Tuesday Motivation : కష్టాల్లో నుంచే అవకాశాలు పుడతాయి.. అందుకోవాల్సిన బాధ్యత మనదే
28 May 2024, 5:00 IST
- Tuesday Motivation In Telugu : కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకు మనం దూరం అవుతూ ఉంటాం. అనుకున్నది జరగదు. ఇలాంటి పరిస్థితుల్లో డీలా పడిపోకూడదు. ఎందుకంటే సృష్టి మిమ్మల్ని పరీక్షిస్తుందని అర్థం చేసుకోవాలి.
మంగళవారం మోటివేషన్
జీవితంలో మంచి సమయాలు, చెడు సమయాలు ఉంటాయి. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం వస్తాయని పెద్దలు చెబుతారు. కానీ ఒక్కోసారి జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు, బాధలు, సవాళ్లు వస్తూనే ఉంటాయి. గొప్ప మానసిక బలం ఉన్నవారు కూడా ఇటువంటివాటి నుంచి తప్పించుకోలేని సంక్షోభాల వల్ల అలసిపోతారు. జీవితం నిరాశ, గందరగోళంతో నిండి ఉంటుంది.
సంక్లిష్టమైన పరిస్థితుల జీవితాంతం మీతోనే ఉంటాయని అనుకోకూడదు. ఇవి విశ్వం మన కోసం సిద్ధం చేసిన పరీక్ష కావచ్చు. అవి మరింత శక్తిని పొందేందుకు, మానసికంగా ఎదగడానికి, సరైన మార్గంలో పయనించడానికి విశ్వం మన కోసం సృష్టించిన అవకాశాలు. కష్టాలే మీకు అవకాశాలను సృష్టిస్తాయి. ఎలా ముందుకు వెళ్లాలో దారి చూపుతాయి.
జీవితంలో కష్టమైన సంఘటనలు కలిసి వచ్చినట్లు మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఒకదాని తర్వాత ఒకటి బాధలు వస్తున్నాయా? మనం ఊహించని విధంగా జరగడం, మనం అనుకున్న విధంగా జరగకపోవడంలాంటివి మీరు ఆగిపోయేందుకు కాదు.. ముందుకు సాగిపోయేందుకు. అవన్నీ విశ్వం మన కోసం సిద్ధం చేసే పరీక్షలు, అవకాశాలు. జీవితంలో ఎలాంటి సంఘటనల వచ్చినా మనల్ని ఓపెన్ మైండ్‌తో అంగీకరించమని, మన మనసు చెప్పిన ప్రకారం నడుచుకోవాలని సృష్టి చెప్పే జీవిత సత్యం.
ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో భావోద్వేగ ప్రకోపాలు లేదా అదుపు తప్పడం జరుగుతుంది. అటువంటి అవకాశాల ద్వారా ఈ సృష్టి మీ భావోద్వేగ స్థితిని పరీక్షిస్తుంది. సంక్లిష్ట పరిస్థితులకు ప్రతిస్పందించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. బాధలను వదిలించుకోవడానికి ఒక అవకాశాన్ని కూడా సిద్ధం చేస్తుంది. మనం ఎలా నడుస్తున్నామనేదే అసలు విషయం. ఇది మిమ్మల్ని మీరు మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, జీవితంలోని సంక్లిష్ట దశలలో ముందుకు సాగడానికి సహాయం చేస్తుంది.
మీకు జీవితంలో మళ్లీ మళ్లీ అదే సవాళ్లు లేదా అడ్డంకులు ఎదురయ్యాయా? అది కూడా విశ్వం ఆట. మిమ్మల్ని సరైన దారిలో పెట్టడానికి సృష్టి ప్రయత్నిస్తుంది. సంబంధ సమస్యలు, పనిలో ఎదురుదెబ్బలు, వ్యక్తిగత సమస్యలు జీవితంలో వైఫల్యానికి సంకేతాలు కాదు, ఎదుగుదల, మార్పు కోసం కొత్త అవకాశాలు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నిరుత్సాహపడకండి, అవి మనకు ఏమి బోధిస్తాయో ఆలోచించండి.
కొన్నిసార్లు మీరు డిస్‌కనెక్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. చాలా మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ అనుభూతిని పొందుతారు. అలాంటి పరిస్థితుల్లో మనం మన అంతర్గత కోరికలు, భావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తాం. ఇటువంటి వ్యక్తిగతేతర చర్యలు విశ్వం మీ వ్యక్తిగత విశ్వసనీయత, సమగ్రతను ప్రశ్నించేలా చేస్తాయి. జీవితంలో చేస్తున్న పనులు లక్ష్యాలు, కోరికలకు అనుగుణంగా ఉన్నాయో లేదో చెక్ చేయండి. లేకపోతే సరిదిద్దండి. అలా అయితే జీవితంలో ఎలాంటి కష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు.