తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Exercise: రెగ్యులర్‌గా ఈ ఎక్సర్‌సైజ్ చేయండి.. కండరాల నుంచి వెయిట్ లాస్‍ వరకు ఈ 7 లాభాలు

Exercise: రెగ్యులర్‌గా ఈ ఎక్సర్‌సైజ్ చేయండి.. కండరాల నుంచి వెయిట్ లాస్‍ వరకు ఈ 7 లాభాలు

15 November 2024, 6:00 IST

google News
    • Exercise: స్క్వాట్స్ ఎక్సర్‌సైజ్‍ల వల్ల శరీరానికి చాలా లాభాలు దక్కుతాయి. కండరాలు పెరిగేందుకు సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా సూటవుతాయి. ఈ రకం వ్యాయామాల వల్ల కలిగే ముఖ్యమైన లాభాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
Exercise: రెగ్యులర్‌గా ఈ ఎక్సర్‌సైజ్ చేయండి.. కండరాల నుంచి వెయిట్ లాస్‍ వరకు ఈ 7 లాభాలు (Photo: Freepik)
Exercise: రెగ్యులర్‌గా ఈ ఎక్సర్‌సైజ్ చేయండి.. కండరాల నుంచి వెయిట్ లాస్‍ వరకు ఈ 7 లాభాలు (Photo: Freepik)

Exercise: రెగ్యులర్‌గా ఈ ఎక్సర్‌సైజ్ చేయండి.. కండరాల నుంచి వెయిట్ లాస్‍ వరకు ఈ 7 లాభాలు (Photo: Freepik)

వ్యాయామం ప్రతీ రోజు చేయడం వల్ల శారీరక దృఢత్వం పెరుగుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. సామర్థ్యాన్ని పెంచే ఎక్సర్‌సైజ్‍ల్లో ‘స్క్వాట్స్’ ప్రధానంగా నిలుస్తుంది. ఈ రకం ఎక్సర్‌సైజ్‍లు శరీరానికి చాలా ప్రయోజనాలను కల్పిస్తాయి. ముఖ్యంగా శరీర కింది భాగానికి ఎక్కువ లాభాలు ఉంటాయి. రెగ్యులర్‌గా స్క్వాట్స్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏవంటే..

కండలు పెరిగేలా..

తొడ కండరాలు, పిక్కలు సహా శరీర కింద భాగాల సామర్థ్యాన్ని, కండరాల పెరుగుదలను స్క్వాట్స్ ఎక్సర్‌సైజ్‍లు మెరుగుపరుస్తాయి. నడుము, చేతులు, భుజాల మజిల్స్ దృఢత్వం కూడా పెరుగుతుంది. పూర్తిస్థాయి బాడీ ఫిట్‌‍నెస్‍ మెరుగ్గా ఉండేందుకు చాలా ఉపయోగపడతాయి.

ఫ్లెక్సిబులిటీ పెరుగుదల

స్క్వాట్స్ వ్యాయామాలు చేసే సమయంలో వంగడం, నడుము, మోకాళ్లను సాగతీయడం లాంటివి ఉంటాయి. అందుకే ఈ రకం ఎక్సర్‌సైజ్‍లు చేస్తే ఆయా అవయవాల ఫ్లెక్సిబులిటీ మెరుగవుతుంది. దీనివల్ల కండరాలు పట్టేయడం, చిన్నవాటికే గాయాలు కావడం సమస్యలు తగ్గుతాయి. బాడీ ఫ్లెక్సిబుల్‍గా ఉంటే చాలా పనులు త్వరగా అలసిపోకుండా చేయవచ్చు.

బరువు తగ్గేందుకు..

బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి స్క్వాట్స్ వ్యాయామాలు బాగా సహకరిస్తాయి. ఇవి చేస్తే క్యాలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి. జీవక్రియ రేట్‍ను మెరుగుపరుస్తాయి. అందుకే వెయిట్ లాస్‍కు ఈ వ్యాయామాలు తోడ్పడతాయి. కొవ్వు కరిగేందుకు కూడా సహకరిస్తాయి.

సరైన భంగిమ

స్క్వాట్స్ ఎక్సర్‌సైజ్‍లు చేయడం వల్ల శరీర బ్యాలెన్స్ చాలా మెరుగుపడుతుంది. అలాగే, శరీర భంగిమ సరిగా ఉండేలా తోడ్పడుతుంది. వెన్ను కండరాలు కూడా వ్యాయామంలో కీలకంగా ఉంటాయి. వెన్నెముక ముందుకు వంగకుండా భంగిమ బాగా ఉండేలా చేస్తాయి. కండరాల అసమతుల్యతను కూడా ఈ వ్యాయామాలు తగ్గిస్తాయి.

కీళ్లు, ఎముకలకు..

స్క్వాట్స్ ప్రతీ రోజు చేయడం వల్ల ఎముకల సాంద్రత కూడా మెరుగవుతుంది. వయసు పెరిగే కొద్ది ఎముకల సున్నితంగా మారే ప్రక్రియను ఈ వ్యాయామాలు నివారించగలవు. కీళ్లకు కూడా స్క్వాట్స్ మేలు చేస్తాయి. కీళ్ల నొప్పుల రిస్క్ తగ్గిస్తాయి.

మానసికంగానూ..

స్క్వాట్స్ చేయడం వల్ల శరీరానికే కాకుండా మానసికంగానూ ఉపయోగపడుతుంది. ఈ ఎక్సర్‌సైజ్ చేస్తే శరీరం ఎండాల్ఫిన్ అనే హ్యాపీ హార్మోన్‍ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల మూడ్ బాగుంటుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. నిద్ర నాణ్యత పెరిగేందుకు కూడా ఈ వ్యాయామాలు ఉపయోగపడతాయి.

హర్మోన్ల సమతుల్యత

స్క్వాట్స్ ఎక్సర్‌సైజ్‍లు చేయడం వల్ల శరీరంలో హార్మోన్ల ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. టెస్టోస్టిరాన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. కండరాల పెరుగుదతో పాటు మొత్తం శరీర సామర్థ్యానికి ఇవి సహకరిస్తాయి. హార్మోన్ల సమతుల్యత వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.

స్క్వాట్స్ ఇలా.. రకాలు

ముందుగా ఓ చోట నిలబడి నిలబడి కాళ్లను దూరంగా పెట్టాలి. ఆ తర్వాత నడుము వంచి.. కాళ్లపై శరీర భారం వేస్తూ గాల్లో కూర్చున్నట్టుగా చేయాలి. స్క్వాట్స్‌లో కొన్ని రకాల ఎక్సర్‌సైజ్‍లు ఉంటాయి. జంప్ స్క్వాట్, సుమో స్క్వాట్, స్క్వాట్ జాక్స్, పిస్టల్ స్క్వాట్, గోల్బెట్ స్క్వాట్, బాడీవెయిట్ స్క్వాట్, బాక్స్ స్క్వాట్ అంటూ కొన్ని రకాలు ఉంటాయి.

టాపిక్

తదుపరి వ్యాసం