తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cold Wave Alert : అమ్మ బాబోయ్.. చలి చంపేస్తోంది.. మరో మూడు రోజులు అంతే

Cold Wave Alert : అమ్మ బాబోయ్.. చలి చంపేస్తోంది.. మరో మూడు రోజులు అంతే

HT Telugu Desk HT Telugu

21 November 2022, 15:19 IST

google News
    • Winter Season : మూడు నాలుగు రోజుల నుంచి తెలంగాణలో చలి విపరీతంగా పెరిగిపోయింది. రాత్రైతే చాలు.. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సిర్పూర్ లో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంటే.. చలి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణలో చలి
తెలంగాణలో చలి

తెలంగాణలో చలి

తెలంగాణ(Telangana) వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ప్రజలు చలికి వణికిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఊహించని విధంగా ఉష్ణోగ్రతలు(Temperatures) తగ్గుతూనే ఉన్నాయి. ప్రజలు బయటకు రావాలంటే భయపడిపోతున్నాయి. 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అనేక జిల్లాలు ఉన్నాయి. గత 24 గంటల్లో కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (యు)లో అత్యల్ప ఉష్ణోగ్రత 7.3 డిగ్రీల సెల్సియస్ నమోదు అయింది. సోమవారం ఉదయం 8.30 గంటల సమయానికి అదే ప్రదేశంలో 9.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణ(Telangana) స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం, ఉమ్మడి ఆదిలాబాద్‌(Adilabad)లో ఇప్పటివరకు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేరడిగొండలో 9.4 డిగ్రీల సెల్సియస్, బేలలో ఉదయం 8.30 గంటలకు 9.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తలమడుగు మండలం భరత్‌పూర్‌లో 10 డిగ్రీలు నమోదైంది. జైనద్‌లో 10.4 డిగ్రీలు నమోదయ్యాయి.బేలాలోని న్యాల్‌కల్, కుంటాల, చప్రాలలో 11 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు(Temperatures) నమోదయ్యాయి.

మరోవైపు GHMC పరిధిలోనూ తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. నగరవాసులు బయటకు రావాలంటే వణికిపోతున్నారు. సంగారెడ్డి(Sangareddy)లోని పటాన్‌చెరులో గత 24 గంటల్లో అత్యల్ప ఉష్ణోగ్రత 11.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. సోమవారం ఉదయం నాటికి 15.7 డిగ్రీల సెల్సియస్‌కి చేరుకుంది. మౌలాలి(Moulali)లో కూడా 15.7 డిగ్రీల సెల్సియస్‌, వెస్ట్‌ మారేడ్‌పల్లి(west marredpally)లో 17 డిగ్రీల సెల్సియస్‌ నమోదయ్యాయి. కుత్బుల్లాపూర్‌లోని షాపూర్‌నగర్‌లో 17.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రానున్న మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 13 నుంచి 16 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. జీహెచ్‌ఎంసీ(GHMC) పరిధిలో 14 నుంచి 16 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని టీఎస్‌డీపీఎస్ వాతావరణ సూచన తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు GHMC ప్రాంతాల్లో 29 నుండి 31 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 30 డిగ్రీల సెల్సియస్ నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం