Yellow Sperm : స్పెర్మ్ తెల్లగా కాకుండా పసుపు రంగులో ఉందా? అయితే డేంజరే
02 January 2024, 20:00 IST
- Yellow Semen Reasons : స్పెర్మ్ అనేది తెల్లగా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. కానీ కొందరికి పసుపు రంగులోనూ వస్తుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతీకాత్మక చిత్రం
పురుషులలో స్పెర్మ్ నాణ్యత, స్పెర్మ్ కౌంట్ అతని ఆరోగ్యాన్ని సూచిస్తాయి. స్పెర్మ్ రంగు మారడం వ్యాధికి సంకేతం. వీర్యం అనేది చిక్కటి జెల్‌లాగా ఉంటుంది. ఇది లైంగిక కార్యకలాపాల సమయంలో పురుష జననేంద్రియాల నుండి విడుదలవుతుంది. దీని రంగు సాధారణంగా తెల్లగా ఉంటుంది. ఇది కూడా పురుషుడి ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. కానీ కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల పురుషుల స్పెర్మ్ రంగు పసుపు రంగులోకి మారుతుంది. దీనికి కారణాలు ఉన్నాయి.
కొన్నిసార్లు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కారణంగా పురుషుల స్పెర్మ్ రంగు పసుపు రంగులోకి మారుతుంది. ఇది ప్రోస్టేట్ గ్రంధిలోకి బ్యాక్టీరియా ప్రవేశించడం వల్ల వచ్చే ప్రొస్టటైటిస్ అనే UTIకి దారితీస్తుంది. కామెర్లు ఉన్నవారిలో వీర్యం రంగు పసుపు రంగులో ఉండవచ్చు. ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నం కారణంగా ఇది వస్తుంది.
లైంగికంగా సంక్రమించే వ్యాధులు(STD) కూడా ఎల్లో స్పెర్మ్ రావడానికి కారణమవుతాయి. ఒక వ్యక్తికి లైంగికంగా సంక్రమించే వ్యాధి లేదా STD ఉంటే అతని స్పెర్మ్ రంగు పసుపు రంగులో కనిపించవచ్చు.
పురుషుల్లో తెల్లరక్తకణాలు పెరగడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. దీని కారణంగా స్పెర్మ్ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. కొన్నిసార్లు దాని రంగు పసుపు రంగులోకి మారుతుంది. శరీరంలో ఏవైనా వింత మార్పులు సంభవిస్తే, చికిత్స కోసం మీ వైద్యుడిని సంప్రదించాలి. ఇన్ఫెక్షన్ లేదా STD అయితే యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయవచ్చు. నిపుణుల సలహా తీసుకోవాలి.
స్పెర్మ్ నాణ్యత పెరిగేందుకు మీరు తీసుకునే ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. రెడ్ మీట్, వేయించిన ఆహారాలు, చక్కెర పానీయాలు, స్వీట్లకు దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, చేపలతో సహా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే పురుషులలో స్పెర్మ్ కౌంట్ ఎక్కువగా ఉంటుంది. గుడ్లలో ప్రోటీన్, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇది స్పెర్మ్ ను మెరుగుపరుస్తుంది.
అరటిపండులో మెగ్నీషియం, విటమిన్ బి1, సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి స్పెర్మ్ ఉత్పత్తిని పెంచుతాయి. అరటిపండ్లలో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది స్పెర్మ్ కదలికలో సహాయపడుతుంది. బచ్చలికూర ఫోలిక్ యాసిడ్ కలిగి ఉంటుంది, ఇది స్పెర్మ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. వెల్లుల్లిలోని సెలీనియం అనే ఎంజైమ్ స్పెర్మ్ మొటిలిటీని పెంచడంలో సహాయపడుతుంది. దానిమ్మ పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తప్రవాహంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి, స్పెర్మ్‌ను దెబ్బతినకుండా కాపాడతాయి.
టొమాటోల్లో విటమిన్ సి, లైకోపీన్ పుష్కలంగా ఉండటం వల్ల వీర్య కణాల సంఖ్యను మెరుగుపరుస్తుంది. గుమ్మడికాయ గింజలు మీ పునరుత్పత్తి ఆరోగ్యానికి అద్భుతాలు చేయగలవు. విత్తనాలలో యాంటీఆక్సిడెంట్లు, ఫైటోస్టెరాల్స్, అమైనో ఆమ్లాలు ఉంటాయి. క్యారెట్ బీటా-కెరోటిన్ కలిగి ఉంటుంది. ఫ్రీ రాడికల్స్ ద్వారా మీ స్పెర్మ్ దెబ్బతినకుండా నిరోధించడానికి ఇది అవసరమైన యాంటీఆక్సిడెంట్. అంతేకాదు.. వాల్‌నట్‌లు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లను కలిగి ఉంటాయి. అవి స్పెర్మ్ చలనశీలతను మెరుగుపరుస్తాయి.