తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weight Loss: 30 కేజీల బరువు తగ్గిన మహిళ.. డైలీ ఏం తిన్నానో చెప్పిన అమ్మాయి.. ఇడ్లీ సాంబార్, వెజ్ బిర్యానీ కూడా..

Weight loss: 30 కేజీల బరువు తగ్గిన మహిళ.. డైలీ ఏం తిన్నానో చెప్పిన అమ్మాయి.. ఇడ్లీ సాంబార్, వెజ్ బిర్యానీ కూడా..

19 November 2024, 15:31 IST

google News
    • Weight loss: ఓ మహిళ ఏకంగా 30 కేజీల బరువు తగ్గారు. ఈ వెయిట్ లాస్ జర్నీలో తాను ప్రతీ రోజు ఏం తింటున్నానో పూర్తిగా డైట్ ప్లాన్ వెల్లడించారు. ఇడ్లీ సాంబార్, బిర్యానీ లాంటివి కూడా తింటున్నానని చెప్పారు. ఆమె ప్రతీ రోజు ఏం తిన్నారంటే..
Weight loss: 30 కేజీల బరువు తగ్గిన మహిళ.. డైలీ ఏం తిన్నానో చెప్పిన అమ్మాయి
Weight loss: 30 కేజీల బరువు తగ్గిన మహిళ.. డైలీ ఏం తిన్నానో చెప్పిన అమ్మాయి

Weight loss: 30 కేజీల బరువు తగ్గిన మహిళ.. డైలీ ఏం తిన్నానో చెప్పిన అమ్మాయి

బరువు తగ్గేందుకు కొందరు ప్రత్యేకంగా తమ కోసం డైట్ ప్లాన్ నిర్దేషించుకుంటారు. దాన్నే పాటిస్తూ వెయిట్ లాస్‍లో సక్సెస్ అవుతారు. తులసి నితిన్ అనే డైట్ కోచ్ కూడా ప్రత్యేకమైన డైట్ ప్లాన్ పాటించి బరువు తగ్గారు. ఏకంగా 30 కేజీల వెయిట్ లాస్ అయ్యారు. ఈ విషయాన్ని ఇన్‍స్టాగ్రామ్ ద్వారా ఆమె వెల్లడించారు. ఈ వెయిట్ లాస్ జర్నీలో తాను ప్రతీ రోజు ఏం తిన్నానో వివరంగా షేర్ చేశారు.

ఇంట్లోనే వండుకోండి

బరువు తగ్గాలంటే ఏం తినాలనే సందేహంగా ఉన్న వారు తమ శరీరానికి సరిపడే డైట్ ప్లాన్ కోసం న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించాలని తులసి నితిన్ సూచించారు. పోషకాలు, టేస్ట్, ఫిట్‍నెస్‍ను సమతుల్యం చేసుకోవాలనుకుంటే అలా చేయాలన్నారు. తాను పాటించిన డైట్‍ను చెబుతున్నానని ఆమె షేర్ చేశారు. కొన్ని టిప్స్ చెబుతూనే.. తాను ప్రతీ రోజు ఏం తిన్నానో వెల్లడించారు.

బరువు తగ్గేందుకు ప్రయత్నించే వారు ఇంట్లో వండినవే తినాలని సూచించారు. “వంటకాల్లో వీలైనంత తక్కువగా నూనె లేదా వెన్నె వేసుకోవాలి. చెక్కర, ఉప్పు ఎంత తగ్గిస్తే ఆరోగ్యానికి అంత మంచిది. ఆహారమంతా ఇంట్లోనే వండుకోవాలి. అనారోగ్యకరమైన వాటి వైపు చూడకుండా ముందుగానే మీల్స్, స్నాక్స్ రెడీ చేసిపెట్టుకోవాలి. మాక్రోన్యూట్రియంట్స్ (ప్రోటీన్, ఫ్యాట్స్, కార్బ్స్), మైక్రోన్యూటియంట్స్ (విటమిన్లు, మినరల్స్) సహా నీరు ఎక్కువగా తీసుకోడం లక్ష్యంగా పెట్టుకోవాలి” అని తులసి నితిన్ చెప్పారు.

ఆమె ప్రతీ రోజు తిన్నవి ఇవే

సోమవారం

  • ఉదయం 10 గంటలకు బ్రేక్‍ఫాస్ట్ - పన్నీర్ స్టఫ్ చేసిన పెసరపప్పు ఊతప్పం
  • ఉదయం 11.30 గంటలకు మిడ్ మార్నింగ్ స్నాక్స్ - 100 గ్రాముల సీజనల్ పండ్లు
  • మధ్యాహ్నం 2 గంటలకు లంచ్ - 1 రోటీ + పప్పు + పనీర్ కర్రీ + సలాడ్ + పెరుగు
  • సాయంత్రం 5 గంటలకు స్నాక్ - వేయించిన మఖానా
  • 7.30 గంటలకు డిన్నర్ - దాల్ కిచిడీ, సలాడ్

