తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weightloss: ఆ బాలీవుడ్ నటి నాలుగు నెలల్లో 32 కిలోలు తగ్గడానికి ఏం చేసింది? ఆమె వెయిట్‌‌లాస్ సీక్రెట్ ఎవరైనా పాటించవచ్చు

Weightloss: ఆ బాలీవుడ్ నటి నాలుగు నెలల్లో 32 కిలోలు తగ్గడానికి ఏం చేసింది? ఆమె వెయిట్‌‌లాస్ సీక్రెట్ ఎవరైనా పాటించవచ్చు

Haritha Chappa HT Telugu

03 December 2024, 9:33 IST

google News
  • Weightloss: భూమి పెడ్నేకర్ ఒకప్పుడు ఎంతో లావుగా ఉండేది.  ఇప్పుడు సన్నగా మెరుపుతీగలా మారిపోయింది. ఆమె సినిమాల కోసం నాలుగు నెలల్లో 32 కిలోలు తగ్గేంది. ఆమె బరువు తగ్గడానికి పాటించిన సూత్రాలు సాధారణ ప్రజలు కూడా ఫాలో అవ్వచ్చు. 

భూమి పెడ్నేకర్ వెయిట్ లాస్ సీక్రెట్స్
భూమి పెడ్నేకర్ వెయిట్ లాస్ సీక్రెట్స్

భూమి పెడ్నేకర్ వెయిట్ లాస్ సీక్రెట్స్

అధిక బరువు సమస్య ఇప్పుడు ఎక్కువ మందిని వేధిస్తోంది. బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ కూడా ఒకప్పుడు ఎంతో లావుగా ఉండేది. 'దమ్ లగా కే హైషా' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ నటి. ఆ సమయంలో భూమి 89 కిలోల బరువు ఉండేది. ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. సినిమాలనే కెరీర్ గా మలచుకోవాలన్న ఆలోచనతో బరువు తగ్గేందుకు నిర్ణయించుకుంది భూమి. ఆమె ఏ డైటీషియన్ సహాయం లేకుండా కేవలం నాలుగు నెలల్లో 32 కిలోల బరువు తగ్గింది. ఆమె ఇందుకోసం లక్షలు ఖర్చు పెట్టి ఎలాంటి జిమ్ ట్రైనర్ ను కూడా పెట్టుకోలేదు. ఆమె ఆరోగ్యకరమైన విధానంలోనే బరువు తగ్గేందుకు ప్రయత్నించి సఫలమైంది. మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే భూమి పాటించిన సూత్రాలను ఫాలో అయిపోండి. ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు.

ఇంట్లో తయారుచేసిన ఆహారం

భూమి బరువు తగ్గడానికి ఎటువంటి క్రాష్ డైటింగ్ లేకుండా ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే తిన్నది. అందులో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని మాత్రమే ఉండేలా చేసుకుంది. తాను బరువు తగ్గడానికి ఏ డైటీషియన్ దగ్గరకు వెళ్లలేదని తెలిపింది. బరువు తగ్గడానికి తల్లి సలహాలతో పాటూ ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చిట్కాలను పాటించింది.

బరువు తగ్గేందుకు భూమి తన ఆహారం నుండి పిండి పదార్ధాలు, చక్కెర వంటి శుద్ధి చేసిన ఆహారాలను పూర్తిగా తినడమే మానేసింది. దీని వల్ల ఆమె మానసిక ఆరోగ్యం కూడా ఎంతో మెరుగ్గా మారింది. ఆమె మరింత బరువు కూడా త్వరగా తగ్గడం ప్రారంభించింది.

బాడీ డిటాక్స్

శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపడానికి భూమి డిటాక్స్ డ్రింక్స్ ను ఆశ్రయించింది. దీని కోసం భూమి ప్రతిరోజూ ఉదయం ఒక బాటిల్ నీటిలో కొన్ని కీరదోసకాయ ముక్కలు, నిమ్మకాయ రసం, పుదీనా ఆకులు వేసి సుమారు 5 నుండి 7 గంటలు నానబెట్టేవారు. ఆ నీటిని పరగడుపున తాగే వారు. ఇది తన శరీరాన్ని నిర్విషీకరణ చేసి, కొవ్వును త్వరగా కరిగించడం మొదలుపెట్టింది.

ఏం తిన్నాది?

జిమ్ కు వెళ్లే ముందు భూమి బ్రేక్ ఫాస్ట్ కోసం మల్టీగ్రెయిన్ బ్రెడ్, ఎగ్ వైట్ తో చేసిన ఆమ్లెట్ తినేది. మధ్యాహ్న భోజనం విషయానికొస్తే, ఆ సమయంలో ఆమె ఆకుకూరలు, సలాడ్, జొన్నలు, సజ్జలు, రాగులు, శనగలు, మల్టీ గ్రెయిన్ చపాతీలను, పెరుగు వంటి వాటిని తినేది.

లిక్విడ్ డైట్ వాటర్ తో జ్యూస్ లేదా హెర్బల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకునేది. టీ, కాఫీలకు దూరంగా ఉండగా. తన లిక్విడ్ డైట్ కోసం రోజుకు 8 లీటర్ల ఫ్లూయిడ్స్ తీసుకోవాలనే తన ప్రణాళికను భూమి కొనసాగించింది. నీరు అధికంగా తీసుకోవడం వల్ల ఆమె బరువు తగ్గడం సులభంగా మారింది.

వీటన్నింటితో పాటూ ఆమె నడక, రన్నింగ్, ఇతర తేలికపాటి వ్యాయామాలు చేయడం ప్రారంభించింది. నాలుగు నెలల పాటూ బయటి ఫుడ్ తినకుండా జాగ్రత్త పడింది. మొత్తమ్మీద ఆమె కష్టం ఫలించి మెరుపుతీగలా సన్నగా మారింది.

తదుపరి వ్యాసం