప్పింగ్ ఫారెస్ట్ దెయ్యాల బొమ్మలకు నిలయంగా ఉందని అంటుంటారు. ఇక్కడకు వెళ్లాలంటే ప్రజలకు ఎక్కువగా భయపడుతారు.

బ్లాక్ ఫారెస్ట్ జర్మనీలో అత్యంత ఘోరమైన అడవులలో ఒకటి. అడవిలోకి వెళ్లిన వారికి వింత ప్రదేశంలో తెల్లటి దుస్తులు ధరించిన లేడీ తరచుగా కనిపిస్తుందని చాలా కథలు చెబుతున్నాయి.

ఇంగ్లాండ్ లోని డేరింగ్ వుడ్ అడవికి కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ ఎంతో మంది విషాదకరమైన ముగింపును తమ జీవితాలకు పలికారని అంటుంటారు. వారి ఆత్మలు వెంటాడుతాయని ఓ నమ్మకం ఉంది. అరుపులు, కేకలు విన్నారని సందర్శకులు నివేదించారు, ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువ శబ్ధాలు వస్తాయని చెబుతారు.

ఇంగ్లండ్‌లోని బోర్లీ రెక్టరీ వుడ్స్ అడవి ఆత్మల కథలతో ముడిపడి ఉంది. దీని వెనక ఎంతో గతం ఉంది. ఈ ప్రాంతంలోని విషాద సంఘటనలతో నిండి ఉందని చెబుతారు. ఆత్మలు చెట్ల మధ్య ఉంటాయని, ఇది అడవిలో భయాన్ని కలిగిస్తుందని నమ్ముతారు.

తదుపరి వ్యాసం