Zerodha’s Nikhil Kamath: ‘జెరోధా’ నిఖిల్ కామత్ ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా?.. బెంగళూరు సంపదపై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కు ఉపయోగపడే ఫేమస్ స్టార్ట్ అప్ ‘జెరోధా’ సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ తన చదువు, తొలి వేతనం, స్నేహితులతో అనుబంధం.. మొదలైన విషయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ది ప్రింట్ ఎడిటర్ ఇన్ చీఫ్ శేఖర్ గుప్తాతో ఇంటర్వ్యూలో జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ (Nikhil Kamath) పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. ఈ సంభాషణలో ఆయన తన జీవిత ప్రయాణంలోని వివిధ కోణాలను వివరించారు. అలాగే, భారతదేశ వృద్ధి పథం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొదలైన అంశాలపై కూడా వారు చర్చించారు. అంతేకాదు, బెంగళూరులో కనిపించే సంపదపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఫస్ట్ శాలరీ..
తన మొదటి ఉద్యోగం, తనపై అది చూపిన ప్రభావంతో సహా తన కెరీర్ ప్రారంభంలో జరిగిన పలు సంఘటనలను కూడా జెరోధా (Zerodha co-founder) సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ వివరించారు. కామత్ (Nikhil Kamath) తన 17వ ఏట తొలి వేతనాన్ని అందుకున్నాడు. బెంగళూరులోని ఓ కాల్ సెంటర్లో పనిచేసిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నాడు. తన మొదటి ఉద్యోగం బెంగళూరులోని 24 బై 7 అనే కాల్ సెంటర్ లో చేశానని వివరించాడు. తన మొదటి నెల వేతనం రూ.8,000 అని వెల్లడించారు. స్టోన్ బ్రిడ్జ్ అనే కంపెనీ తరఫున యాక్సిడెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ అమ్మేవాడినని కామత్ తెలిపారు. అప్పుడు జాబ్ టైమింగ్స్ యూకే షిఫ్ట్ ప్రకారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు ఉండేవన్నారు.
డిగ్రీ అసవరం లేదు..
‘‘17 ఏళ్ల వయసులో తొలి వేతనం అందుకున్న సమయంలో చాలా హ్యాప్పీగా, కాన్ఫిడెంట్ గా ఫీలయ్యాను. ఆ సమయంలో నా స్నేహితులకు అందుబాటులో ఉన్న దానికంటే ఎక్కువ డబ్బు నాకు అందుబాటులో ఉంది. కానీ, మీ స్నేహితులు కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వారి మొదటి ఉద్యోగాన్ని పొందినప్పుడు మీరు నిరాశ చెందడం ప్రారంభిస్తారు’’ అని కామత్ (Nikhil Kamath) వ్యాఖ్యానించారు. ‘‘అయితే, కాల్ సెంటర్ లో జాబ్ చేయడానికి డిగ్రీ అవసరం లేదు. పెద్దగా టెక్నికల్ స్కిల్స్ కూడా అవసరం లేదు. కానీ, కాల్ సెంటర్ జాబ్స్ కు సమాజంలో గౌరవం ఉండదు. మీరు కాల్ సెంటర్ లో జాబ్ చేస్తూ, నెలకు రూ. 1 లక్ష సంపాదించినా.. సమాజం గుర్తించదు. . గౌరవం ఇవ్వదు. అదే, మెడిసిన్ చదివి.. ఒక డాక్టర్ గా నెలకు రూ. 25 వేలు సంపాదించినా.. సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయి’’ అని నిఖిల్ కామత్ వ్యాఖ్యానించారు. తన స్నేహితులు, సహ వయస్సు వారు, స్కూల్ ఫ్రెండ్స్ మెడిసిన్ లేదా ఇంజనీరింగ్ వంటి పాపులర్ కోర్సెస్ లో చేరడం తనను కామత్ కొన్నిసార్లు డిప్రెస్డ్ గా అనిపించేదన్నారు.
సొంత అనుభవం ముఖ్యం..
కానీ, ‘‘మా అందరికీ 25 ఏళ్లు వచ్చేసరికి.. మిగతావారు డాక్టర్స్ గానో, ఇంజనీర్స్ గానో సెటిల్ అయినా.. నా జీవితంలో 7-8 ఏళ్లుగా ఏదో ఒక పని చేశాను. కాబట్టి ఆ అనుభవం నాకు ఎంతో ఉపయోగపడింది’’ అని Zerodha co-founder నిఖిల్ కామత్ తెలిపారు. ‘‘ఒక దశకు మించి, పీర్ గ్రూపు ఎలా ఉన్నప్పటికీ, తోటి సమూహంతో పోల్చుకునే సమయంలో.. ఏదో ఒక ఇష్టమైన పని చేస్తున్నాను కాబట్టి, నాకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి, అది మిగతావారిని బాధించినట్లుగా నన్ను బాధ పెట్టలేదు’’ అని Nikhil Kamath వివరించారు.
బెంగళూరుది అంతా పేపర్ సంపద
బెంగళూరు (Bengaluru)లో కనిపించే సంపద అంతా వాస్తవానికి, కాగితపు సంపద (paper wealth) అని నిఖిల్ కామత్ వ్యాఖ్యానించారు. అది నిజమైన డబ్బు కాదని, అందులో చాలా భాగం ఖర్చు చేయదగ్గ సంపద కాదని జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ జెరోధా వ్యాఖ్యనించారు. ‘‘ఇది సంపదగా కనిపిస్తుంది. కానీ, అవసరమైనప్పుడు ఖర్చు చేయగలిగే సంపద కాదు’’ అన్నారు. ఇక్కడి పేపర్ రిచ్ టెక్ కంపెనీల్లో డబ్బు సంపాదించారు, కానీ టెక్ కంపెనీల వద్ద నగదు లేదు. కాగితపు డబ్బు మీకు సంపద రూపాన్ని ఇస్తుంది" అని ఆయన అన్నారు.