తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wednesday Motivation : ఏడిపించే గతాన్ని మరిచిపోండి.. నవ్వించే వర్తమానంపై దృష్టిపెట్టండి

Wednesday Motivation : ఏడిపించే గతాన్ని మరిచిపోండి.. నవ్వించే వర్తమానంపై దృష్టిపెట్టండి

Anand Sai HT Telugu

12 June 2024, 5:00 IST

google News
    • Wednesday Motivation : గౌతమ బుద్ధుడు జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చెప్పాడు. గతం గురించి ఆలోచిస్తూ ఉండిపోకూడదని.. వర్తమానంలో జీవించాలని వివరించాడు. ఆయన చెప్పిన కొన్ని మాటలు మీ కోసం..
బుద్ధుడు చెప్పిన జీవిత సత్యాలు
బుద్ధుడు చెప్పిన జీవిత సత్యాలు (Unsplash)

బుద్ధుడు చెప్పిన జీవిత సత్యాలు

గౌతమ బుద్ధుడు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహాపురుషులలో ఒకరు. సత్యం, మతం, ప్రేమ, శాంతి, సామరస్యం గురించి ఆయన ఆలోచనలు ఎంతో మంది జీవితాలను మార్చాయి. నేటికీ ప్రజలు ఆయన సూక్తులను పాటిస్తున్నారు. గౌతమ బుద్ధుని మాటలు ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. జీవితంలో ఆయన చెప్పిన మాటలను పాటిస్తే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. గౌతమ బుద్ధుడి మాటలు ఇప్పటికీ పాటించేవారు చాలా మంది ఉన్నారు. ప్రపంచ దేశాల్లో ఆయన ఫాలోవర్స్ ఉన్నారు. జీవిత సత్యాలను బుద్ధుడు చాలా చక్కగా వివరించాడు. అందుకే ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ ప్రాచూర్యంలో ఉన్నాయి.

మీ వద్ద ఉన్నదానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండండి. చాలా మందికి ఏమీ లేదు.. మన దగ్గర అన్నీ ఉన్నప్పటికీ, కొన్నిసార్లు మనం ఇంకా ఎక్కువ ఆశిస్తాం. ఉన్నదానితో సంతృప్తి చెందలేరు. కానీ అది సరైన పద్ధతి కాదు.

జీవితంలో అత్యంత విజయవంతం కావాలంటే మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న సమస్యలను మర్చిపోండి. కానీ సమస్యలు మీకు నేర్పిన పాఠాలను ఎప్పటికీ మర్చిపోకండి.

గతంలో బతకవద్దు.. భవిష్యత్తు గురించి కలలు కనవద్దు.. ప్రస్తుత క్షణంలో మనస్సును ఏకాగ్రతతో ఉంచుకోండి.. మనలో చాలా మంది పాత కాలాన్ని గుర్తుకు తెచ్చుకుని బాధపడుతుంటారు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అని ఆలోచిస్తూ ఉంటారు.

నిన్న మిమ్మల్ని బాధపెట్టిన వారిని మరచిపోండి, కానీ మిమ్మల్ని ప్రేమించేవారిని ప్రతిరోజూ గుర్తుంచుకోండి..

ఒక్క కొవ్వొత్తి నుండి వేల కొవ్వొత్తులను వెలిగించవచ్చు.. అలా అని కొవ్వొత్తి జీవితం తగ్గిపోదు. పంచుకోవడం వల్ల ఆనందం తగ్గదు.. ఒక్క దీపం ద్వారా వెయ్యి దీపాలు వెలిగించవచ్చు, ఆ దీపపు వెలుగు మాత్రం తగ్గదు. పంచుకున్నప్పుడు సంతోషం ఎప్పటికీ తగ్గదు.

మిమ్మల్ని ఏడిపించే గతాన్ని మర్చిపోండి.. మిమ్మల్ని నవ్వించే వర్తమానంపై దృష్టి పెట్టండి.. మీకు బాధ కలిగించే లేదా బాధ కలిగించే గత జ్ఞాపకాలు లేదా సంఘటనలను ఎప్పుడూ గుర్తుంచుకోకండి. వర్తమానంలో మీకు సంతోషాన్నిచ్చే వాటిపై దృష్టి పెట్టండి.

ప్రతి సమస్యకు మూడు పరిష్కారాలు ఉన్నాయి.. సమస్యను దానిని అంగీకరించండి, మార్చండి లేదా వదిలివేయండి. మీరు అంగీకరించలేకపోతే మార్చండి. మార్చలేకపోతే వదిలేయండి..

తెలివితక్కువ వ్యక్తులతో వాదించడం మీ చెంపపై ఉన్న దోమను చంపడానికి ప్రయత్నించడం లాంటిది. మీరు దానిని చంపవచ్చు లేదా చంపకపోవచ్చు, కానీ మీరు మీరే చెంపదెబ్బ కొట్టుకుంటారు.. తెలివితక్కువ వ్యక్తులతో వాదనలకు దిగకపోవడమే మంచిది. ఎందుకంటే వారితో వాదించుకోవడం అంటే దోమను తన చెంప మీద వేసుకుని చంపాలని ప్రయత్నించినట్లే.

జీవితం ఆనందం, దుఃఖం, కష్ట సమయాలు, మంచి సమయాల వృత్తం. మీరు కష్ట సమయాలను అనుభవిస్తుంటే, మంచి రోజులు రాబోతున్నాయని విశ్వాసం కలిగి ఉండండి.. జీవితంలో ఎటువంటి బాధలు లేని వ్యక్తిని ప్రపంచంలో చూడటం కష్టం.

ఎవరికైనా సహాయం చేసి ప్రతిఫలంగా ఏదైనా ఆశించినట్లయితే, మీరు వ్యాపారం చేస్తున్నారని అర్థం. మీ చుట్టూ ఉన్న వారికి సహాయం చేయడానికి ప్రయత్నించండి. ఒకరిని ఆపదలో వదిలేయకండి. ఒకరికి సహాయం చేసి ప్రతిఫలంగా ఏదైనా ఆశించడం సరికాదు.

తదుపరి వ్యాసం