Valentine's Day Wishes : నీ నీడలా నీతో ఉండే నేను.. మీ కోసం వాలెంటైన్స్ డే విషెస్-happy valentine s day 2023 here s valentines day wishes messages and quotes to share with your special someone on valentine day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Valentine's Day Wishes : నీ నీడలా నీతో ఉండే నేను.. మీ కోసం వాలెంటైన్స్ డే విషెస్

Valentine's Day Wishes : నీ నీడలా నీతో ఉండే నేను.. మీ కోసం వాలెంటైన్స్ డే విషెస్

Anand Sai HT Telugu
Feb 13, 2023 03:34 PM IST

Valentine's Day 2023 Wishes : ప్రేమికుల రోజు వచ్చింది.. ప్రేమికులు తమ హృదయంలో నుంచి.. తమకు ఇష్టమైన వారిపై భావాలను వ్యక్తపరుస్తారు. ప్రియమైన వారికి గుండె లోతుల్లో నుంచి విషెస్ చెప్తారు. అయితే అలాంటివి మీకోసం కొన్ని ఇక్కడ ఉన్నాయి.

వాలెంటైన్స్ డే
వాలెంటైన్స్ డే (unsplash)

ప్రేమ.. చెప్పడానికి.. రెండు అక్షరాలే కానీ.. దీని చుట్టే ప్రపంచం అంతా నడుస్తుంది. రెండు అక్షరాల ప్రేమ రెండు జీవితాలను కలుపుతుంది. రెండు అక్షరాల ప్రేమ.. రెండు భిన్న ఆలోచనలు ఉన్న వ్యక్తులను దగ్గర చేస్తుంది. రెండు అక్షరాల ప్రేమ.. ఇద్దరి చేతులను ఏకం చేస్తుంది. రెండు అక్షరాల ప్రేమ.. రెండు కళ్లను నచ్చిన వ్యక్తివైపే చూసేలా చేస్తుంది. ఇలా ప్రేమ గురించి.. ఎంత చెప్పినా తక్కువే. అయితే ఈ వాలెంటైన్స్ రోజున మీ ప్రియమైన వారికి.. గుండెలోతుల్లో నుంచి మాటలు చెప్పండి. లైఫ్ టైమ్ మీ దగ్గరే ఉండిపోతారు. ఆ మాటలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. బలంగా మనసుకు తాకే మాట చెప్పి.. ఐ లవ్ యూ అని చెప్పండి.

నువ్వే నా సర్వస్వం అని చెప్పినా.. అది చిన్న మాటే అవుతుందేమో.. ఆల్ రెడీ నేను నువ్ అయిపోయాను.

రాత్రి పడుకునేముందు చివరి ఆలోచన.. ఉదయం లేచాక మెుదటి ఆలోచన నువ్వే.. ఐ లవ్ య్యూ.

జీవితంలో సంతోషంగా ఉండాలంటే.. ఆస్తులు అవసరం లేదు.. నువ్వు చాలు..

నాకు నువ్ ఎంత దూరంలో ఉన్నా.. నా మనసులో మాత్రం ఎప్పటికీ ఉంటావ్..

నా ప్రేమకు అర్థం లేదు.. నీ తోడు లేకుంటే.., నా కనుచూపునకు ప్రపంచం నచ్చడం లేదు.. నువ్వు కనపడకుంటే.., నా జీవిత గమనానికి గమ్యం లేదు.. నీతో ఏడు అడుగులు వెయ్యకుంటే.., నా మనసుకు ఓదార్పు లేదు నీ స్వరం వినపడకుంటే.

ప్రతి ఉదయం సూర్యుడి రాకతో నీ కోసం చూస్తున్నా.. ప్రతి రాత్రి వెన్నెల వెలుగుల్లో నీ స్పర్శ కోసం తపిస్తున్నా.. అద్దంలాంటి నా మనసు నీకు ఇచ్చేసా.. వెన్నలాంటి నా హృదయం నీకే రాసిచ్చా.. నా ఒంటరి తనం దూరం చేసి.. నన్ను అల్లుకో..

నువ్ ఏడిస్తే చూడలేను.. నీకు కష్టం వస్తే తట్టుకోలేను.. అందుకే నీ నీడలా నీతోనే ఉంటాను నేను.

శీతాకాలం వేకువజాము పొగమంచు అడుగుతోంది.. నీ ప్రేమ ఎక్కడ అని? పొగమంచుకు ఎలా చెప్పగలను.. తను నా హృదయంలో కొలువై ఉన్న సంగతి..!

పెరట్లో పూసిన గులాబీ నవ్వుతోంది.. నాలా అయినా పలకరించిందా.. నీ ప్రేమ అని? గులాబీకి ఎలా తెలుపగలను నా పెదవులపై ఉండే నవ్వు తనదే అని..!

సముద్రపు అలలు ప్రశ్నిస్తున్నాయ్ నన్ను.. కలలో అయినా నీ ప్రేమ కనిపించిందా అని? అలలకు ఎలా చెప్పగలను తన ఊహలు వరదలా నన్ను ముంచుతున్నాయని..!

Whats_app_banner

సంబంధిత కథనం