Jio Valentine's Day offers: ‘వాలెంటైన్స్ డే’కు జియో స్పెషల్ ఆఫర్లు.. ఈ ప్లాన్‍లపై ఉచిత డేటా సహా మరిన్ని.. -jio valentines day offers on these three plans users can get free data vouchers full details
Telugu News  /  Business  /  Jio Valentines Day Offers On These Three Plans Users Can Get Free Data Vouchers Full Details
Jio Valentine's Day offers: ‘వాలెంటైన్స్ డే’కు జియో స్పెషల్ ఆఫర్లు
Jio Valentine's Day offers: ‘వాలెంటైన్స్ డే’కు జియో స్పెషల్ ఆఫర్లు

Jio Valentine's Day offers: ‘వాలెంటైన్స్ డే’కు జియో స్పెషల్ ఆఫర్లు.. ఈ ప్లాన్‍లపై ఉచిత డేటా సహా మరిన్ని..

13 February 2023, 23:11 ISTChatakonda Krishna Prakash
13 February 2023, 23:11 IST

Jio Valentine's Day offers: వాలెంటైన్స్ డే సందర్భంగా మూడు ప్రీపెయిడ్ ప్లాన్‍లపై ఆఫర్లను ప్రకటించింది రిలయన్స్ జియో. వాటి వివరాలు ఇవే.

Jio Valentine's Day offers: దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio).. ప్రేమికుల రోజు (Valentine's Day) సందర్భంగా ఆఫర్లను ప్రకటించింది. మూడు ప్రీపెయిడ్ ప్లాన్‍లపై అదనంగా ఉచిత డేటాతో పాటు కొన్ని కూపన్లను కూడా ఇవ్వనుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా తెచ్చిన ఈ ఆఫర్లు ఎంత కాలం అందుబాటులో ఉంటాయో జియో పేర్కొనలేదు. ప్రస్తుతం (ఫిబ్రవరి 13) ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రూ.349, రూ.899, రూ.2,999 ప్లాన్‍లపై వాలెంటైన్స్ డే ఆఫర్లను జియో ఇస్తోంది. ఈ బెనిఫిట్స్ విభిన్నంగా ఉన్నాయి. పూర్తి వివరాలు ఇవే.

Jio Valentine's Day offers: రూ.2,999పై ఆఫర్

వాలెంటైన్స్ డే ఆఫర్ కింద.. రూ.2,999 ప్లాన్‍తో రీచార్జ్ చేసుకుంటే అదనంగా 23 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే ఇప్పుడు రీచార్జ్ చేసుకుంటే 365 రోజులకు అదనంగా మరో 23 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. అలాగే 87జీబీ డేటా ఫ్రీగా వస్తుంది. ఇక్సిగో (ixigo), మెక్‍డొనాల్డ్స్, ఫెర్న్స్& పెటల్స్ కు సంబంధించిన రూ.1,000 విలువైన వౌచర్లు లభిస్తాయి. రూ.2,999 ప్లాన్‍తో రీచార్జ్ చేసుకుంటే ప్రతీ రోజు 2.5 జీబీ డేటా, అన్‍లిమిటెడ్ కాలింగ్, ప్రతీ రోజు 100ఎస్ఎస్‍లు లభిస్తాయి. సాధారణంగా 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అయితే ప్రస్తుతం వాలెంటైన్స్ డే ఆఫర్ ఉన్నప్పుడు రీచార్జ్ చేసుకుంటే 23 రోజుల అదనపు వ్యాలిడిటీ లభిస్తుంది.

Jio Valentine's Day offers: రూ.349, రూ.899 ప్లాన్‍లపై..

రూ.349, రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్‍లపై కూడా వాలెంటైన్ డే ఆఫర్ ఇస్తోంది జియో. ఈ ప్లాన్‍లను ఈ ఆఫర్ సమయంలో రీచార్జ్ చేసుకుంటే అదనంగా రూ.121 విలువైన 12జీబీ డేటా లభిస్తుంది. వీటితో పాటు ఇక్సిగో, మెక్‍డొనాల్డ్స్, ఫెర్న్స్& పెటల్స్ వౌచర్లు పొందవచ్చు.

సాధారణంగా రూ.349 ప్లాన్‍తో రీచార్జ్ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీతో ప్రతీ రోజు 2.5జీబీ డేటా లభిస్తుంది. అన్‍లిమిడెట్ కాల్స్, ప్రతీ రోజు 100 ఎస్ఎంఎస్‍లు దక్కుతాయి.

Jio 899 Plan: ఇక జియో రూ.899 ప్లాన్‍ను తీసుకుంటే ప్రతీ రోజ 2.5జీబీ డేటా లభిస్తుంది. 90 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అన్‍లిమిడెట్ కాల్స్, ప్రతీ రోజు 100ఎస్ఎంఎస్‍లు వాడుకోవచ్చు. వాలెంటైన్స్ డే ఆఫర్ కింద ఈ ప్లాన్‍లను రీచార్జ్ చేసుకుంటే ఇప్పుడు 12జీబీ అదనపు డేటా లభిస్తుంది. వాలెంటైన్స్ డే ఆఫర్లు ఎంత కాలం అందుబాటులో ఉంటాయో లాస్ట్ డేట్‍ను జియో ఇంకా వెల్లడించలేదు.

సంబంధిత కథనం