మంగళవారం

  • ఉదయం 10 గంటలకు బ్రేక్‍ఫాస్ట్ - 2 ఇడ్లీ + సాంబార్ + కొబ్బరి చట్నీ
  • ఉదయం 11.30 గంటలకు మిడ్ మార్నింగ్ స్నాక్స్ - చియా విత్తనాలతో పండ్లు తినడం
  • మధ్యాహ్నం 2 గంటలకు లంచ్ - 80 గ్రాముల పన్నీర్‌తో వెజిటబుల్ బిర్యానీ
  • సాయంత్రం 5 గంటల స్నాక్ - ఒక గిన్నె మరమరాలు
  • రాత్రి 7.30 గంటలకు డిన్నర్ - శనగలు కలిపి ఫ్రై చేసిన కూరగాయలు

బుధవారం

  • ఉదయం 10 గంటలకు బ్రేక్ ఫాస్ట్ - ఒక శనగపిండి ఊతప్పం + గ్రీన్ చట్నీ
  • ఉదయం 11.30 గంటలకు - 1 గ్లాస్ ఏబీసీ జ్యూస్ (యాపిల్, బీట్‍రూట్, క్యారెట్‍తో చేసినది)
  • లంచ్ మధ్యాహ్నం 2 గంటలకు - ఓ రోటీ, శనగల కర్రీ, సలాడ్, పెరుగు
  • సాయంత్రం 5 గంటలకు స్నాక్ - 10 నానబెట్టిన బాదం పప్పులు
  • రాత్రి 7.30 గంటలకు డిన్నర్ - పన్నీర్, కూరగాయలతో చేసిన ఫ్రైడ్ రైస్

గురువారం

  • ఉదయం 10 గంటలకు బ్రేక్‍ఫాస్ట్ - ఓ కప్పు పెరుగుతో ఒక వెజిటబుల్ పరాఠా
  • ఉదయం 11.30 గంటలకు - 100 గ్రాముల సీజనల్ పండ్లు
  • మధ్యాహ్నం 2 గంటలకు లంచ్ - కూరగాయలతో 100 గ్రాముల పన్నీర్
  • సాయంత్రం 5 గంటలకు స్నాక్ - వేయించిన శనగలు
  • రాత్రి 7.30 గంటలకు డిన్నర్ - 100 గ్రాముల అన్నం, 100 గ్రాముల రాజ్మా (కిడ్నీ బీన్స్), సలాడ్

శుక్రవారం

  • ఉదయం 10 గంటలకు బ్రేక్‍ఫాస్ట్ - పండ్లతో పాటు రాత్రంతా నానబెట్టిన ఓట్స్
  • ఉదయం 11.30 గంటలకు - ఓ గ్లాస్ కూరగాయల జ్యూస్
  • మధ్యాహ్నం 2 గంటలకు లంచ్ - ఒక రోటీ + సోయా కర్రీ + సలాడ్ + పెరుగు
  • సాయంత్రం 5 గంటలకు స్నాక్స్ - పీనట్ బటర్‌తో యాపిల్ ముక్కలు
  • రాత్రి 7.30 గంటలకు డిన్నర్ - కూరగాయలతో మొక్కజొన్న, పన్నీర్ సలాడ్

శనివారం

  • ఉదయం 10 గంటలకు బ్రేక్‍ఫాస్ట్ - కూరగాయలతో స్టఫ్ చేసినన 2 ఓట్స్ ఊతప్పలు
  • ఉదయం 11.30 గంటలకు - స్ట్రాబెర్రీతో పెరుగు
  • మధ్యాహ్నం 2 గంటలకు లంచ్ - 100 గ్రాముల అన్నం + పప్పు + బెండకాయ + పెరుగు
  • సాయంత్రం 5 గంటలకు స్నాక్స్ - 10 నానబెట్టిన బాదంపప్పుతో ఓట్‍మీల్
  • రాత్రి 7.30 గంటలకు డిన్నర్ - కూరగాయలతో గంజి

ఆదివారం

  • ఉదయం 10 గంటలకు బ్రేక్ ఫాస్ట్ - ఓ పన్నీర్ శాండ్‍విచ్ (పన్నీర్, కూరగాయలు)
  • ఉదయం 11.30 గంటలకు - 100 గ్రాముల సీజనల్ పండ్లు
  • మధ్యాహ్నం 2 గంటలకు లంచ్ - ఓ రోటీ + పప్పు + పన్నీర్ కర్రీ + సలాడ్ + పెరుగు
  • సాయంత్రం 5 గంటలకు స్నాక్ - ఓ ప్రోటీన్ బార్
  • రాత్రి 7.30 గంటలకు డిన్నర్ - సోయాబీన్ పుట్టగొడుగుల కర్రీ, ఓ రోటీ, సలాడ్

గమనిక: బరువు తగ్గేందుకు తాను పాటించిన డైట్‍ను ఆ మహిళ చెప్పిన విషయాలు ఈ కథనంలో ఇచ్చాం. అందరి పరిస్థితులు ఒకేలా ఉండవు. అందుకే, బరువు తగ్గాలనుకునే వారు వారి శరీర పరిస్థితి, ఆరోగ్యం, ఫిట్‍నెస్, పరిస్థితులు, ఇష్టాలను బట్టి డైట్, వ్యాయామాలు ప్లాన్ చేసుకోవాలి. వెయిట్ లాస్ అవ్వాలని నిర్ణయించుకుంటే ఫిట్‍నెస్ నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకుంటే మేలు.

తదుపరి వ్యాసం