తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Blood Group: పొరపాటున రోగికి మరో బ్లడ్ గ్రూప్‌కు చెందిన రక్తాన్ని ఎక్కిస్తే ఏమవుతుంది? ఇది ప్రాణాంతకమా?

Blood Group: పొరపాటున రోగికి మరో బ్లడ్ గ్రూప్‌కు చెందిన రక్తాన్ని ఎక్కిస్తే ఏమవుతుంది? ఇది ప్రాణాంతకమా?

Haritha Chappa HT Telugu

23 December 2024, 18:30 IST

google News
    • Blood Group: బ్లడ్ గ్రూప్ ఎంతో ముఖ్యమైనది. ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన బ్లడ్ గ్రూపు ఉంటుంది. రోగికి అవసరమైతే అదే బ్లడ్ గ్రూపుకు చెందిన రక్తాన్ని ఎక్కించాలి. పొరపాటున వేరే బ్లడ్ గ్రూప్ కు చెందిన రక్తాన్ని ఎక్కిస్తే ఏమవుతుంది?
రక్త దానం
రక్త దానం (Pixabay)

రక్త దానం

మన ఆరోగ్యంలో రక్త వర్గం ఎంతో ముఖ్యం. ఒక్కో వ్యక్తికి ఒక్కో రక్త వర్గం ఉంటుంది. సాధారణంగా బ్లడ్ గ్రూపుల్లో A, B, AB, O ముఖ్యమైనవి. కొన్ని అరుదైన బ్లడ్ గ్రూపులు కూడా ఉన్నాయి. ఏదైనా శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చినప్పుడు లేదా ప్రమాదాలు జరిగినప్పుడు రక్తం ఎక్కించాల్సిన అవసరం వస్తుంది. ఆ సమయంలో ఆ రోగిలోని రక్తం ఏ బ్లడ్ గ్రూపునకు చెందిందో తెలుసుకుని అదే బ్లడ్ గ్రూప్ రక్తాన్ని ఎక్కిస్తారు. పొరపాటున వేరే బ్లడ్ గ్రూప్ రక్తాన్ని ఎక్కిస్తే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?

ఆ అవయవాలపై ప్రభావం

ఒక వ్యక్తికి రక్తాన్ని ఎక్కించే ముందు అతని బ్లడ్ గ్రూపుకు సరిపోయిందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒక వ్యక్తికి పొరపాటున అతనికి సరిపోలని బ్లడ్ గ్రూపుకు చెందిన రక్తాన్ని ఎక్కిస్తే అతను శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. అవి కొందరికి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. రోగనిరోధక శక్తిని తగ్గిపోయేలా చేస్తాయి. కాలేయం, మూత్రపిండాలపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. తప్పు బ్లడ్ గ్రూప్ చెందిన రక్తాన్ని ఎక్కించడం వల్ల ఒక వ్యక్తి కిడ్నీలు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది. రక్తం ఎక్కించిన తర్వాత వికారం, జ్వరం, ఛాతీ నొప్పి, నడుము నొప్పి, విపరీతంగా చలివేయడం, వణకడం, మూత్రం ముదురు రంగులో రావడం వంటివి జరిగితే అతడికి ఎక్కించినా రక్తం సరిపోలలేదని అర్థం చేసుకోవాలి.

అతడి బ్లడ్ గ్రూపునకు సరిపోలని రక్తం ఎక్కిస్తే ఆ వ్యక్తి ఆరోగ్యం పై జీవితాంతం ప్రతికూల ప్రభావం ఉంటుంది. రక్తసంబంధిత సమస్యలు కూడా వస్తాయి. చిన్న గాయం అయినా కూడా విపరీతంగా రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సరిపడని రక్తాన్ని శరీరంలో ఎక్కించడం వల్ల వివిధ భాగాలకు ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతుంది. ఇది ప్రమాదకరంగా మారుతుంది. ఈ తప్పుడు రక్తం వల్ల తీవ్రమైన ప్రతిచర్య కనిపిస్తుంది. మూత్రపిండాలు, గుండెలపై నేరుగా ప్రభావం పడుతుంది. అలెర్జీలు కూడా వస్తాయి. శరీరం పసుపు రంగులోకి మారే అవకాశం ఉంది. ఇది కామెర్లు వ్యాధిని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రోగికి సరిపోలని రక్తాన్ని ఎక్కించకూడదు.

ఒక వ్యక్తి బ్లడ్ గ్రూపును బట్టి వారు ఏ బ్లడ్ గ్రూపునకు చెందిన రక్తాన్ని స్వీకరించవచ్చు ఆధారపడి ఉంటుంది. ఇలా మీకు సరిపడే ఇతర గ్రూపులకు చెందిన దాన్ని మాత్రమే ఎక్కించాలి. వైద్యులకు ఈ విషయంలో అవగాహన ఉంటుంది. కాబట్టి వారు చెప్పిన ప్రకారం ఆ బ్లడ్ గ్రూపులకు సంబంధించిన రక్తాన్ని మాత్రమే ఎక్కించేలా చూసుకోవాలి. ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఏ బ్లడ్ గ్రూపు వాళ్లకైనా రక్తాన్ని దానం చేయవచ్చు. కానీ వీరు తమకు రక్తం అవసరమైతే మాత్రం తమ బ్లడ్ గ్రూపునకు చెందిన వారి రక్తాన్ని ఎక్కించుకోవాలి.

రక్తదానం ప్రాణదానంతో సమానం ఎప్పుడైనా అవకాశం వస్తే రక్తదానాన్ని చేసేందుకు ముందుండండి. అది ఒక జీవితాన్ని ఒక కుటుంబాన్ని నిలబెడుతుంది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

తదుపరి వ్యాసం