తెలుగు న్యూస్  /  Lifestyle  /  This Coconut Prawn Curry Recipe Will Melt Your Heart Softly For Sure

Coconut Prawn Curry । నోట్లో కరిగిపోతుంది.. రుచిలో అదిరిపోతుంది!

HT Telugu Desk HT Telugu

05 June 2022, 13:34 IST

    • ఎప్పుడూ చికెన్, మటన్ వంటకాలేనా? ఈ ఆదివారం సరికొత్తగా కొబ్బరి మసాలా రొయ్యల కూర చేసుకోండి. రెసిపీ ఇక్కడ ఇచ్చాము.
Coconut Prawn Curry
Coconut Prawn Curry (Unsplash )

Coconut Prawn Curry

ఆదివారం వస్తే చాలా మంది ఇళ్లలో మసాల ఘుమఘుమలు మదిని దోచేస్తాయి. ఆ వాసనకే నీటిలో నీళ్లు తిరుగుతాయి. మంచిగా మసాల దట్టించి కమ్మగా వండిన మాంసం ముక్క నోట్లో వేసుకుంటే.. ఆహా.. ఈ జన్మకు ఇది చాలు అనిపిస్తుంది. సరే, ఈ ఆదివారం నాడు మీ ఇంట్లో ఏం కూర వండారు? చికెన్ డిన్నరా, మటన్ మంగోలియానా, చేపల పులుసా? ఎక్కువ మంది చికెన్- మటన్ వంటకాలకే పరిమితమవుతారు. ఎందుకంటే మిగతా కూరలు ఎలా వండాలో తెలియకపోవచ్చు. అయితే ఎప్పుడు అవే ఎందుకు కొత్తగా కొబ్బరిపాలతో మసాలా రొయ్యల కూర చేసుకోండి. ఈ వంటకం రుచి మీరు ఎప్పటికీ మరిచిపోరు. నోట్లో వేస్తే కరిగిపోతుంది. అట్లుంటది మరీ కొబ్బరి మసాలా రొయ్య అంటే.

ఈ రెసిపీని ఫుడ్ వ్లాగర్ రచిత దడ్వాల్ పంచుకున్నారు. మరి ఆలస్యం చేయకుండా కొబ్బరి మసాలా రొయ్యల కూరకు కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇక్కడ తెలుసుకోండి.

కొబ్బరి మసాలా రొయ్యల కూరకు కావలసిన పదార్థాలు

  • రొయ్యలు 500 గ్రాములు
  • 1 కప్పు కొబ్బరి పాలు
  • 1 టేబుల్ స్పూన్ ఆవాల నూనె
  • 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగినవి
  • 4 పెద్ద టమోటాలు సన్నగా తరిగినవి
  • 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 3-4 పచ్చిమిర్చి
  • 1 స్పూన్ పసుపు పొడి
  • 1 టీస్పూన్ కారం
  • 1 టీస్పూన్ జీలకర్ర, ఆవాలు
  • 2 స్పూన్ అవధి మసాలా
  • ఉప్పురుచికి సరిపడా
  • కొద్దిగా తాజా కొత్తిమీర, కరివేపాకు

తయారీ విధానం

1. రొయ్యలను శుభ్రంగా కడిగి, ఒక పక్కన ఆరబెట్టండి.

2. ఇప్పుడు పాన్‌లో నూనె వేడిచేసుకొని ముందుగా ఆవాలు, జీలకర్ర వేపుకోవాలి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసి, వేయించాలి.

3. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వాసన పోయే వరకు అన్నింటినీ కాసేపు వేయించాలి.

4. ఇప్పుడు కారం, పసుపు పొడి, టొమాటోలు, కొద్దిగా ఉప్పు, అవధి మసాలా వేసి వేయించాలి.

5. మసాలాలు అన్నీ బాగా కలిసిన తర్వాత రొయ్యలను వేయండి. రొయ్యలకు మసాలా బాగా దట్టేలా వాటిని నిదానంగా కలపండి.

6. ఇప్పుడు కొబ్బరి పాలు పోసుకొని, బాగా కలిపి మరిగించాలి. రొయ్యలు ఉడికేంత వరకు తక్కువ మంట మీద 2-3 నిమిషాల పాటు మూత పెట్టండి.

7. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర, కరివేపాకుతో అలంకరించండి. కొబ్బరి మసాలా రొయ్యల కూర రెడీ అయినట్లే.

ఈ కూరను అన్నం లేదా చపాతీలుతో వేడిగా వడ్డించండి. ఆ రుచిని ఆస్వాదించండి.

టాపిక్