Sharing WhatsApp status: మీ వాట్సాప్ స్టేటస్ ను ఫేస్ బుక్ సహా వేరే యాప్స్ కు ఇలా సింపుల్ గా షేర్ చేేసేయండి..
Sharing WhatsApp status: వాట్సాప్ స్టేటస్ లను ఆండ్రాయిడ్, ఐఫోన్ లలో షేర్ చేయాలనుకుంటున్నారా? సింపుల్ గా చేసేయొచ్చు. ఈ స్టెప్ బై స్టెప్ విధానం తో ఈజీగా మీ వాట్సాప్ స్టేటస్ ను ఫేస్ బుక్ స్టోరీస్ గా షేర్ చేసేయండి.

ప్రతీకాత్మక చిత్రం (unsplash)
Sharing WhatsApp status: వాట్సాప్ స్టేటస్, ఫేస్ బుక్ స్టోరీ లు ఈ మధ్య చాలా పాపులర్ అయ్యాయి. వాటి ద్వారా సింపుల్ గా ఎక్కువ మందికి రీచ్ కాగలగడం, 24 గంటల లిమిట్ ఉండడం యూజర్లకు మరింత అనుకూలంగా ఉంటోంది. అయితే, వీటిని పరస్పరం షేర్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.
వాట్సాప్ స్టేటస్ ను ఇలా షేర్ చేయొచ్చు..
- వాట్సాప్ స్టేటస్ (WhatsApp status) అప్ డేట్స్ ను మీ ఫేస్ బుక్ స్టోరీస్ (Facebook Stories) వంటి యాప్స్ కు షేర్ చేయడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.
- ముందుగా మీ ఫోన్ లో WhatsApp ను ఓపెన్ చేయాలి
- “Settings” లోకి నావిగేట్ చేయండి.
- "Account"పై ట్యాప్ చేయండి.
- "Linked Accounts" ఎంచుకోండి.
- లింక్డ్ అకౌంట్స్ లో "Facebook"ని ఎంచుకుని, మీ Facebook ఖాతాను లింక్ చేయడానికి ఆన్-స్క్రీన్ సూచనలను అనుసరించండి.
- ఫేస్ బుక్ అకౌంట్ లింక్ అయిన తరువాత, మీ వాట్సాప్ స్టేటస్ అప్ డేట్స్ ను సులభంగా ఫేస్ బుక్ స్టోరీస్ లోకి షేర్ చేయవచ్చు.
- ఆండ్రాయిడ్, ఐ ఫోన్ లలో మీ వాట్సాప్ స్టేటస్ అప్ డేట్స్ ను ఫేస్ బుక్ స్టోరీస్ లోకి షేర్ ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం
On Android: ఆండ్రాయిడ్ ఫోన్ లో..
- వాట్సాప్ ను ఓపెన్ చేసి, అప్ డేట్స్ లోకి వెళ్లాలి.
- స్టేటస్ హెడర్ లోని మై స్టేటస్ ను ట్యాప్ చేసి, స్టేటస్ ను క్రియేట్ చేయాలి.
- మీరు షేర్ చేయాలనుకుంటున్న స్టేటస్ అప్‌డేట్ పక్కన ఉన్న “more” పై క్లిక్ చేయాలి.
- "Share to Facebook"ని ఎంచుకోండి.
- ఆ తరువాత “SHARE NOW” ను సెలెక్ట్ చేసుకోండి.
- దాంతో, మీ వాట్సాప్ స్టేటస్ ఫేస్ బుక్ స్టోరీగా షేర్ అవుతుంది.
On iPhone: ఐఫోన్ లో..
- వాట్సాప్ ను ఓపెన్ చేసి, అప్ డేట్స్ లోకి వెళ్లాలి.
- స్టేటస్ హెడర్ లోని మై స్టేటస్ ను ట్యాప్ చేసి, స్టేటస్ ను క్రియేట్ చేయాలి.
- మీరు షేర్ చేయాలనుకుంటున్న స్టేటస్ అప్‌డేట్ రన్ అవుతున్న సమయంలో ““eye icon”” పై క్లిక్ చేయాలి.
- డ్రాప్ డౌన్ మెన్యూలో ఉన్న “more” పై క్లిక్ చేయాలి.
- "Share to Facebook"ని ఎంచుకోండి.
- ఆ తరువాత “SHARE NOW” ను సెలెక్ట్ చేసుకోండి.
- దాంతో, మీ వాట్సాప్ స్టేటస్ ఫేస్ బుక్ స్టోరీగా షేర్ అవుతుంది.
మరిన్ని స్టాక్‌మార్కెట్, కంపెనీల ఫైనాన్షియల్ రిజల్ట్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, గాడ్జెట్లు, స్మార్ట్ఫోన్లు, టెక్నాలజీ, గోల్డ్ ప్రైస్ తదితర తాజా వార్తలను చూడండి.