Nokia 110 । నాజూకు డిజైన్‌తో నోకియా నుంచి మరో సొగసైన ఫీచర్ ఫోన్!-nokia 110 feature phone with sleek design launched in india ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nokia 110 । నాజూకు డిజైన్‌తో నోకియా నుంచి మరో సొగసైన ఫీచర్ ఫోన్!

Nokia 110 । నాజూకు డిజైన్‌తో నోకియా నుంచి మరో సొగసైన ఫీచర్ ఫోన్!

HT Telugu Desk HT Telugu
Aug 04, 2022 10:06 PM IST

నోకియా బ్రాండ్ మీద సరికొత్త Nokia 8120 4Gతో పాటు Nokia 110 అనే ఫీచర్ ఫోన్‌ కూడా భారత మార్కెట్లో విడుదల అయింది. Nokia 110 ఇంకా సన్నగా, కేవలం రూ. 2 వేల లోపు ధరలో లభిస్తుంది.

Nokia 110
Nokia 110

ఫిన్నిష్ మొబైల్ ఫోన్ మేకర్ HMD గ్లోబల్ సరికొత్తగా Nokia 8120 4G అనే ఫీచర్ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే కదా, దీనితో పాటే మరొక ఫీచర్ ఫోన్ Nokia 110ను కూడా విడుదల చేసింది. 2022 ఎడిషన్ నోకియా 110 ఫోన్ చూడటానికి నాజూకుగా ఎంతో సొగసైన డిజైన్‌ను కలిగి ఉంది. అయితే ఎర్గోనామిక్ ఫిజికల్ కీబోర్డ్‌తో బలమైన బిల్డ్‌తో వచ్చింది. దీని డిస్‌ప్లే బెజెల్స్ లేకుండా మొత్తం ప్యానెల్ డామినేట్ చేసే బహుళ రంగు మోడల్‌లలో వచ్చింది.

Nokia 110 ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. కలర్ వేరియంట్ ఆధారంగా ధరలో స్వల్ప మార్పులు ఉన్నాయి.

నోకియా 110 సియాన్ అలాగే చార్‌కోల్‌ కలర్ ఆప్షన్ ఎంచుకుంటే దీని ధర రూ. 1,699/- గా ఉండగా రోజ్ గోల్డ్ కలర్‌ వేరియంట్ ధర రూ. 1,799కి అందుబాటులో ఉంటుంది.

ఇది ఫీచర్ ఫోన్ కాబట్టి సరళమైన కాంపాక్ట్ డిజైన్‌తో వస్తుంది. ఇందువల్ల సులభంగా ఒక చేతిలో ఇమిడిపోతుంది. హ్యాండిల్ చేయటం చాలా తేలిక.

Nokia 110 ఫీచర్లు

ఇక Nokia 110లో ఫీచర్లను పరిశీలిస్తే.. ఇందులో వెనుకవైపు కెమెరా, ఆటో కాల్ రికార్డింగ్, మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 32GB వరకు విస్తరించదగిన మెమరీ, 1,000mAh బ్యాటరీ ప్యాక్, FM రేడియో, ఇన్‌బిల్ట్ మ్యూజిక్ ప్లేయర్, కలర్ డిస్‌ప్లే, టార్చ్‌ వంటి స్పెక్స్ ఉన్నాయి. అలాగే కొన్ని ప్రీ లోడ్ చేసిన గేమ్‌లు, పాపులర్ స్నేక్ గేమ్ వంటివి ఉన్నాయి.

ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ. 299 విలువైన ఉచిత ఇయర్‌ఫోన్‌ సెట్ ఉచితంగా లభిస్తుంది. కొత్త నోకియా 110 భారతదేశంలోని అన్ని ప్రముఖ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఇప్పుడు అందుబాటులో ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్