తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thursday Quote : మీకు ఎప్పుడైనా పాతరోజులు మళ్లీ వస్తే బాగుంటుంది అనిపించిందా?

Thursday Quote : మీకు ఎప్పుడైనా పాతరోజులు మళ్లీ వస్తే బాగుంటుంది అనిపించిందా?

15 December 2022, 6:30 IST

google News
    • Thursday Motivation : మీకు తెలుసా? అప్పట్లో మేము ఏమి చేసేవాళ్లమో.. అసలు ఎంత సరదాగా ఉండేదో. ఆ రోజులు మళ్లీ వస్తే బాగుంటుంది అని మీరు కూడా ఏదొక సందర్భంలో అనుకునే ఉంటారు. ఇలా ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా? ప్రస్తుత పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు ఇలా అనిపిస్తుంది. ఇది చాలా సహజం.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Thursday Motivation : ఎందుకు పాతరోజులే మళ్లీ రావాలి.. ఇప్పుడు సరిగా లేకుంటే ఏమి.. ఫ్యూచర్ బాగుండవచ్చేమో కదా. ఎందుకు ఎక్కువ మంది పాతరోజులే కావాలని కోరుకుంటారనే డౌట్ ఎప్పుడైనా మీకు వచ్చిందా? అయితే దాని సమాధానమే ఇది. ఫ్యూచర్​ని ఎప్పుడూ చూడలేము. అది ఎలా ఉంటుందో తెలియదు. ప్రస్తుతం కన్నా మంచిగా ఉండొచ్చు. లేదా ఇంకా దరిద్రంగా కూడా ఉండొచ్చు. కాబట్టి ఫ్యూచర్​ని మనం అంత స్ట్రాంగ్​గా చెప్పలేము. కానీ ఆల్రేడి మనం చూసి వచ్చిన రకరకాల ఫేజ్​లలో ఏదొకటి మనకి బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇప్పటికే దానిని చూసేశాము కాబట్టి.. అందుకే తడుముకోకుండా పాతరోజులు మళ్లీ వస్తే బాగుంటుందని చెప్పేస్తాము.

చాలామంది తమ చిన్ననాటి జ్ఞాపకాలు, స్కూల్​ డేస్, కాలేజీ డేస్​ తలచుకుని బాధపడుతూ ఉంటారు. అప్పుడున్నంత సంతోషం ఇప్పుడు లేదని.. ఆరోజులు మళ్లీ వస్తే.. మరింత ఎంజాయ్ చేసి.. ఆ ఫేజ్​ని పూర్తిగా ఆస్వాదించాలని కోరుకుంటారు. అయితే ఎందుకు బాల్యానికే వెళ్తారు అంటే.. దానికి కూడా ఓ రీజన్ ఉంది. ఎందుకంటే.. చిన్న వయసులో మానసికంగా మనల్ని ఇబ్బంది పెట్టే సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి. పైగా మనల్ని ఒకరు పోషిస్తారు. సంపాదించే అవసరం ఉండకపోవచ్చు. మనపై ఎలాంటి బాధ్యతలు ఉండవు. చాలా ఫ్రీగా ఉంటాము. ఏదైనా అడిగితే తెచ్చి పెట్టే కుటుంబసభ్యులు ఉండవచ్చు. ఈరోజు కాకుంటే రేపైనా మనం అడిగింది ఇచ్చేస్తారు.

కానీ ఓ వయసు వచ్చాక.. బాధ్యతలు మీద పడ్డాక మనకు ఇంకో ఆప్షన్ ఉండదు. మనకోసం మనమే కష్టపడాలి. మనమే సంపాదించుకోవాలి. బాస్ చేత తిట్లు తినిపించుకోవాలి. మనకి ఏది కావాలనుకున్నా మనమే దానికోసం కష్టపడాలి. ఇది సరిపోదు అన్నట్లు కుటుంబసభ్యులను పోషించే బాధ్యత కూడా మీపైనే ఉండొచ్చు. కనీసం సెలవు తీసుకుని చిల్ అవుదాము అనుకున్నా.. ఇతర పనులు మిమ్మల్ని బిజీగా చేసేస్తాయి. ఇది చివరికి ఎలా మారుతుంది అంటే.. మీకు ఇష్టమైన పనులకు కూడా మీరు క్రమంగా దూరమైపోతుంటారు. ఫ్రాంక్​గా చెప్పాలంటే యాంత్రికంగా తయారవుతారు. ఇలాంటి రసవత్తరమైన, అస్సలు ప్రశాంతత లేని లైఫ్​ని గడుపుతున్నప్పుడు.. కచ్చితంగా బాల్యంలోకి వెళ్లిపోతూ ఉంటాం.

మా చిన్నప్పుడు అలా చేసేవాళ్లం. అలా తిరిగేవాళ్లం. అలాంటివి తినేవాళ్లం.. మళ్లీ ఓ సారి ఆ రోజులు వస్తే ఎంత బాగుంటుందో అనుకుంటాము. అయితే అందరికీ బాల్యం ఒకేలా ఉండదు. కొందరికి చేదు అనుభవాలు ఉంటాయి. మరికొందరికి మార్చుకోగలిగే పరిస్థితులు కూడా ఏర్పడుతాయి. నేను మళ్లీ ఆరోజుల్లోకి వెళ్తే.. అలా జరగకుండా జాగ్రత్తపడతాను అనికూడా చాలామంది అనుకుంటారు. కానీ జీవితంలో అది పెద్ద దుస్థితి ఏమిటో తెలుసా? జ్ఞాపకాలు మాత్రమే మనతో ఉంటాయి. తిరిగి ఆ క్షణాల్లోకి మాత్రం వెళ్లలేము. ఎలాగో వెనక్కి వెళ్లలేము కాబట్టి.. ఆ సంతోషాలతో, జ్ఞాపకాలతో.. ఫ్యూచర్​లోకి వెళ్లాలి. అదొక్కటే మనముందున్న ఏకైక ఛాయిస్.

తదుపరి వ్యాసం