Fart Stop Problems : పిత్తులు ఆపుకుంటే వచ్చే సమస్యలేంటి.. నవ్వకండి సీరియస్ మ్యాటర్
07 June 2024, 9:30 IST
- Fart Hold Problems In Telugu : పిత్తులు అనగానే మనలో చాలా మందికి నవ్వు వచ్చేస్తుంది. కానీ ఇది శరీరంలో జరిగే సహజ ప్రక్రియ. నవ్వాల్సిన అవసరమే లేదు. చాలా మంది కొన్ని సందర్భాల్లో పిత్తులను ఆపుకొంటారు. దీని ద్వారా శరీరంలో చాలా సమస్యలు వస్తాయి.
అపానవాయువు ఆపుకుంటే వచ్చే సమస్యలు
మనిషి శ్వాస తీసుకోవడం, తినడం, పడుకోవడం.. ఎలా చేస్తాడో పిత్తులు కూడా అలాంటిదే. దీని గురించి నవ్వాల్సిన పని లేదు. ఇది శరీరంలో జరిగే ఒక ప్రక్రియ అంతే. కానీ ఈ విషయాన్ని చెప్పగానే చాలా మంది నవ్వడం మెుదలుపెడతారు. నవ్వితే మీకే లాస్. కచ్చితంగా పిత్తుల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. దీనిని అపానవాయువు అని కూడా అంటారు. కొందరు దీనిని ఎక్కువగా వదులుతారు. మరికొందరేమో జనాలు ఉన్నారు కదా అని ఆపుకుంటారు. కానీ ఇలా చేస్తే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కొంటారు.
అపానవాయువు అందరిలోనూ ఉంటుంది. ఇది ఇతరులకు ఇబ్బందికలిగిస్తుందని చాలా మంది ఆపుకుంటారు. కానీ పిత్తులు వలన చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ ఆపుకుంటే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదన్నది వాస్తవం. శరీరంలో ఉన్న గ్యాస్ కింద నుంచి కొన్నిసార్లు బయటకు పోతుంది. ఈ సాధారణంగా జరిగే విషయం. పెద్దగా చింతించాల్సిన పని లేదు.
ఇది పూర్తిగా సాధారణ ప్రక్రియ అయినప్పటికీ కొన్నిసార్లు పెద్దగా, ఇతరుల ముందు ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే మనలో చాలా మంది దీనిని ఆపుకోడానికి ప్రయత్నిస్తారు. అయితే అలా చేయడం చాలా ప్రమాదాలను కలిగిస్తుంది. అపానవాయువును పట్టుకోవడం కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. వాటి గురించి తెలుసుకుందాం..
గ్యాస్ సమస్యలు
మీ శరీరం నుండి గ్యాస్ కొన్నిసార్లు ఆగకుండా బయటకు వచ్చినప్పుడు, దానిని రాకుండా ఆపడం మంచిది కాదు. ఇది మళ్లీ మీ అసౌకర్యాన్ని పెంచుతుంది. ఇది మళ్లీ మీలోకి వెళ్తుంది. దీని ద్వారా గ్యాస్ సంబంధిత సమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బినట్టుగా అనిపిస్తుంది. అసౌకర్యంగా ఫీలవుతారు. అందువల్ల, అటువంటి పరిస్థితులపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం.
అనేక సమస్యలు
గ్యాస్ బయటకు రాకుండా ఉండటానికి మీరు ఉద్దేశపూర్వకంగా ఆపితే.. మీ కండరాలను సంకోచించినప్పుడు, అది మీ శరీరం లోపల ఒత్తిడిని సృష్టిస్తుంది. నొప్పి, అజీర్ణం, గుండెల్లో మంటను కలిగిస్తుంది. క్రమం తప్పకుండా ఇలా చేస్తే ఇది మీ జీర్ణవ్యవస్థలో మంటను కలిగిస్తుంది. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మరింత ప్రమాదకరం.
పెద్దపేగు అనారోగ్యం
పిత్తులు మీ శరీరం నుండి ఒత్తిడిని తొలగిస్తుంది. కానీ అది బయటకు రానప్పుడు, ఇది తరచుగా మీ పెద్దపేగుకు సమస్యలను కలిగిస్తుంది. ఇది హేమోరాయిడ్లకు కారణమవుతుంది. ఇది పెద్దపేగు రుగ్మతలకు దారి తీస్తుంది. ఏ కారణం చేతనైనా గ్యాస్‌ను ఆపకూడదు. ఎల్లప్పుడూ బయటికి పంపించేందుకే ప్రయత్నం చేయండి.
కడుపు ఉబ్బడం
తరచుగా అపానవాయువు రాకుండా ఆపుకోవడం వల్ల కడుపు ఉబ్బినట్లు అనిపిస్తుంది. ఈ రకమైన విషయం మీకు చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఇది మీకు అనారోగ్యాన్ని సూచిస్తుంది. గ్యాస్‌ను ఎప్పుడూ ఆపుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
వైద్యుడిని సంప్రదించాలి
అపానవాయువు పూర్తిగా సాధారణమైనది. వచ్చే శబ్ధం, వాసన ఆధారంగా ఆహార సమస్యలు, జీర్ణ సమస్యల వంటి ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది. చెడు వాసన గల గ్యాస్ మీ శరీరంలో అధిక సల్ఫర్ స్థాయిలను కూడా చెబుతుంది. మీకు కడుపులో ఏదైనా నొప్పి అనిపించినా లేదా అసాధారణంగా ఏదైనా అనిపిస్తే మీరు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.
వీటిని తగ్గించండి
కార్బోనేటేడ్ పానీయాలు మీ శరీరంలో ఎక్కువ గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తాయి, వాటిని నివారించండి. చిన్న చిన్న మెుత్తంలో నములుతూ తినండి. నెమ్మదిగా నమలండి. దుర్వాసనను నివారించడానికి అరటిపండ్లు, బంగాళదుంపలు, ధాన్యాలు, గోధుమలు వంటి ఆహారాలను క్రమం తప్పకుండా తినండి. ఈ విషయాలన్నీ జాగ్రత్తగా చూసుకుంటే పై సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.