Android to iPhone.. ఇలా ఈజీగా వాట్సాప్ డేటాట్రాన్స్‌ఫర్ చేయండి!
22 July 2022, 18:10 IST
- ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు వాట్సప్ డేటా సులువుగా బదిలీ చేసేందుకు whats app కొత్త విధానాన్ని తీసుకోచ్చింది. అయితే Android to iPhoneకు డేటాను ఈజీగా ఎలా బదిలీ చేయాలో ఇప్పుడు చూద్దాం..
WhatsApp allows transfer of chats, other data from Android to iPhone
ప్రముఖ ఇన్‌స్టాంట్ యాప్ వాట్సప్ (WhatsApp) మరో అప్‌డెట్‌ను అందించింది. Android ఫోన్ నుండి iPhoneకి మైగ్రేట్ అవుతున్న యూజర్స్ వాట్సప్ చాట్‌ను కూడా సురక్షితంగా ట్రాన్స్‌పర్ చేసుకోవచ్చు. దీని కోసం WhatsApp కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకవచ్చింది. తాజాగా ఈ ముఖ్యమైన అప్‌డేట్‌కు సంబంధించిన విషయాన్ని మెటా-బ్యాక్డ్ మెసేజింగ్ యాప్ తన ట్విట్టర్ ఖాత ద్వారా ప్రకటించింది. "ఈరోజు నుండి మీరు మీ మొత్తం చాట్ హిస్టరీని Android నుండి iOSకి వైస్ వెర్సాలో బదిలీ చేసుకునే ఆప్షన్‌ను కలిగి ఉంటారు. ఇప్పుడు సమాచారాన్ని మార్చుకునే స్వేచ్ఛ మీకు ఉంద"ని వెల్లడించింది. WhatsApp తన బ్లాగ్‌లో తెలిపిన వివరాల ప్రకారం ఒక వినియోగదారిని ఖాతా సమాచారం, ప్రొఫైల్ ఫోటో, వ్యక్తిగత చాట్‌లు, గ్రూప్ చాట్‌లు, చాట్ హిస్టరీ, మీడియా, సెట్టింగ్‌లను Android నుండి iPhoneకి బదిలీ చేయవచ్చు. అయితే, కాల్ హిస్టరీ బదిలీ, డిస్‌ప్లే పేరు ఈ తాజా అప్‌డేట్ నుండి మినహాయించబడింది.
మీ WhatsApp చాట్‌లను Android నుండి iPhoneకి బదిలీ చేసుకునే విధానం:
Step 1: మీ Android ఫోన్‌లో Move to iOS యాప్‌ని తెరిచి, స్క్రీన్‌పై ప్రాంప్ట్‌లను అనుసరించండి.
step 2: మీ iPhoneలో కోడ్ డిస్ప్లే చేయడుతుంది. మీ Android ఫోన్‌లో ఆ కోడ్‌ని నమోదు చేయండి
step 3: కొనసాగించుపై నొక్కండి. ఆన్-స్క్రీన్ ప్రాంప్ట్‌లను అనుసరించండి.
step 4: ట్రాన్స్‌ఫర్ డేటా స్క్రీన్‌లో WhatsAppని ఎంచుకోండి.
step 5: మీ Android ఫోన్‌లో START నొక్కండి. ఎక్స్పోర్ట్ కోసం డేటాను సిద్ధం అయేంత వరకు వేచి ఉండండి. డేటా సిద్ధమైన తర్వాత మీరు మీ Android ఫోన్ నుండి సైన్ అవుట్ చేయబడతారు.
step 6: Move to iOS యాప్‌కి తిరిగి రావడానికి NEXTని నొక్కండి.
step 7: మీ Android ఫోన్ నుండి మీ iPhoneకి డేటాను బదిలీ చేయడానికి కొనసాగించుపై నొక్కండి. బదిలీ పూర్తయంతే వరకు వేచి ఉండండి.
step 8: యాప్ స్టోర్ నుండి వాట్సాప్ తాజా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేయండి
step 9: WhatsApp తెరిచి, మీ పాత డివైజ్‌లో ఉపయోగించిన అదే ఫోన్ నంబర్‌ను ఉపయోగించి లాగిన్ చేయండి.
step10: ప్రాంప్ట్ చేసినప్పుడు ప్రారంభించు నొక్కండి. ప్రక్రియను పూర్తి చేయడానికి అనుమతించండి.
step11: మీ కొత్త డివైజ్‌ను యాక్టివేట్ చేయడం పూర్తి చేయండి. తర్వాత మీ చాట్‌లు కనిపిస్తాయి.
మీరు iCloud బ్యాకప్‌ని క్రియేట్ చేసేంతవరకు బదిలీ చేయబడిన డేటా మైగ్రేషన్ క్లౌడ్ స్టోరేజిలోకి వెళ్లదని గమనించాలి. అంతేకాకుండా, వినియోగదారు WhatsAppని తొలగించేంత వరకు Android ఫోన్‌లో ఇప్పటికీ డేటా అలానే ఉంటుంది.
రెండు డివైజ్‌లు వేర్వేరు ఫోన్ నంబర్‌లను కలిగి ఉంటే:
మీ WhatsApp డేటాను కొత్త ఫోన్ నంబర్‌కి బదిలీ చేయడం సాధ్యం కాదు. అయితే, మీ కొత్త ఫోన్‌కి వెళ్లే ముందు మీరు పాత పరికరంలోని ఫోన్ నంబర్‌ను మీ కొత్త ఫోన్ నంబర్‌కి మార్చుకోవచ్చు.
టాపిక్