తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Common Cold Prevention : చలికాలంలో జలుబు వస్తే.. ఇలా చేయండి..

Common Cold Prevention : చలికాలంలో జలుబు వస్తే.. ఇలా చేయండి..

23 November 2022, 20:13 IST

google News
    • Common Cold Prevention : శీతాకాలంలో చలి ఎంత కామనో.. జలుబు కూడా అంతేకామన్​. బయట అలా తిరిగితే చాలు జలుబు వచ్చేస్తుంది. ఇంట్లో ఉన్నా చలి ఎక్కువైనా.. జలుబు ఎటాక్ చేస్తుంది. అయితే శీతాకాలంలో ఈ జలుబు లక్షణాలనుంచి బయటపడటానికి ఈ చిట్కాలను ప్రయత్నించండి.
చలికాలంలో జలుబు వస్తే
చలికాలంలో జలుబు వస్తే

చలికాలంలో జలుబు వస్తే

Common Cold Prevention : మనలో చాలామంది చలికాలం ప్రారంభం కాగానే జలుబుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏ కాలంలోనైనా వాతావరణం కాస్త ఛేంజ్ అయితే చాలు ముందుగా వచ్చేది జలుబే. అయితే చలికాలంలో దీని ఎఫెక్ట్ బాగా ఎక్కువ. సాధారణ జలుబునకు నిర్దిష్ట నివారణ లేదు. అయినప్పటికీ.. దాని లక్షణాలు తగ్గించడానికి కొన్ని నివారణలు ఉన్నాయి. ఇవి జలుబును తగ్గించి.. మీకు ఉపశమనం అందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇంతకీ ఆ ఉపశమన చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హైడ్రేటెడ్​గా ఉండండి

నీరు, రసం, పులుసు లేదా తేనెతో కలిపిన వెచ్చని నిమ్మకాయ నీరు మీ శరీరాన్ని హైడ్రేట్​గా ఉంచుతుంది. చలికాలంలో అయినా హైడ్రేటెడ్​గా ఉండడం చాలా ముఖ్యం. దీనివల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మిమ్మల్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, కాఫీ, కెఫిన్ కలిగిన సోడాలను నివారించడం కూడా అంతే ముఖ్యం.

విశ్రాంతి తప్పనిసరి

ఉప్పునీటితో పుక్కిలిస్తే.. గొంతు నొప్పి తగ్గుతుంది. ఇది మీకు గొంతు నొప్పి నుంచి ఉపశమనం అందిచడంలో సహాయపడుతుంది. మీరు ఐస్ చిప్స్, గొంతు నొప్పి స్ప్రేలు మొదలైనవాటిని ఉపయోగించవచ్చు.

ఓవర్-ది-కౌంటర్ సెలైన్ నాసల్ డ్రాప్స్, స్ప్రేలను తీసుకోవచ్చు. ఇవి ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం ఇస్తాయి. సమస్య తీవ్రంగా ఉంటే వైద్యుడిని సంప్రదించండి. మీ వయసు, శరీర రకాన్ని బట్టి మీ లక్షణాలకు సరైన మందులు తీసుకోండి.

వెచ్చనివి తాగండి..

జలుబును ఎదుర్కోవడానికి వెచ్చని ద్రవాలు తీసుకోవడం చాలా మంచి టెక్నిక్. ఇది ఉపశమనం ఇస్తూ.. శ్లేష్మ ప్రవాహాన్ని పెంచుతుంది. చికెన్ సూప్, టీ లేదా వెచ్చని నీటిలో కలిపిన ఆపిల్ సైడర్ వెనిగర్ తాగండి. వెచ్చని టీతో తేనెను ప్రయత్నించవచ్చు. ఎందుకంటే ఇది దగ్గును తగ్గిస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం