Cigarette Addiction: సిగరెట్ వ్యసనాన్ని మానాలంటే వంటింట్లో ఉండే ఈ మసాలా దినుసును ఉపయోగించండి చాలు
28 November 2024, 14:00 IST
- Cigarette Addiction: మీరు సిగరెట్ వ్యసనాన్ని మానలేకపోతున్నారా? ఆ చెడు వ్యసనం మానేయాలనుకుంటే, మీ వంటగదిలో ఉంచిన నల్ల మిరియాలను ఉపయోగించండి. దీని సాయంతో మీరు ధూమపానం అలవాటును మానవచ్చు.
సిగరెట్ మానేసే చిట్కాలు ఇవే
ధూమపానం అలవాటు మన శరీరానికి చాలా ప్రమాదకరం. సిగరెట్ తాగడం వల్ల ఎన్నో ప్రాణాంతక రోగాలు వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ వంటి హానికర వ్యాధి రావడానికి సిగరెట్ కూడా కారణమే. ధూమపానం అనేది ఎంత వ్యసనంగా మారిందంటే రోజుకు ఒక సిగరెట్ పెట్టే మొత్తం కాల్చేస్తున్నారు. దీని వల్ల వారి ఆరోగ్యంతో పాటూ ఆ పొగ పీల్చిన వారికి కూడా ఎన్నో సమస్యలు వస్తాయి.
ఒక్కసారి స్మోకింగ్ అలవాటు అయిందంటే దాన్ని వదలడం చాలా కష్టం. దాన్ని వదిలించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ, ఎలాంటి ఫలితం ఉండదు. కొంతమంది మానసిక వైద్యుల సాయాన్ని తీసుకుంటారు. కొన్ని చికిత్సల ద్వారా ధూమపానాన్ని మానేయడానికి ప్రయత్నిస్తారు. నిజానికి సిగరెట్ మానడానికి మీ వంటగదిలో ఉంచిన మసాలా కూడా మీకు సహాయపడుతుంది. మిరియాల్లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే నల్ల మిరియాలు నికోటిన్ తినాలన్న కోరికలను తగ్గించడంలో మీకు సహాయపడతాయి. ఇది ధూమపాన వ్యసనం నుండి బయటపడటానికి మీకు సహాయపడుతుంది. దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
స్మోకింగ్ మానడం ఎలా?
ధూమపాన వ్యసనం తగ్గించడానికి మీరు నల్ల మిరియాలు ఎంతో ఉపయోగపడతాయి. మార్కట్లో నల్ల మిరియాలు నూనె లభిస్తుంది. ఈ నూనె మంచి డిటాక్సిఫికేషన్ ఏజెంట్. ఇది శరీరం నుండి విషాన్ని తొలగించడమే కాకుండా, నికోటిన్ కోరికలను తగ్గించడంలో కూడా చాలా సహాయపడుతుంది. దీని కోసం మీరు డిఫ్యూజర్ ఉపయోగించవచ్చు. మీ ఇల్లు, కార్యాలయంలో డిఫ్యూజర్ ఉంచండి. ఇందులో కొన్ని చుక్కల నల్ల మిరియాలు ఎసెన్షియల్ ఆయిల్ కలపండి. ఈ నూనె సువాసనను వాసన చూడటం వల్ల సిగరెట్లపై కోరిక తగ్గుతుంది. మీరు కొన్ని చుక్కల నల్ల మిరియాలు ఎసెన్షియల్ ఆయిల్ ను నేరుగా మీ ముక్కులో వేయవచ్చు.
నల్ల మిరియాలు ఎసెన్షియల్ ఆయిల్ వాసనను రోజులో ఎక్కువసార్లు పీల్చడం వల్ల సిగరెట్లు తాగడం ఆపుతారు. మీరు ఇతర పద్ధతులను కూడా ఉపయోగించవచ్చు. ఈ పద్ధతులు కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఇందుకోసం ముందుగా కాటన్ క్లాత్ తీసుకోండి. ఇప్పుడు ఈ గుడ్డను పాన్ మీద పెట్టి కొద్దిగా వేడి చేయాలి. గుడ్డ కాస్త గోరువెచ్చగా అయ్యాక… ఆ క్లాత్ పై కొన్ని చుక్కల నల్ల మిరియాల నూనె కలపాలి. ఇప్పుడు దానితో మీ ఛాతీని రుద్దండి. ఇలా చేయడం వల్ల మీకు చాలా ఉపశమనం కూడా లభిస్తుంది. సిగరెట్ తాగాలన్న కోరిక కూడా తగ్గిపోతుంది.
ఇది కాకుండా, మీరు మీ ఆహారంలో నల్ల మిరియాలను వివిధ మార్గాల్లో చేర్చవచ్చు. మీరు సలాడ్లు, రసాలు, స్మూతీలు, లెమన్ టీ మొదలైన వాటికి నల్ల మిరియాలు జోడించవచ్చు. ఇది సిగరెట్ వ్యసనం తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇది కాకుండా, మీరు నల్ల మిరియాలు ఎసెన్షియల్ ఆయిల్‌ను వేడి నీటిలో ఆవిరి చేయవచ్చు. ఈ పద్ధతులన్నీ చాలా ప్రభావవంతంగా ఉంటాయి. అయితే, మొదటిసారి దీనిని ఉపయోగిస్తున్నప్పుడు మీ వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.