తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Theft: ప్రయాణాల్లో దొంగతనం బారిన పడొద్దంటే ఈ సీక్రెట్ టీప్స్ తెల్సుకోండి.. లండన్ వీధిలో జరిగిన వీడియో చూడండి..

Theft: ప్రయాణాల్లో దొంగతనం బారిన పడొద్దంటే ఈ సీక్రెట్ టీప్స్ తెల్సుకోండి.. లండన్ వీధిలో జరిగిన వీడియో చూడండి..

04 July 2024, 12:30 IST

google News
  • Pickpocket: లండన్ లో ఇద్దరు టూరిస్టులు దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకుని పోలీసులు వచ్చేదాకా ఆపారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. మనం కూడా ప్రయాణాల్లో దొంగల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి.

లండన్ లో పట్టుబడిన దొంగ
లండన్ లో పట్టుబడిన దొంగ (Instagram)

లండన్ లో పట్టుబడిన దొంగ

లండన్ వీధుల్లో దొంగతనం చేసిన మహిళను పట్టుకున్నందుకు ఇద్దరు టూరిస్టుల వీడియో ఈ మధ్య వైరల్ అవుతోంది. ఇందులో ఒకతను దొంగతనం చేసిన మహిళ చేతులను వెనక్కు మడిచి పట్టుకుని కనిపిస్తున్నారు. దొంగతనం చేసిన మహిళ వాళ్లతో రాజీ పడటానికి ప్రయత్నిస్తోంది. కానీ ఆమెను నోరు మూస్కోమని మరొక టూరిస్ట్ చెబుతున్నారు. విదేశీ ప్రయాణాల్లో, దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్లినప్పుడు దొంగల భయం మనకూ ఉంటుంది. దాన్నుంచి ఎలా బయటపడాలో చూడండి.

దొంగతనాల బారిన పడకుండా ఈ టిప్స్ పాటించండి:

థెఫ్ట్ ప్రూఫ్ ప్యాంట్స్:

ప్యాంట్ జేబుల్లో పెట్టిన పర్సులు, ఫోన్లు తీసుకోవడం కాస్త సులభంగా ఉంటుంది. అందుకే జేబులకు జిప్స్ ఉన్నవి ఎంచుకోవాలి. వీటివల్ల కాస్త భద్రత ఉంటుంది. ముఖ్యంగా దూర ప్రయాణాలకు వెళ్తున్నప్పుడు థెఫ్ట్ ప్రూఫ్ ప్యాంట్లు, షార్ట్స్ వేసుకోవడం ఉత్తమం.

వెయిస్ట్ బ్యాగ్:

భుజాలకు పర్సు స్ట్రాప్స్ వేసుకుని పర్సు ముందు వైపుకు వచ్చేలా వెయిస్ట్ బ్యాగ్ లేదా బెల్ట్ బ్యాగ్ వేసుకోవాలి. దీన్నే ఫ్యానీ ప్యాక్ అనీ అంటారు. దీంట్లో విలువైన వస్తువులు పెట్టుకోవాలి. ముఖ్యంగా జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఇవి వాడటం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. మన కళ్ల ముందే బ్యాగ్ ఉంటుంది కాబట్టి దాని మీద దృష్టి పెట్టగలం.

సీక్రెట్ మనీ బెల్ట్:

వ్యాలెట్ లేదా బ్యాగులో డబ్బంతా ఒకే చోట పెట్టేయకూడదు. సీక్రెట్ మనీ బెల్ట్ దానికి మంచి మార్గం. ఈ బెల్ట్ మామూలుగా ప్యాంటుకు పెట్టేసుకోవచ్చు. కానీ లోపలివైపు డబ్బు పెట్టుకోడానికి సదుపాయం ఉంటుంది. మీద టీషర్టు లేదా షర్టు కప్పేసి ఉంటుంది కాబట్టి డబ్బు సేఫ్. ఈ బెల్ట్ కొందరు మెడకు కూడా పెట్టుకుంటారు. దానికన్నా నడుముకు పెట్టుకోవడం వల్ల ఎక్కువ భద్రత ఉంటుంది.

చివర్లలో నిలబడకండి:

బస్సుల్లో, ట్రైన్లలో, వీధుల్లో, రోడ్డు దాటేటప్పుడు వరుసలో మనం చివరగా నిలబడినప్పుడు దొంగతనం అయ్యే అవకాశాలు ఎక్కువవుతాయి. అలాగే చేతిలో ఫోన్ పట్టుకుని వెహికిల్ డూర్ దగ్గర నిలబడే అలవాటుంటే మానుకోవాలి. ఫోన్ పట్టుకుని దొంగ సులభంగా పారిపోగలడు.

ఒకేచోట వద్దు:

డబ్బులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఇంటి తాళాలు, విలువైన వస్తువులన్నీ ఒకేచోట ఉంటే బాగుంటుందని అన్నీ ఒక పర్సులో సర్దేస్తాం. కానీ దానివల్ల నష్టం విపరీతంగా ఉంటుంది. ఒక్క పర్సు దొంగతనం అయినా అన్నీ కోల్పోతాం. అందుకే విలువైన వస్తువులేవీ ఒకే దగ్గర పెట్టకండి. వేరు వేరు బ్యాగుల్లో, వేరు వేరు చోట్ల, వేరు మనుషుల దగ్గర ఉండేలా చూడండి.

తదుపరి వ్యాసం