Manchu Lakshmi: ఆమె రోజూ ఏం తింటుందో గమనించేదాన్ని.. అవకాశాలు క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి-manchu lakshmi comments on vedhika in yakshini web series trailer launch yakshini ott release on disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manchu Lakshmi: ఆమె రోజూ ఏం తింటుందో గమనించేదాన్ని.. అవకాశాలు క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

Manchu Lakshmi: ఆమె రోజూ ఏం తింటుందో గమనించేదాన్ని.. అవకాశాలు క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

Sanjiv Kumar HT Telugu
May 25, 2024 11:16 AM IST

Manchu Lakshmi About Vedhika In Yakshini Trailer Launch: మంచు లక్ష్మి నటిస్తున్న లేటెస్ట్ ఓటీటీ వెబ్ సిరీస్ యక్షిణి. తాజాగా యక్షిణి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ వేదిక ఏం తింటుందో రోజూ గమనించేదాన్ని అని మంచు లక్ష్మి తెలిపారు.

ఆమె రోజూ ఏం తింటుందో గమనించేదాన్ని.. అవకాశాలు క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి
ఆమె రోజూ ఏం తింటుందో గమనించేదాన్ని.. అవకాశాలు క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

Manchu Lakshmi Yakshini Vedhika: ఆర్కా మీడియా వర్క్స్ (Arka Media Works), డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ కాంబినేషన్‌లో వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ యక్షిణి (Yakshini Web Series). ఈ వెబ్ సిరీస్‌ను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ఈ సిరీస్‌లో హీరోయిన్ వేదిక (Vedhika), మంచు లక్ష్మి (Lakshmi Manchu), రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నారు.

yearly horoscope entry point

యక్షిణి వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్

జూన్‌లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో యక్షిణి వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో (Disney Plus Hotstar) స్ట్రీమింగ్‌కు రాబోతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం అంటే మే 24న యక్షిణి వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మితోపాటు నిర్మాత దేవినేని ప్రసాద్ ఇతరులు ఆసక్తికర విశేషాలు చెప్పారు.

ప్రతి రోజూ కొత్తగా

"యక్షిణి వెబ్ సిరీస్‌లో జ్వాల క్యారెక్టర్‌లో కనిపిస్తాను. ఈ స్క్రిప్ట్ చదివినప్పుడు ఈ క్యారెక్టర్ నేను తప్ప మరెవరు చేస్తారు అనిపించింది. షూటింగ్‌లో ప్రతి రోజూ కొత్తగా అనిపించేది. నేను ఈ సిరీస్ చేయాలని రాసిపెట్టి ఉందని భావిస్తాను. ఆర్కా మీడియా, డిస్నీతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది" అని నటి మంచు లక్ష్మీ తెలిపారు.

అందుకే బిజీగా ఉంటా

"వేదిక రోజూ ఏం తింటుందో గమనించేదాన్ని. అజయ్ (Actor Ajay) అలా నిల్చుని ఉంటే చాలు పర్‌ఫార్మ్ చేసినట్లే. తోటి ఆర్టిస్టులంతా అతనితో పోటీ పడాల్సిఉంటుంది. రాహుల్ విజయ్ (Rahul Vijay) ఫాదర్, మా నాన్న కలిసి సినిమాలు చేశారు. ఇప్పుడు మేము కలిసి సిరీస్ చేయడం సంతోషంగా ఉంది. నేను ఎవరో అవకాశాలు ఇస్తారని వేచి చూడను. అవకాశాలు క్రియేట్ చేసుకుంటా. అందుకే సిరీస్‌లు, షోస్ అంటూ ఏదో ఒక వర్క్‌లో బిజీగా ఉంటాను. యక్షిణి మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. తప్పకుండా చూడండి" అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు.

బడ్జెట్ విషయంలో ఫ్రీడమ్

"పరంపర (Parampara Web Series) తర్వాత డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌తో కలిసి మేము చేస్తున్న రెండో సిరీస్ ఇది. రొమాన్స్, కామెడీ, డ్రామా వంటి అంశాలతో యక్షిణి ఆకట్టుకుంటుంది. డిస్నీ మాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చిందో మేము బడ్జెట్ విషయంలో యక్షిణి టీమ్‌కు అంత ఫ్రీడమ్ ఇచ్చాం" అని నిర్మాత ప్రసాద్ దేవినేని తెలిపారు.

పరంపరను మించి

"ఈ యక్షిణి వెబ్ సిరీస్ పూర్తిగా దర్శకుడు తేజ మార్ని విజన్ అని చెప్పాలి. మా ఆర్కా టీమ్‌కు, డిస్నీ టీమ్‌కు థ్యాంక్స్ చెబుతున్నా. యక్షిణిలో మంచి కాస్టింగ్ ఉన్నారు. వారంతా సూపర్బ్‌గా పర్‌ఫార్మ్ చేశారు. పరంపరను మించి యక్షిణి సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాం. యక్షిణి సీజన్ 2 (Yakshini Season 2) కోసం కూడా ప్లానింగ్ మొదలుపెట్టాం" అని యక్షిణి వెబ్ సిరీస్ నిర్మాత ప్రసాద్ దేవినేని పేర్కొన్నారు.

Whats_app_banner