తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Flax Seeds Gel : చర్మంపై ముడతలను తగ్గించే మ్యాజిక్ జెల్.. ఇలా ఉపయోగించండి

Flax Seeds Gel : చర్మంపై ముడతలను తగ్గించే మ్యాజిక్ జెల్.. ఇలా ఉపయోగించండి

Anand Sai HT Telugu

20 May 2024, 14:55 IST

google News
    • Flaxseeds Gel For Skin In Telugu: అవిసె గింజలు మీ చర్మానికి అందాన్ని ఇస్తాయని మీకు తెలుసా? అవిసె గింజలతో జెల్ తయారు చేసుకుంటే మీకు ఫలితం తెలుస్తుంది.
అవిసె గింజల జెల్
అవిసె గింజల జెల్ (Unsplash)

అవిసె గింజల జెల్

మచ్చలు లేకుండా, అవాంఛిత కొవ్వు పేరుకుపోకుండా సంపూర్ణ ఆకృతిని కలిగి ఉండాలనేది ప్రతి వ్యక్తి కల. కానీ బిజీ జీవితాలు, వ్యాయామం లేకపోవడం, ఊబకాయం ఆ కలను నిజం కాకుండా చేస్తాయి. చర్మం సరిగా ఉండదు. బ్యూటీ కేర్‌ను చాలా సీరియస్‌గా తీసుకునే వారు సాధారణంగా ఈ పరిస్థితిని సరిచేయడానికి బొటాక్స్ ఇంజెక్షన్లు చేస్తారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. అయితే ఇంట్లోనే తయారు చేసుకునే ఫ్లాక్స్ సీడ్ జెల్ తో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

ఫ్లాక్స్ సీడ్ జెల్ అనేది మీ ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లను కలిగి ఉన్న అవిసె గింజలు సాధారణంగా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి. అదే విధంగా ఫ్లాక్స్ సీడ్ జెల్ చర్మంపై ముడతలు, సన్నని గీతలు ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. చర్మం పాడవకుండా చేస్తుంది.

ఫ్లాక్స్ సీడ్ జెల్ చాలా తక్కువ పదార్థాలతో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని కోసం అవిసె గింజల 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. ఒక గ్లాసు నీళ్లలో వేసి ఉండనివ్వండి. దీన్ని తక్కువ మంట మీద ఉడికించాలి. అలాగే తరచుగా కదిలించాలి. తెల్లగా మారడం ప్రారంభించినప్పుడు మంటను ఆపివేయండి. 

తదుపరి దశ ఏంటంటే.. ఒక గుడ్డ ద్వారా శుభ్రంగా వడకట్టడం. ఈ పేస్ట్ లాంటి పదార్ధం చల్లబడినప్పుడు జెల్ లాగా మారుతుంది. దానిని సేకరించి గాజు పాత్రలో భద్రపరుచుకోవాలి. ఎంత అవసరమో దానిని బట్టి ఉపయోగించాలి. దీన్ని ఎక్కువ కాలం ఉపయోగించాలంటే ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది.

అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్

అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడతాయి. దీంతో చర్మం దృఢంగా మారుతుంది. అదనంగా ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. పెరిగిన కొల్లాజెన్ ద్వారా చర్మం గ్లో కూడా పెరుగుతుంది. పొడి చర్మం ఉన్నవారికి ఇది ఉత్తమమైన ఔషధం. 

నల్లటి వలయాలు, కళ్ల కింద నల్లటి వలయాలు వంటివాటికి కూడా ఇది మంచిది. రోజువారీ ఉపయోగం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఇది ఏ వయస్సు వారైనా ఉపయోగించవచ్చు.

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అప్పుడే ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది. లేదంటే సమస్యలు వస్తాయి. చర్మాన్ని సరిగా చూసుకోకుంటే.. మీరు అనేక రకాల సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. ముడతలు పడిన చర్మం మీ అందాన్ని పాడు చేస్తుంది. అందుకే సహజ పద్ధతులను వాడాలి.

 మీరు రసాయనాలు ఉండే క్రీములను వాడితే మాత్రం కచ్చితంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. అలాంటి వాటి జోలికి పోకుండా సహజమైన పదార్థాలతోనే మీరు మీ చర్మాన్ని కాపాడుకోవాలి.

తదుపరి వ్యాసం