Fact Check : 'ల్యాబ్​లో పిల్లలను నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు' అంటున్న ఈ వైరల్​ వీడియోలో నిజమెంత?-fact check is the technology to grow embryos in artificial wombs of labs is the viral video true here is the detail ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Fact Check : 'ల్యాబ్​లో పిల్లలను నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు' అంటున్న ఈ వైరల్​ వీడియోలో నిజమెంత?

Fact Check : 'ల్యాబ్​లో పిల్లలను నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు' అంటున్న ఈ వైరల్​ వీడియోలో నిజమెంత?

Newschecker HT Telugu
May 14, 2024 11:49 AM IST

Artificial womb viral video : కృత్రిమ గర్భం టెక్నాలజీకి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది. ఈ వీడియోలో నిజం ఎంత? ఫ్యాక్ట్​ చెక్​ ఔట్​పుట్​ ఇక్కడ చూడండి..

వైరల్​ వీడియో ఫ్యాక్ట్​ చెక్​..
వైరల్​ వీడియో ఫ్యాక్ట్​ చెక్​..

Artificial womb viral video fact check : టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. కళ్లు మూసి తెరిచేలోపు.. టెక్నాలజీ విషయంలో ప్రపంచంలో ఏదో మూల, ఏదో ఒక కొత్త వింత జరుగుతోంది. ఇలాంటి ఒక టెక్నాలజీకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. 'ల్యాబ్​లో మీకు నచ్చినట్టు, మీ పిల్లల్ని తయారు చేసుకోవచ్చు,' అని ఆ వీడియోలో ఉంది. మరి ఇందులో నిజం ఎంత? 'న్యూస్​ చెకర్​'.. వివిధ ఫ్యాక్ట్​ చెక్​​ టెక్నిక్స్​ని వాడి.. ఇందులో నిజమెంతో తేల్చేసింది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ జెస్ట్​ సంభావిత దశ (కాన్సెప్చ్యువల్​)లో ఉన్నట్టు పేర్కొంది. కానీ ఇప్పుడైతే వైరల్​ వీడియోలో చెబుతున్న విషయాలు తప్పని వివరించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ల్యాబ్​లో పిల్లలను తయారు చేసుకోవచ్చా?

ఫేస్​బుక్​లో వైరల్​ అయిన వీడియోలో విస్తుపోయే టెక్నాలజీ ఒకటి కనిపించింది. ల్యాబ్​లలో పిల్లను పుట్టించడం ఈ టెక్నాలజీ ఉద్దేశం. పైగా... పిల్లల రంగు, ఎత్తుతో పాటు అనేక విషయాల్లో తల్లిదండ్రులకు ఆప్షన్స్​ లభిస్తున్నాయి. వాటిని ఎంచుకుని.. పిల్లలను తల్లిదండ్రులు సొంతంగా తయారు చేసుకోవచ్చు అన్నట్టు ఉంది ఈ టెక్నాలజీ.

న్యూ చెకర్​.. 'ఆర్టిఫీషియల్​ ఇంక్యుబేటర్​ ఫర్​ హ్యూమెన్​ బేబీస్​' వంటి వివిధ కీవర్డ్​ సెర్చ్​లను గూగుల్​లో సెర్చ్​ చేసి ఫ్యాక్ట్​ చెక్​ చేసింది. ఫలితంగా.. డిసెంబర్​ 2022లో హషీమ్​ అల్​ గైలి యూట్యూబ్​లో పోస్ట్​ చేసిన ఓ వీడియో కనిపించింది. ప్రస్తుతం ఫేస్​బుక్​లో వైరల్​ అయిన వీడియో.. ఈ యూట్యూబ్​ వీడియో నుంచే తీసినట్టు తేలింది.

ఎక్టో లైఫ్​ ఫెసిలిటీకి సంబంధించిన ఈ యూట్యూబ్​ వీడియో ముగింపులో.. ఈ టెక్నాలజీ ప్రస్తుతం కాన్సెప్ట్​ దశలోనే ఉన్నట్టు చెప్పారు.

'ఎక్టోలైఫ్​- వరల్డ్స్​ ఫస్ట్​ ఆర్టిఫీషియల్​ ఊంబ్​ ఫెసిలిటీ', 'ఆర్టిఫీషియల్​ ఊంబ్​ ఫెసిలిటీ కెన్​ నర్చర్​ 30,000 బేబీస్​ ఎ ఇయర్​' అంటూ ఉన్న కొన్ని వీడియోలు కూడా.. అల్​ గాలి ఫేస్​బుక్​ అకౌంట్​లో కనిపించాయి. ఆయా వీడియోల కింద.. 2022 scienceandstuff.com / EcoLife-artificial-womb వంటి లింక్స్​ కూడా ఉన్నాయి. ఈ scienceandstuff.com వ్యవస్థాపకుడు కూడా అల్​ గైలీనే.

Artificial womb viral video : రెండో లింక్​లో అనే ఫైల్స్​, ఎక్టోలైఫ్​ ఫెసిలిటీ లోగో, ఇమేజ్​లు, వీడియోలు, 3 పేజ్​ ప్రెస్​ రిలీజ్​ వంటివి ఉన్నాయి. ఇందులోనూ.. అల్​ గైలీ బయోగ్రఫీ ఉంది.

'హసీమ్​ అల్​ గైలి ఒక ఫిల్మ్​మేకర్​, జర్మనీ బెర్లిన్​లో నివాసముండే సై​న్స్​ కమ్యూనికేటర్​. ఆయనొక మాలిక్యులర్​ బయోలిజిస్ట్​. తన సోషల్​ మీడియా అకౌంట్​, వీడియో కంటెంట్​ ద్వారా.. గైలీ, ప్రజలను విజ్ఞానవంతులు చేస్తున్నారు,' అని 'క్రియేటర్​ ఆఫ్​ ఎక్టోలైఫ్​ ఆర్టిఫీషియల్​ ఊంబ్​ కాన్సెప్ట్​' పేరుతో విడుదలైన ప్రెస్​ నోట్​లో ఉంది.

హఫింగ్టన్​ పోస్ట్​ అనే వార్తా సంస్థ.. ఈ కృత్రిమ గర్భంపై ఇప్పటికే ఫ్యాక్ట్​ చెక్​ చేసింది. ఇందులో నిజం లేదని తేల్చింది. కానీ.. భవిష్యత్తులో ఇది సాధ్యమయ్యే విషయమే అని పేర్కొంది.

"థియరీ పరంగా చూసుకుంటే.. ఇది సాధ్యమే. కృత్రిమ గర్భం సాధ్యమే," అని కింగ్స్​ కాలేజ్​ లండన్​ ప్రొఫెసర్​ ఆఫ్​ ఆస్ట్రెట్రిక్స్​ ఆండ్రూ షానన్​ తెలిపారు. "సరైన వాతావరణం ఉండాలి. ప్రోత్సాహం ఉండాలి. ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు కావాల్సిన టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి," అని వివరించారు.

ఇప్పటికేతై.. సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన ఈ కృత్రిమ గర్భం వీడియో ఫిక్షన్​ మాత్రమే! ఇందులో నిజం లేదు.

గమనిక:- న్యూస్​చెకర్​ ఈ ఆర్టికల్​ని పబ్లీష్​ చేసింది. దానిని హెచ్​టీ తెలుగు తిరిగి ప్రచురించింది. న్యూస్​ చెకర్​లో ఉన్న ఒరిజినల్​ ఆర్టికల్​ని చూసేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం