Yuzvendra Chahal: షార్ట్స్ ధరించి క్రికెట్ ఆడవచ్చా? చాహల్ ఏం చెప్పాడంటే?-yuzvendra chahal says can not be played cricket wearing shorts ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Yuzvendra Chahal: షార్ట్స్ ధరించి క్రికెట్ ఆడవచ్చా? చాహల్ ఏం చెప్పాడంటే?

Yuzvendra Chahal: షార్ట్స్ ధరించి క్రికెట్ ఆడవచ్చా? చాహల్ ఏం చెప్పాడంటే?

Maragani Govardhan HT Telugu
Jul 23, 2022 02:10 PM IST

షార్ట్స్ ధరించి క్రికెట్ ఆడవచ్చా? అనే ప్రశ్నకు టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ అస్సలు అంగీకరించలేదు. అలా సాధ్యపడదంటూ తేల్చి చెప్పాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో చాహల్ రెండు వికెట్లు తీశాడు.

<p>ధావన్ తో చాహల్&nbsp;</p>
ధావన్ తో చాహల్ (AFP)

షార్టులు ధరించి క్రికెట్ ఆడవచ్చా? ఈ ప్రశ్న ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ మాత్రం ఇందుకు ససేమీరా ఒప్పుకోను అని అని అంటున్నాడు. ఎండలు తీవ్రమవుతున్న సమయంలో క్రికెటర్లు ప్యాంట్లు కాకుండా.. షార్టులు ధరించి క్రికెట్ ఆడితే ఎలా ఉంటుందనే ప్రశ్నను ఓ విలేకరు అడుగ్గా.. ఇందుకు ఆలోచించకుండానే సమాధానం చెప్పేశాడు చాహల్. అస్సలు కుదరదంటూ నో చెప్పాడు.

గత వందేళ్లలో నమోదు కానీ రికార్డు ఉష్ణోగ్రతలు ఈ ఏడాది మార్చిలో నమోదయ్యాయి. భారత్‌లో అత్యంత వేడి వాతావరణాన్ని అనుభవించింది. ఎండలు ఎంత తీవ్రమున్నా ఎప్పటిలానే క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. దీంతో వేడిని తట్టుకోవడం కాసు... ప్యాంట్లపై కాకుండా షార్టుల్లో క్రికెట్ ఆడవచ్చా? అనే ప్రశ్న అడుగ్గా. చాహల్ అస్సలు ఒప్పుకోలేదు. యథాతథ స్థితిని కొనసాగిస్తేనే బాగుంటుందని సమాధానమిచ్చాడు.

"షార్టుల్లో క్రికెట్ ఆడటాన్ని నేను అస్సలు అంగీకరించను. ఎందుకంటే కిందకు జారినప్పుడల్లా మోకాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పటికే నా రెండు మోకాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. అందుకే నేను నిండుగా ఉన్న ఫ్యాంట్లలోనే క్రికెట్ ఆడాలనుకుంటున్నా." అవి బాగా పనిచేస్తాయి అని చాహల్ తన అభిప్రాయాన్ని తెలిపాడు.

శుక్రవారం వెస్టిండీస్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. ఐపీఎల్‌లో క్లిష్ట పరిస్థితుల్లో బౌలింగ్ చేయడం తనకు ఎంతో కలిసొచ్చిందని అన్నారు. కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు టీమ్ మేనేజ్మెంట్ నుంచి తనకు మద్దతు లభించిందని స్పష్టం చేశాడు.

"కోచ్ ఎల్లప్పుడూ నాకు మద్దతు ఇస్తూనే ఉంటాడు. చాహల్ నీ బలాలను తిరిగి తీసుకురా, మేము నిన్ను విశ్వసిస్తున్నాం అంటూ ప్రోత్సహిస్తారు. కోచ్‌తో పాటు జట్టు మేనేజ్మెంట్ అంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చినప్పుడు మీరు వెళ్లి మంచి ప్రదర్శన చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు" అని చాహల్ స్పష్టం చేశాడు.

309 పరుగుల లక్ష్య ఛేదనలో 45 ఓవర్ వరకు బ్రెండన్ కింగ్ క్రీజులోనే ఉండటంతో కరేబియన్లు పటిష్ఠ స్థితిలో ఉన్నారు. అర్థ శతకం చేసి ఆత్మవిశ్వాసంతో ఉన్న అతడిని చాహల్ ఔట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. అక్కడ నుంచి పొదుపుగా బౌలింగ్ చేసి టీమిండియా విజయం సాధించింది.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. 309 పరుగుల లక్ష్యంతో భరిలోకి దిగిన కరేబియన్ బ్యాటర్లు 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులకు పరిమితమయ్యారు. చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరం కాగా.. 11 పరుగులే చేసింది. భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ పొదుపుగా బౌలింగ్ విండీస్ నుంచి విజయాన్ని దూరం చేశాడు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్