వారఫలాలు.. ఈ వారం వీరికి శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి, మానసిక ఆనందం పొందుతారు-weekly horoscope in telugu june 9th to june 15th rasi phalalu check zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వారఫలాలు.. ఈ వారం వీరికి శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి, మానసిక ఆనందం పొందుతారు

వారఫలాలు.. ఈ వారం వీరికి శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి, మానసిక ఆనందం పొందుతారు

HT Telugu Desk HT Telugu
Jun 09, 2024 02:00 AM IST

Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. జూన్9వ తేదీ నుంచి జూన్15వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

వారఫలాలు జూన్ 9 నుంచి 15వ తేదీ వరకు
వారఫలాలు జూన్ 9 నుంచి 15వ తేదీ వరకు (Pixabay)

రాశిఫలాలు (వార ఫలాలు) 09.06. 2024 నుండి 15.06.2024 వరకు

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం : ఉత్తరాయణం, మాసం : జ్యేష్టము

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలుంటాయి. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభ యోగమున్నది. స్త్రీల మూలకంగా లాభాలుంటాయి. శుభవార్తలు వింటారు. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. సన్నిహితులను కలుస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్ని వస్తుంది. మేష రాశి మరింత శుభఫలితాలు ఈవారం పొందడానికి దక్షిణామూర్తిని పూజించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. బంధు మిత్రులతో అభిప్రాయ భేదాలుఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. అకాల భోజనం వల్ల అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. ఆకస్మిక కలహాలకు అవకాశమున్నది. చెడు సహవాసాలకు దూరంగా ఉండుట మంచిది. అనవసర ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సులువవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. అనవసర ఖర్చులుంటాయి. కనకధారా స్తోత్రాన్ని పఠించడం మంచిది. గురువారం రోజు దత్తాత్రేయుని పూజించండి.

మిథున రాశి

వార ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు. శత్రు బాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. మానసికానందం లభిస్తుంది. గతంలో వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. వృత్తిపరంగా అనుకూలం. కొన్ని కష్టమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభముంటుంది. నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మరింత శుభఫలితాలు కలుగుతాయి. శివాష్టకం పఠించడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు. నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు అనుకూల స్థానచలన మార్పులుంటాయి. గొడవలకు దూరంగా ఉండుట మంచిది. అనారోగ్య సమస్యలుంటాయి. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడుట మంచిది. మీరు చేసే పనులకు ఆటంకాలు ఎదురై ఇబ్బంది పడతారు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయ దర్శనం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈవారం మీకు అనుకూలంగా లేదు. నూతన కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తుంది. నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. వీలైనంత వరకు అసత్యానికి దూరంగా ఉండుట మంచిది. అనవసర భయాందోళనలకు లోనవుతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి. ఆకస్మిన ధన నష్టం పట్ల జాగ్రత్త వహించుట మంచిది. కుటుంబపరగా అనుకూలం. విదేశీ యాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. ప్రయాణాలు అధికమవుతాయి. అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది. సూర్యనారాయణమూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల ఆనందముగా గడుపుతారు. వ్యాపారరంగంలో లాభాలుంటాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరును. ప్రయాణాల వల్ల లాభం కలుగును. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృథా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభముంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విష్ణు సహస్రనామం పారాయణ మరియు ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గొప్ప వ్యక్తిని కలుస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. ఇతరులకు సహాయపడతారు. రుణ బాధలు తొలగిపోతాయి. శత్రు బాధలుండవు. ఒక విషయం మనస్తాపానికి గురి చేస్తుంది. కుటుంబ సభ్యులతో అనందముగా గడుపుతారు. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణ తొలగిపోతాయి. నూతన వస్తు, అభరణాలను పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తులారాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. నూతన వ్యక్తులు కలుస్తారు. ఉద్యోగంలో స్థాన చలన సూచనలున్నాయి. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. ప్రతి చిన్న విషయంలో అటంకాలెదురగును. అనారోగ్య బాధలతో సతమతమవుతారు. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. కుటుంబములో అనారోగ్య సమస్యలుంటాయి. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. మానసికాందోళన. ప్రతి విషయంలో అటంకాలెదురవుతాయి. మరింత శుభఫలితాలు కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. కుటుంబములో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో మనస్పర్ధలు ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆకస్మిన ధననష్టం కలిగే అవకాశముంది. మానసికాందోళనతో ఉంటారు. కుటుంబములో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలెదురగును. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రహస్య శత్రు బాధలుండే అవకాశముంది. విందులు, వినోదాలకు దూరంగా ఉండుట మంచిది. ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. మరింత శుభ ఫలితాల పొందడం కోసం సుబ్రహ్మణ్యుడిని, దుర్గాదేవిని పూజించడం మంచిది.

మకర రాశి

వార ఫలాల ప్రకారం మకర రాశివారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. బంధు మిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. ప్రయాణాలు కలసివస్తాయి. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండుట మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయమేర్పడుతుంది. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. మంచి ఆలోచనలను కలిగి వుంటారు. మరింత శుభఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. కుటుంబములో సుఖసంతోషాలుంటాయి. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధు మిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. మహిళలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. బంధుమిత్రులతో విరోధమేర్చడకుండా జాగ్రత్త పడుట మంచిది. మరింత శుభఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ధర్మ కార్యాలు చేయుట యందు ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యముంటుంది. మానసికానందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభముంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. మరింత శుభఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయ పారాయణం చేయడం మంచిది. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel