తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Prawns Fry Recipe । ఈ వారాంతంలో సీఫుడ్ తినాలనుకుంటే.. రుచికరమైన రొయ్యల ఫ్రై ఇలా చేసుకోండి!

Prawns Fry Recipe । ఈ వారాంతంలో సీఫుడ్ తినాలనుకుంటే.. రుచికరమైన రొయ్యల ఫ్రై ఇలా చేసుకోండి!

HT Telugu Desk HT Telugu

06 November 2022, 13:51 IST

    • Prawns Fry Recipe: ఈ వారాంతంలో చికెన్, మటన్ కాకుండా సీఫుడ్ ప్రయత్నించాలనుకుంటున్నారా? అయితే రుచికరంగా రొయ్యల ఫ్రై, కొకొనట్ రొయ్యల గ్రేవీ చేసుకొండి, రెసిపీలు చాలా సింపుల్. ఇక్కడ చూడండి.
Prawns Fry Recipe
Prawns Fry Recipe (slurrp)

Prawns Fry Recipe

మాంసాహార ప్రియులకు చికెన్, మటన్ మాత్రమే కాకుండా సీఫుడ్ కూడా మరొక మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. చేపలు, రొయ్యలు, పీతలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. మాంసాహారాల్లో సీఫుడ్ చాలా ఆరోగ్యకరమైనది, ఎన్నో పోషకాలు లభిస్తాయి. అయితే చాలా మందికి సీఫుడ్ అంటే ఇష్టం ఉంటుంది కానీ ఎలా వండాలి అనే దానిపై అవగాహన ఉండదు. ఇతర మాంసాహార వంటకాల మాదిరిగా సీఫుడ్ చేయకూడదు, ఇది వండే విధానం వేరుగా ఉంటుంది. కానీ చాలా సులభం.

సీఫుడ్‌లో రొయ్యలు కూడా ఎక్కువగా ఇష్టపడి తింటారు. కానీ వీటిని వండే విధానం తెలియక చాలామంది రెస్టారెంట్ల నుంచే ఆర్డర్ చేసుకుంటారు. సింపుల్‌గా రుచికరంగా రొయ్యల ఫ్రై కూర (Prans Fry) ఎలా చేయాలో రెసిపీ ఇక్కడ అందిస్తున్నాం. ఇక్కడ సూచించిన మార్గదర్శకాల ప్రకారం మీకు మీరుగా ఈజీగా వండుకోవచ్చు. కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఈ కింద పరిశీలించండి.

Prawns Fry Recipe కోసం కావలసినవి

  • రొయ్యలు 500 గ్రా
  • ఉల్లిపాయ పేస్ట్ 150 గ్రాములు
  • టొమాటో ప్యూరీ 100 గ్రాములు
  • 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 1 టీస్పూన్ కారం
  • 1/2 టీస్పూన్ పసుపు
  • 1/2 కప్పు వేయించిన కరివేపాకు పొడి
  • 2-3 యాలకులు
  • 2-3 లవంగాలు
  • 1 అంగుళం దాల్చిన చెక్క
  • కరివేపాకు రెమ్మ
  • నూనె ఫ్రైకి సరిపడినంత సుమారు 50 గ్రాములు
  • ఉప్పు రుచికి తగినంత
  • నీరు (సుమారు 2 కప్పులు)

ప్రాన్స్ ఫ్రై రెసిపీ- తయారీ విధానం

  1. ముందుగా బాణలిలో నూనె వేడి చేసి అందులో కరివేపాకు, యాలకులు, లవంగాలు మొదలగు సుగంధ దినుసులను వేసి వేయించాలి.
  2. ఆపై ఉల్లిపేస్ట్, టొమాటో ప్యూరీ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి, కలుపుతూ ఉండండి.
  3. అనంతరం అల్లంవెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి.ఒక నిమిషం ఉడికించాలి.
  4. ఇప్పుడు శుభ్రంగా కడిగిన, శుభ్రం చేసిన రొయ్యలు వేసి, కొన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టి కొన్ని నిమిషాలు ఉడికించాలి.
  5. నీరు తగ్గిన తర్వాత కారం, ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలిపేసి నీరు ఆవిరైపోయి దగ్గరకు అయ్యేవరకు ఉడికించుకోవాలి.
  6. రొయ్యల ఫ్రై చివరి దశకు వచ్చినపుడు కరివేపాకు పొడివేసుకొని కలిపేసుకోవాలి.

అంతే, ఘుమఘుమలాడే రుచికరమైన రొయ్యల ఫ్రై రెడీ అయినట్లే. రోటీతో గానీ, అన్నంతో గానీ కలుపుకొని కుమ్మేయండి. ఒకవేళ మీకు ఫ్రై వద్దు, రొయ్యల కర్రీ కావాలనుకుంటే.. నోట్లో వేసుకోగానే కరిపోయేలా కొబ్బరి రొయ్యల గ్రేవీ కర్రీ రెసిపీని లింక్ క్లిక్ చేసి చూడవచ్చు.

టాపిక్