
(1 / 6)
ఈశాన్య భారత రాష్ట్రాలు ప్రకృతి అందాలకు నెలవు. చిన్నిచిన్ని అడవులు, లోయలు, నదీ పాయలు, పర్వత పాదాలు.. ఇలా అన్ని అద్భుతంగా ఉంటాయి.
(Representative Image (Unsplash))
(2 / 6)
Dzukou Valley Sacred Grove, Nagaland: నాగాలాండ్, మణిపూర్ సరిహద్దుల్లో ఈ లోయ ఉంటుంది. దీన్ని స్థానికులు అత్యంత పవిత్ర లోయగా భావిస్తుంటారు.
(Instagram/@jitofalltrades)
(3 / 6)
Pobitora Wildlife Sanctuary Sacred Grove, Assam: ఇది అస్సాంలోని పొబిటొర వైల్డ్ లైఫ్ సాంక్చువరీ. ఇది ఒంటి కొమ్ము రైనోసీరస్ లకు ప్రసిద్ధి. ఇది దుర్గామాత నివాసంగా స్థానికులు భావిస్తుంటారు.
(Instagram/@sachin_bharali)
(4 / 6)
Dehing Patkai Sacred Grove, Assam: ఈ డెహింగ్ పట్కాయి వైల్డ్ లైఫ్ సాంక్చువరీ కూడా అస్సాంలోనే ఉంది. స్థానికంగా ఉన్న తాహి అహోమ్ తెగవారికి ఈ ప్రాంతం అత్యంత పూజనీయం. ఇక్కడ అరుదైన జంతు, పక్షి, వృక్ష జాతులున్నాయి.
(Instagram/@pranab_jyoti_dutta)
(5 / 6)
Mawphlang Sacred Grove, Meghalaya: ఇది మేఘాలయలోని మాఫ్లాంగ్ సేక్రెడ్ గ్రోవ్. షిల్లాంగ్ కు సమీపంలో ఉంటుంది. స్థానిక ఖాసి ప్రజల సంస్కృతీ సంప్రదాయాలకు ఇది నెలవు. అరుదైన జంతు, పక్షి, వృక్ష జాతులు ఇక్కడ ఉన్నాయి.
(Instagram/@unexplorednortheast)
(6 / 6)
Thangbuli Sacred Grove, Manipur: మణిపూర్ లోని తంగబులై అటవీ ప్రాంతం. స్థానికులైన జెలియాంగ్రాంగ్ తెగ వారి పూజ్యనీయ ప్రదేశం ఇది. ఇక్కడ పెరిగే ఔషధ మొక్కలు స్థానికంగా చాలా ఫేమస్.
(Instagram/@magnificent_meghalaya)ఇతర గ్యాలరీలు