తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Valentine's Day Gift Ideas : వాలెంటైన్స్ డేకి ఏ గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? ఇదిగో ఇవి చూడండి

Valentine's Day Gift Ideas : వాలెంటైన్స్ డేకి ఏ గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? ఇదిగో ఇవి చూడండి

Anand Sai HT Telugu

02 February 2024, 19:30 IST

    • Valentine's Day Gift Ideas In Telugu : ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం.. దగ్గరకు వస్తుంది. మీ ప్రియమైన వారికి వాలెంటైన్స్ డేకి ఏ గిఫ్ట్ ఇవ్వాలో ఇప్పటి నుంచే ప్లాన్ చేయండి. మీకోసం కొన్ని ఐడియాలు ఇక్కడ ఉన్నాయి.
వాలెంటైన్స్ డే గిఫ్డ్ ఐడియాలు
వాలెంటైన్స్ డే గిఫ్డ్ ఐడియాలు (Unsplash)

వాలెంటైన్స్ డే గిఫ్డ్ ఐడియాలు

ఏడాది పొడవునా ప్రేమికులు ఎదురుచూసేరోజు ఫిబ్రవరి 14. చాలా మంది ఏం గిఫ్ట్ ఇవ్వాలోనని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటారు. ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రతి సంవత్సరం వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 7న ప్రారంభమై ఫిబ్రవరి 14న ముగుస్తుంది. ఈ వారమంతా జంటలు ఒకరితో ఒకరు ఆనందంగా గడుపుతారు. అయితే ఇందులో అత్యంత ప్రత్యేకమైనది ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. మీరు కచ్చితంగా ఈసారి మీ భాగస్వామికి అందమైన బహుమతి ఇవ్వాలనుకుంటే మీ కోసం కొన్ని ఐడియాలు ఉన్నాయి. వాటితో వారిని హ్యాపీ చేయండి.

ఆల్బమ్ ఇవ్వండి..

కలిసి గడిపిన చిరస్మరణీయ క్షణాలను ఒకే చోటుకు తీసుకురండి. మీరు కలిసి దిగిన ప్రతి ఫోటోతో ఆల్బమ్‌ను తయారుచేయించండి. మీరు ఫొటో కింద ఆ క్షణానికి సంబంధించిన చిన్న క్యాప్సన్ రాయవచ్చు. మీ సొంత మాటల్లో రాస్తే ఇంకా బాగుంటుంది. మీ లవర్ కి మీరు అంటే ఎంతో ఇష్టమో వాలెంటైన్స్ డేకి అర్థమవుతుంది. లేదంటే మీరు ప్రేమ సందేశాన్ని కూడా రాయవచ్చు. మీ భాగస్వామి ఈ బహుమతిని స్వీకరించడానికి సంతోషిస్తారు.

గడియరం గిఫ్ట్ ఇవ్వండి

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మీ భాగస్వామికి అందమైన గడియారాన్ని బహుమతిగా ఇవ్వవచ్చు. ఇప్పుడు మార్కెట్లో వివిధ రకాల వాచీలు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి వాచీని ఇష్టపడుతున్నాడో కనుక్కోండి. నచ్చిన బహుమతిని ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇది మీ భాగస్వామికి చాలా సంతోషాన్నిస్తుంది.

కాఫీ మగ్

మీ భాగస్వామికి టీ లేదా కాఫీ ఇష్టమైతే మీరు వారికి మంచి కాఫీ మగ్‌ని బహుమతిగా ఇవ్వవచ్చు. మీరు కాఫీ మగ్‌పై ప్రేమ సందేశాన్ని రావచ్చు. లేదా మగ్‌పై మీ అందమైన చిత్రాన్ని ముద్రించవచ్చు. మీ సంతకం చేసి కూడా ఇవ్వొచ్చు. మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి. ఈ వాలెంటైన్స్ డేకి మంచి గిఫ్ట్ అవుతుంది.

ల్యాప్‌టాప్ బ్యాగ్

ల్యాప్‌టాప్‌ను ఉంచడానికి మంచి మన్నికైన ల్యాప్‌టాప్ బ్యాగ్‌ను అందించవచ్చు. ఈ రోజుల్లో మీరు వాటిని ఆన్‌లైన్‌లో కనుగొనవచ్చు. పనికి ల్యాప్ టాప్ తీసుకెళ్లినప్పుడల్లా మీరే గుర్తుకువస్తారు.

ఇయర్ ఫోన్స్

బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌లు లేదా వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లను బహుమతిగా ఇవ్వవచ్చు. ఇప్పుడు అవి బాగా ప్రాచుర్యం పొందాయి. మీ భాగస్వామి సంగీతం వినడానికి ఇష్టపడితే ఉత్తమ బహుమతి బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌లు, వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు ఉంటాయి. పని లేదా ప్రయాణ సమయంలో వాటిని పెట్టుకుని మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాలెంటైన్స్ డే సందర్భంగా మీ గురించి పాడుకుంటారు.

మెుబైల్ ఫోన్ బ్యాక్ కవర్

మొబైల్ ఫోన్లు మన జీవితంలో అంతర్భాగమైపోయాయనడంలో సందేహం లేదు. మొబైల్ లేకుండా బతకలేం. ఈ విషయాన్ని కలలో కూడా ఊహించలేం. కానీ చాలా సార్లు హడావుడిగా చేతిలోంచి ఫోన్ పడి విరిగిపోతుంది. ఈ ఇబ్బందిని నివారించడానికి మీరు మీ భాగస్వామికి మన్నికైన బ్యాక్ కవర్‌ను కొనుగోలు చేసి ఇవ్వొచ్చు. ఇప్పుడు చాలా మంది ఫోన్ కవర్‌పై వారి స్వంత డిజైన్‌లను తయారు చేసి ఇస్తున్నారు. మీరు దానిపై అందమైన డిజైన్‌ను కూడా చేయవచ్చు. ఫోన్ చూసినప్పుడల్లా మీరే గుర్తుకువస్తారు. ఈ వాలెంటైన్స్ డేకి ఇది ప్లాన్ చేయండి

పుస్తకం ఇవ్వండి

మీ భాగస్వామి పుస్తక ప్రియులైతే వారికి మంచి నవల లేదా కథల పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వండి. చదవడానికి ఇష్టపడే పుస్తకాల రకాన్ని బట్టి బహుమతి ఇవ్వండి. అప్పుడు చాలా సంతోషిస్తారు.

తదుపరి వ్యాసం