తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Brinjal Chutney : 4 వంకాయలు ఉడకబెట్టి ఇలా చట్నీ చేస్తే.. ఎంతో ఇష్టంగా తింటారు

Brinjal Chutney : 4 వంకాయలు ఉడకబెట్టి ఇలా చట్నీ చేస్తే.. ఎంతో ఇష్టంగా తింటారు

Anand Sai HT Telugu

13 May 2024, 11:30 IST

google News
    • Brinjal Chutney Recipe : వంకాయతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కర్రీ రూపంలోనే కాకుండా దీనితో చట్నీ చేసి కూడా తినవచ్చు.
వంకాయ చట్నీ రెసిపీ
వంకాయ చట్నీ రెసిపీ

వంకాయ చట్నీ రెసిపీ

కొంతమంది వంకాయ కూరను తినేందుకు వంకలు పెడతారు. నాకు నచ్చదు అని చెబుతారు. కానీ అలాంటివారు కూడా వంకాయ తినేందుకు ఓ పద్ధతి ఉంది. వంకాయతో చట్నీ చేయండి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఉదయం ఇడ్లీ, దోసెలోకే కాకుండా అన్నంలో కూడా కలుపుకొని తినవచ్చు. కాస్త డిఫరెంట్ టేస్ట్ ఉన్న చట్నీని అందరూ ఇష్టపడతారు.

మీ ఇంట్లో వంకాయ ఉందా? అయితే ఎవరైనా దీన్ని ఇష్టపడి తినలేదా? అయితే వంకాయతో చట్నీ చేయండి. ఈ చట్నీని చేస్తే వంకాయ ఇష్టం లేని వారు కూడా ఇష్టపడతారు. వంకాయ చట్నీ ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? వంకాయ పచ్చడి కోసం ఒక సాధారణ పద్దతి ఉంది. ఇది చేసేందుకు సమయం కూడా ఎక్కువగా పట్టదు. ఈజీగా తయారు చేయవచ్చు. రూచి కూడా అద్భుతంగా ఉంటుంది.

వంకాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు

నూనె - 1 1/2 టేబుల్ స్పూన్, కారం - 2 టేబుల్ స్పూన్, మిన పప్పు - 2 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ - 3 (తరిగినవి), వంకాయ - 4 (సన్నగా తరిగినవి), చింతపండు - కొద్దిగా, టొమాటో - 1 (సన్నగా తరిగినవి), కొబ్బరి - 3 టేబుల్ స్పూన్ (తురిమిన), ఆవాలు - 1 టేబుల్ స్పూన్, కరివేపాకు - 1 కట్ట, మిరపకాయలు - 2

వంకాయ చట్నీ తయారీ విధానం

ముందుగా ఓవెన్ లో బాణలి పెట్టి అందులో 1 టీస్పూన్ నూనె పోసి మిరపకాయ వేసి రంగు మారే వరకు వేయించి విడిగా తీసుకోవాలి.

తర్వాత మిన పప్పు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి విడిగా పెట్టాలి. ఇప్పుడు బాణలిలో మరో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, అది వేడిగా ఉన్నప్పుడు ఉల్లిపాయలు వేసి వేయించాలి.

ఇప్పుడు దానికి వంకాయ వేసి మీడియం మంట మీద ఉంచి వంకాయను మెత్తగా ఉడికించాలి.

వంకాయ ఉడికిన తర్వాత టమాటా, చింతపండు రసం వేసి మెత్తగా వేయించి, కొబ్బరి తురుము వేసి ఒకసారి తిప్పి చల్లారనివ్వాలి.

ఇప్పుడు మిక్సీ జార్‌లో వేయించి పెట్టుకున్న ఉల్లి, పప్పు వేసి బాగా గ్రైండ్ చేయాలి.

తర్వాత అందులో వేగిన ఉల్లిపాయ, వంకాయల మిశ్రమం వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

తర్వాత అవసరమైనంత నీరు పోసి కలపాలి. ఎక్కువ నీరు కలపవద్దు.

చివరగా ఓవెన్ లో బాణలి పెట్టి, మసాలాకు కావల్సినంత నూనె వేసి, అది వేడయ్యాక ఆవాలు, ఉల్లి, కరివేపాకు, బిర్యానీ ఆకులు వేసి చట్నీలో కలుపుకొంటే రుచికరమైన వంకాయ చట్నీ రెడీ.

తదుపరి వ్యాసం