Cyber Insurance Policy : సైబర్ బీమా పాలసీతో.. మీ డిజిటల్ లావాదేవీలు కాపాడుకోండి
30 September 2022, 7:59 IST
- Cyber Insurance Policy : ఈ కాలంలో సైబర్ ఎటాక్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. పాపం తెలియకుండా కొన్ని లింక్స్, లేదా ఓటీపీలతో తమ డబ్బు కోల్పోతున్నారు. అయితే సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది.. డిజిటల్ బెదిరింపుల నుంచి, వ్యాపారవేత్తలు, వ్యక్తుల ఆర్థిక నష్టాల నుంచి రక్షిస్తుంది.
సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ
Cyber Insurance Policy : డిజిటల్ లావాదేవీలలో పోస్ట్-పాండమిక్ సమయంలో గణనీయమైన సైబర్ మోసాల పెరుగుదలకు దారితీసింది. అయితే ఈ భయంతోనే ఏదైనా గోప్యమైన డేటా లీకేజీ వల్ల కలిగే ఆర్థిక నష్టానికి వ్యతిరేకంగా మరింత మంది వ్యాపారాలు, వ్యక్తులు సైబర్ బీమా పాలసీలను ఎంచుకుంటున్నారు.
సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ.. ఫిషింగ్, మాల్వేర్ దాడులు, సోషల్ మీడియా ఉల్లంఘన, మరిన్ని అనేక డిజిటల్ యుగం బెదిరింపుల నుంచి.. వ్యాపారవేత్తలు, వ్యక్తుల ఆర్థిక నష్టాలను ఇది రక్షిస్తుంది.
మహమ్మారి తర్వాత సైబర్ క్రైమ్ ఊపందుకుంది. ఎందుకంటే ఇ-లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాంతో సైబర్ మోసానికి గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి సైబర్ ఇన్సూరెన్స్‌కు కార్పొరేట్ల ద్వారానే కాకుండా రిటైల్ కస్టమర్‌ల నుంచి కూడా డిమాండ్ పెరిగిందని ఇన్సూరెన్స్ బ్రోకర్స్ CEO ఆనంద్ రాఠీ, ప్రిన్సిపల్ ఆఫీసర్ రాజేష్ కుమార్ శర్మ తెలిపారు.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) డేటా ప్రకారం.. మొత్తం చెల్లింపులలో డిజిటల్ చెల్లింపుల వాటా FY20లో 95.4 శాతం నుంచి FY22 చివరి నాటికి 96.32 శాతానికి పెరిగింది. డిజిటల్ చెల్లింపులను ట్రాక్ చేసే RBI డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్ 29.08 శాతం పెరిగి.. ఏడాది క్రితం 270.59 పాయింట్ల నుంచి 2022 మార్చిలో 349.3 పాయింట్ల ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది.
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) గత సంవత్సరం వ్యక్తుల కోసం నమూనా సైబర్ బీమా పాలసీ కోసం సిఫార్సులను ప్రచురించింది. సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో సాధారణ బీమా సంస్థలు కట్టుబడి ఉండాలని సూచించింది.
“ఒక వ్యక్తి సైబర్-ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయాలి. ఎందుకంటే అతని సంపద నుంచి పొదుపు వరకు ఏదైనా, ప్రతిదీ సైబర్‌టాక్‌ల కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ పాలసీలు కూడా సరసమైన ధరలో అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు బజాజ్ అలియాంజ్ రూ.10 లక్షల హామీ మొత్తానికి వసూలు చేసిన ప్రీమియం రూ.2,848 (GST మినహాయించి). ఈ ఉత్పత్తిని ఇతర బీమా కంపెనీలు కూడా అందిస్తున్నాయి. వీటిలో కొన్ని టాటా AIG, ICICI లొంబార్డ్, న్యూ ఇండియా అస్యూరెన్స్ ఉన్నాయని RIA ఇన్సూరెన్స్ బ్రోకర్స్ డైరెక్టర్, 1 సైబర్ అటాక్ కెన్ రన్ యు ఫర్ ఎవర్ పుస్తక రచయిత S.K. సేథి తెలిపారు.
సైబర్ బెదిరింపుల పెరుగుదల కారణంగా మిమ్మల్ని, మీ కంపెనీని రక్షించడానికి సైబర్ బీమా పాలసీని కొనుగోలు చేయడం ఎల్లప్పుడూ మంచిది.
టాపిక్