Valentine's Day 2023 : వాలెంటైన్స్ డే అంటే పక్షుల సంభోగ కాలం అనుకునేవారట
Google Doodle Today : ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే. ప్రేమికులు ఈరోజున తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. అయితే ఒకప్పుడు వాలెంటైన్స్ డే అంటే.. పక్షుల సంభోగ కాలం ప్రారంభం అనుకునేవారట. ఈరోజు గూగుల్ డూడుల్ సైతం.. చాలా అందంగా ఉంది.
Today Google Doodle : ప్రపంచం ఈరోజు వాలెంటైన్స్ డే(Valentines Day)ని జరుపుకొంటుంది. ప్రేమ వేడుకను ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. ఉదాహరణకు సెయింట్ వాలెంటైన్స్ డే, సెయింట్ వాలెంటైన్ విందు అని కూడా చెబుతారు. అయితే అన్నింటికి ఒకటే అర్థం.. ప్రేమకు గుర్తింపు, వేడుక. గూగుల్ డూడుల్ ఈరోజు కూడా ఇంటరాక్టివ్‌తో ప్రేమ పండుగను జరుపుకొంది. Google Doodle నీటి బిందువులతో తడి ఉపరితలాన్ని చూపుతుంది. ఆ చుక్కలు కిందకు జారి, ప్రేమకు చిహ్నం అయిన హృదయాన్ని ఏర్పరుస్తాయి. చూసేందుకు బాగుంది.
వాలెంటైన్స్ డే అనేది సెయింట్ వాలెంటైన్ అనే వ్యక్తి ఇచ్చిన విందు రోజుగా ఉద్భవించిందని కొంతమంది అంటారు. అయితే, శతాబ్దాల మార్పుల తర్వాత, ఇది ఆధునిక వాలెంటైన్స్ డేగా మారింది. నిజం చెప్పాలంటే.. ఇప్పుడు వాలెంటైన్స్ అనేది ఓ పెద్ద బిజినెస్. .
అనేక జానపద కథలు సెయింట్ వాలెంటైన్(Saint Valentine) బలిదానం గురించి ఇతర కథలు చెబుతాయి. అతను రోమ్‌లో నివసించేవాడు. మూడవ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యం కింద ఖైదు అయ్యాడు. అప్పుడు చాలా హింసించబడేవాడు అనే ఓ కథ కూడా అందుబాటులో ఉంది. చరిత్రలోని ఓ కథ ప్రకారం.. వాలెంటైన్ తన జైలర్ కుమార్తెకు చూపును పునరుద్ధరించాడు. మరొక కథ ప్రకారం, సెయింట్ వాలెంటైన్ ఉరితీయబడటానికి ముందు అమ్మాయికి యువర్ వాలెంటైన్ అని రాసాడు. ఇలా వాలెంటైన్ డే గురించి చాలా కథలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇప్పుడు వాలెంటైన్ డే ప్రేమికులు.. తాము ప్రేమించిన వ్యక్తి మీద ప్రేమను వ్యక్తపరచడం.
మధ్య యుగాలలో, ఇంగ్లండ్, ఫ్రాన్స్ వంటి యూరోపియన్ దేశాలు పక్షులకు(Birds) సంభోగం కాలం ప్రారంభమైన రోజు అని నమ్మేవారని పేర్కొంది. వారు ఈ విషయాన్ని ప్రేమతో అనుబంధించారు. వెంటనే శృంగార వేడుకలను ప్రారంభించేవారు. 17వ శతాబ్దంలో ఈ సెలవుదినం ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రజాదరణ పొందింది.
సంబంధిత కథనం