Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు-couple gets intimate on crowded bus in odisha netizens demand strict action ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Couple Gets Intimate In The Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

HT Telugu Desk HT Telugu
May 14, 2024 06:30 PM IST

రద్దీగా ఉండే బస్సులో కూర్చున్న ఒక జంట ముద్దులు పెట్టుకోవడం, సన్నిహితంగా ఉంటూ లైంగిక చర్యలకు దిగడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో కావడంతో నెటిజన్లు ఆ జంటపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఒడిశా బస్సులో జంట అశ్లీల చర్యలు
ఒడిశా బస్సులో జంట అశ్లీల చర్యలు (Screengrab)

Couple gets intimate in the Bus: కదులుతున్న బస్సులో ఓ జంట లైంగిక కార్యకలాపాలకు దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తొలుత ఈ వీడియో ఢిల్లీకి చెందినదిగా ప్రచారం జరిగింది. ఆ వెంటనే పలువురు సోషల్ మీడియా యూజర్లు ఇదే వీడియోలోని స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ కండక్టర్ ధరించిన టీ షర్ట్ ప్రకారం అది ఒడిశాకు చెందిన బస్సుగా గుర్తించారు. అయితే, ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ రికార్డ్ అయ్యిందో HT ధృవీకరించలేరు.

పక్క సీటు వృద్ధురాలికి ఇబ్బంది

ఆ జంట రద్దీగా ఉన్న ఆ బస్సులో వెనుక సీటులో కూర్చున్నారు. ఆ తరువాత సన్నిహితంగా ఉంటూ, వికృత, అశ్లీల చర్యలకు పాల్పడడం ప్రారంభించారు. వారి పక్కనే కూర్చున్న ఒక వృద్ధురాలు వీరి ఆగడాలను చూడలేక తల పక్కకు తిప్పుకుంది. చివరకు, ముఖాన్ని చేతులతో కప్పుకుంది. ఈ దృశ్యాలన్నీ అదే బస్సులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి రికార్డ్ చేశాడు.

నెటిజన్ల ఆగ్రహం

ఈ వీడియో వైరల్ కావడంతో అశ్లీల చర్యలకు పాల్పడుతున్న జంటపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి' అని ఒక వ్యక్తి స్పందించారు. 'భావ ప్రకటనా స్వేచ్ఛ తర్వాత.. ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లో అశ్లీలత స్వేచ్ఛ' అని మరొకరు పోస్ట్ చేశారు. ‘షాకింగ్’ అని మూడో వ్యక్తి స్పందించాడు.

గతంలో బెంగళూరు మెట్రోలో..

గతంలో బెంగళూరు మెట్రో లో ప్రయాణిస్తున్న ఓ జంట అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రద్దీగా ఉండే మెట్రోలో ఈ జంట ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుని ముద్దులు పెట్టుకుంటున్నారు. ఆ వీడియోను రికార్డు చేసి షేర్ చేసిన వ్యక్తి.. ఆ జంటపై చర్యలు తీసుకోవాలని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీఎల్)కు ట్యాగ్ చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో స్పందించిన బెంగళూరు పోలీసులు… తదుపరి చర్యల కోసం పూర్తి వివరాలు అందించాలని ఫిర్యాదుదారుడిని కోరారు.

ఢిల్లీ మెట్రోలో కూడా..

గతంలో ఢిల్లీ మెట్రోలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి,మెట్రో బోగీల లోపల ఎవరైనా సన్నిహిత కార్యకలాపాలకు. అశ్లీల చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలుంటాయని మెట్రో అధికారులు హెచ్చరించారు. సోషల్ మీడియా ద్వారా పౌరులకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రయాణికులకు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నామని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇలాంటి చర్యలను తోటి ప్రయాణికులు గమనిస్తే వెంటనే తమకు తెలియజేయాలన్నారు.

IPL_Entry_Point