తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vankaya Biryani: వంకాయ బిర్యానీ ఇలా చేశారంటే లొట్టలు వేసుకొని తినాల్సిందే, ఘుమఘెమలాడిపోతుంది

Vankaya Biryani: వంకాయ బిర్యానీ ఇలా చేశారంటే లొట్టలు వేసుకొని తినాల్సిందే, ఘుమఘెమలాడిపోతుంది

Haritha Chappa HT Telugu

23 June 2024, 11:30 IST

google News
    • Vankaya Biryani: వెజిటబుల్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ ఎప్పుడూ ఇవే కాదు... ఒకసారి వంకాయ బిర్యానీ కూడా ప్రయత్నించండి. ఇది మీకు బాగా నచ్చుతుంది.
వంకాయ బిర్యానీ రెసిపీ
వంకాయ బిర్యానీ రెసిపీ

వంకాయ బిర్యానీ రెసిపీ

Vankaya Biryani: బిర్యానీ పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఎప్పుడూ వెజిటబుల్ బిర్యానీ లేదా ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తింటూ ఉంటారు. ఒకసారి వంకాయలతో బిర్యానీ చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. శాకాహారులకు ఇది బెస్ట్ బిర్యానీ రెసిపీ అని చెప్పుకోవచ్చు. దీని ఎలా చేయాలో ఇక్కడ రెసిపీ ఇచ్చాము. ఫాలో అయిపోండి.

వంకాయ బిర్యానీ రెసిపీకి కావలసిన పదార్థాలు

వంకాయలు - ఆరు

బాస్మతి రైస్ - రెండు కప్పులు

ఉప్పు - రుచికి సరిపడా

కారం - రెండు స్పూన్లు

పసుపు - అర స్పూను

గరం మసాలా - అర స్పూను

జీలకర్ర పొడి - ఒక స్పూను

ధనియాలు - ఒకటిన్నర స్పూను

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర స్పూను

నిమ్మరసం - రెండు స్పూన్లు

కొత్తిమీర తరుగు - అరకప్పు

పుదీనా తరుగు - అరకప్పు

పెరుగు - అర కప్పు

లవంగాలు - ఐదు

యాలకులు - మూడు

షాజీరా - అర స్పూను

దాల్చిన చెక్క - రెండు ముక్కలు

బిర్యానీ ఆకులు - రెండు

ఉల్లిపాయలు - రెండు

వంకాయ బిర్యానీ రెసిపీ

1. బాస్మతీ బియ్యాన్ని ముందుగానే అరగంట పాటు నానబెట్టాలి.

2. గుత్తి వంకాయ కూర కోసం వంకాయల్ని ఎలా కోసుకుంటారో అలా మధ్యలో నిలువుగా నాలుగు ముక్కలుగా చీరుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

4. నూనెలో వంకాయలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి.

5. చిన్న మంట మీద వేయిస్తే అవి బాగా వేగుతాయి.

6. అవి రంగు మారేవరకు వేయించాక వాటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి.

7. వంకాయలు వేయించాక మిగిలిన నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి డీప్ ఫ్రై చేయాలి.

8. ఉల్లిపాయలు రంగు మారేదాకా ఉంచి వాటిని కూడా తీసి వేరే గిన్నెలో వేసుకోవాలి.

9. ఇప్పుడు మ్యారినేట్ చేయడానికి ఒక గిన్నె తీసుకోవాలి.

10. అందులో ముందుగా వేయించిన వంకాయలను వేయాలి.

11. అలాగే కప్పు పెరుగు, కారం, ధనియాలపొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, ఉల్లిపాయల తరుగు వేసి కలుపుకోవాలి.

12. ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేయాలి. అలా 20 నిమిషాల పాటు వదిలేయాలి.

13. మరోపక్క అన్నాన్ని సిద్ధం చేసుకోవాలి.

14. అన్నం ఉండే గిన్నెలో నీళ్లను వేసి ఉప్పు, నూనె, యాలకులు, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, షాజీరా, లవంగాలు వేసి స్టవ్ మీద పెట్టాలి.

15. నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి 70 శాతం ఉడకనివ్వాలి.

16. ఆ తర్వాత నీటిని వంపేసి ఆ అన్నాన్ని ఒక ప్లేట్లో పొడిపొడిగా వచ్చేలా పెట్టుకోవాలి.

17. ఇప్పుడు బిర్యానీ వండేందుకు మందపాటి బేస్ ఉన్న గిన్నెను తీసుకోవాలి.

18. దాన్ని స్టవ్ మీద పెట్టి ముందుగా మేరినేట్ చేసిన వంకాయల మిశ్రమాన్ని వేసుకోవాలి.

19. ఆ వంకాయలపై కాస్త నీటిని చిలకరించాలి. తర్వాత వండుకున్న అన్నాన్ని పొరలు పొరలుగా వేసుకోవాలి.

20. ఆ పొరలపై ముందుగా వేయించుకున్న ఉల్లిపాయలను కూడా చల్లుకుంటూ ఉండాలి.

21. అలాగే కొత్తిమీర, పుదీనా తరుగును చల్లుతూ ఉండాలి.

22. అలా అయ్యాక పైన మూత పెట్టి పావుగంట చిన్న మంటపై ఉడికించాలి.

23. పావుగంట తర్వాత మూత తీస్తే ఘుమఘుమలాడే వంకాయ బిర్యానీ రెడీ అయిపోతుంది. దీని రుచి అదిరిపోతుంది.

ఈ వంకాయ బిర్యానీ తింటే పిల్లలు, పెద్దలు అందరికీ నచ్చుతుంది. దీన్ని రైతాతో తింటూ పక్కన ఒక ఉల్లిపాయ పెట్టుకోండి. స్పైసీగా చేసుకుని మధ్య మధ్యలో ఉల్లిపాయ తినడం వల్ల రుచిగా అనిపిస్తుంది.

తదుపరి వ్యాసం