తెలుగు న్యూస్  /  Lifestyle  /  Try These Home Remedies To Get Relief From Winter Headaches

Winter Headaches । చలికి ప్రతిరోజూ తలనొప్పిగా ఉంటుందా? ఈ చిట్కాలు ప్రయత్నించండి!

HT Telugu Desk HT Telugu

16 January 2023, 10:55 IST

    • Home Remedies for Winter Headaches: చలికాలంలో దగ్గు, జలుబుతో పాటు తలనొప్పి కూడా వేధిస్తుంది. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు, అవి ఇక్కడ చూడండి.
 Remedies for Winter Headaches
Remedies for Winter Headaches (Unsplash)

Remedies for Winter Headaches

చలికాలంలో దగ్గు, జలుబుతో పాటు తలనొప్పి కూడా సర్వసాధారణంగా తలెత్తే సమస్య. చలి గాలులో చెవుల్లో దూరినపుడు కొందరికి తల భారంగా అనిపిస్తుంది, దీంతో అలసటగా అనిపిస్తుంది, చిరాకును ప్రదర్శిస్తుంటారు. వాతావరణంలో మార్పులు, ముఖ్యంగా చల్లని వాతావరణం మెదడు రసాయనాలలో అసమతుల్యతను కలిగిస్తాయి, ఇందులో సెరోటోనిన్ కొంతమందిలో మైగ్రేన్‌ను ప్రేరేపిస్తుంది.

ఇదే కాకుండా అధిక ఒత్తిడి, ఆందోళనలు, శరీరానికి సరైన విశ్రాంతి లేకపోవడం, నిద్ర తక్కువగా ఉండటం వంటి కారణాలు కూడా తలనొప్పికి కారణం అవుతాయి. అయితే ఇలా తలనొప్పి కలిగిన ప్రతీసారి మాత్రలు వేసుకొని బయట పడాలనుకోవడం మంచి అలవాటు కాదు. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నపుడు మనల్ని మనం లోపలి నుంచి వెచ్చగా ఉంచుకోవడం ద్వారా కూడా సులభంగా ఈ తలనొప్పుల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది.

Home Remedies for Winter Headaches- తలనొప్పికి ఇంటి నివారణలు

తలనొప్పి ఉన్నప్పుడు కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం వలన అవి శరీరంలో వేడిని కలిగించి మిమ్మల్ని వెచ్చగా ఉంచుతాయి, అలాగే తలనొప్పి భారాన్ని తగ్గిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

అల్లం

అల్లం తలనొప్పికి అత్యంత ప్రభావవంతమైన నివారణలలో ఒకటి. ఇది నొప్పిని తగ్గించడంలో సహాయపడటమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, వికారంను అరికట్టడంలో సహాయపడుతుంది. తక్షణ ఉపశమనం కోసం మీరు అల్లం పొడిలో కొన్ని నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని మీ నుదిటిపై ఉపయోగించవచ్చు లేదా అల్లం టీ చేసుకోని తాగవచ్చు. అల్లం రసం, నిమ్మరసంను సమపాళ్లలో కలిపి రిఫ్రెష్ డ్రింక్ తాగటం వలన ఉపశమనం లభిస్తుంది.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క తలనొప్పి నుంచి ఉపశమనం కలిగించే మరొక ఇంటి నివారణి. దాల్చిన చెక్కను పొడిగా గ్రైండ్ చేసుకొని, అందులో కొన్ని నీళ్లు కలిపి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్టును నుదురుకు రాసుకొని ఒక అరగంట పాటు ఉంచుకుంటే తలనొప్పి తగ్గుతుంది. అదనంగా మీరు దాల్చినచెక్కతో టీ కూడా చేసుకొని తాగవచ్చు.

లవంగాలు

లవంగాలలో నొప్పిని తగ్గించే గుణాలు ఉన్నాయి. కొన్ని లవంగాలను చూర్ణంగా చేసి ఒక సాచెట్‌లో లేదా శుభ్రమైన రుమాలులో ఉంచి ఆ వాసనను పీల్చాలి, మీకు హాయిగా అనిపిస్తుంది. లేదా మరొక విధానంలో, రెండు చుక్కల లవంగం నూనె, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, సముద్రపు ఉప్పును ఉపయోగించి పేస్ట్ తయారు చేసి, దాని మీ నుదిటిపై రాసి మసాజ్ చేయవచ్చు ఇలా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ తైల మిశ్రమం కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులకు కూడా అద్భుత ఔషధంలా పనిచేస్తుంది.

కెఫిన్ పానీయం

మీకు జలుబు కారణంగా తలనొప్పి ఉంటే, వెచ్చని ప్రభావాలను కలిగి ఉండే కెఫిన్ వంటి పానీయాలు తీసుకోవచ్చు. తలనొప్పి ఉన్నాప్పుడు ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగవచ్చు. ఇందులో కెఫిన్ ఉంటుంది, ఇది మెదడును రిలాక్స్‌గా ఉంచడంతో పాటు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే కెఫిన్ ఎల్లప్పుడూ మితమైన మోతాదులో తీసుకోవడం ఉత్తమం.