తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ulli Masala: ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా స్పైసీగా ఉల్లి మసాలా కూర వండేయండి, దీన్ని చేయడం చాలా సులువు

Ulli Masala: ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా స్పైసీగా ఉల్లి మసాలా కూర వండేయండి, దీన్ని చేయడం చాలా సులువు

Haritha Chappa HT Telugu

31 August 2024, 11:30 IST

google News
    • Ulli Masala: ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఉల్లి మసాలా కూరను ప్రయత్నించండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంత మేలు చేస్తుంది.
ఉల్లి మసాలా కర్రీ
ఉల్లి మసాలా కర్రీ

ఉల్లి మసాలా కర్రీ

Ulli Masala: అప్పుడప్పుడు ఇంట్లో కూరగాయలు అయిపోతాయి. బయటికి వెళ్లే తెచ్చేంత ఓపిక లేకపోతే ఇంట్లో ఉన్న ఉల్లిపాయలతోనే టేస్టీగా కూర వండేయచ్చు. అదే ఉల్లి మసాలా కూర. ఉల్లి మసాలాను వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. కొంచెం అన్నం కలవడం దీని స్పెషాలిటీ. మీకు నచ్చితే టమాటాలు కలుపుకోవచ్చు. టమాటాలు వేయకపోయినా ఈ కూర రుచిగా ఉంటుంది.

ఉల్లి మసాలా కూర రెసిపీకి కావాల్సిన పదార్థాలు

ఉల్లిపాయలు - నాలుగు

కొబ్బరి తురుము - అరకప్పు

పసుపు - అర స్పూను

వెల్లుల్లి రెబ్బలు - పది

కారం - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

ఆవాలు - అర స్పూను

కరివేపాకులు - గుప్పెడు

జీలకర్ర - అర స్పూను

ఎండుమిర్చి - నాలుగు

మిరియాలు - పావు స్పూను

మెంతులు - పావు స్పూను

నూనె - తగినంత

ఎండుమిర్చి - నాలుగు

చింతపండు - నిమ్మకాయ సైజులో

ఉల్లి మసాలా కూర రెసిపీ

1. ముందుగా మసాలాను సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద కళాయి పెట్టి కొబ్బరి తురుమును వేసి వేయించాలి.

2. అందులోనే ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చి, మెంతులు జీలకర్ర వేసి వేయించుకోవాలి.

3. వాటన్నింటిని మిక్సీ జార్లో వేసి చింతపండును కూడా వేసి మెత్తగా రుబ్బాలి.

4. అవసరమైతే నీటిని వేసుకోవాలి ఇది మసాలా పేస్ట్ లా తయారవుతుంది. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి.

5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

6. ఆ నూనెలో ఆవాలను వేసి చిటపటలాడించాలి.

7. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకులను కూడా వేసి వేయించాలి.

8. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసి వేయించాలి.

9. ఉల్లిపాయలను చిన్న సాంబారు ఉల్లిపాయల్ని ఎంచుకుంటే వాటిని కోయకుండానే వేసేయొచ్చు.

10. సాధారణ ఉల్లిపాయలు అయితే కొంచెం పెద్ద ముక్కల్లా కోసుకొని వేసుకోవాలి.

11. ఇవి ఉడుకుతున్నప్పుడు ముందుగా రుబ్బిన మసాలా ముద్దను వేసి బాగా కలుపుకోవాలి.

12. అందులోనే రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు కూడా వేయాలి.

13. ఇగురు కోసం నీళ్లను వేయాలి. ఇప్పుడు చిన్న మంట మీద పెట్టి, మూత పెట్టి కనీసం పావుగంట సేపు ఉడికించాలి.

14. తర్వాత మూత తీసి చూస్తే ఉల్లి మసాలా కూర రెడీ అయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో ఎక్కువగా కలుస్తుంది. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.

ఉల్లిపాయలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి ఇలా ఉల్లిపాయల కూరను తినడం వల్ల ప్రిహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది మధుమేహల్లో రక్తంలో చక్కెర అదుపులో ఉంటుంది కూడా బలంగా మారుతుంది చర్మ సంరక్షణకు ఉల్లిపాయలు ఎంతో సహాయపడతాయి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు కూడా ఉల్లిపాయలతో చేసిన ఆహారాన్ని తింటే మంచిది

టాపిక్

తదుపరి వ్యాసం