తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wednesday Quote : ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాళ్లే తెలివైనవాళ్లు..

Wednesday Quote : ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాళ్లే తెలివైనవాళ్లు..

14 December 2022, 6:30 IST

google News
    • Wednesday Motivation : చాలామందికి తెలివితేటలు ఉండొచ్చు. అంతమాత్రనా వాళ్లు తెలివైన వాళ్లు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. జ్ఞానం ఉంటే సరిపోదు. దానిని ఎప్పుడూ ఎలా వాడాలో తెలిసినవాళ్లే గొప్ప. జ్ఞానాన్ని అజ్ఞానంతో దుర్వినియోగం చేసుకునేవారు ఈ లోకంలో చాలామందే ఉన్నారు.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Wednesday Motivation : తెలివితేటలు, జ్ఞానం లేకపోయినా పర్లేదు కానీ.. తెలివి ఉండి కూడా తింగరిగా పని చేసే వాళ్లు.. అజ్ఞానంతో ముందుకు వెళ్లేవారు.. బాగుపడినట్లు చరిత్రలో లేదు. తెలివి ఉంటే సరిపోదు మిత్రమా.. తెలివిగా వ్యవహరించడం కూడా తెలిసి ఉండాలి. మనల్ని ఎవడ్రా ఆపేది అని ముందుకు వెళ్లిపోవడం కాదు.. ముందుకు వెళ్తే వచ్చే పరిణామాలను ఓ అంచనా వేసి.. ఎలా ముందుకు వెళ్లాలో తెలుసుకోవడమే విజ్ఞానం. ఆ విజ్ఞానమే లేక చాలామంది తామే గొప్పవాళ్లమని ఫీల్ అయిపోతూ ఉంటారు.

తెలివైన వ్యక్తికి దగ్గర ప్రతి దానికి ఆన్సర్ ఉండవచ్చు. కానీ ఏ ప్రశ్నకి ఎప్పుడు బదులు ఇవ్వాలో తెలిసినవాడే వివేకవంతుడు అనిపించుకుంటాడు. మన తెలివితో ఆర్గ్యూ చేసి.. ఆ పరిస్థితిని గెలిచేయొచ్చు. కానీ.. ఎక్కడ తగ్గితే అందరికీ మంచిదోనని ఆలోచించేవారే కరువైపోయారు. కొందరికి తెలివి అతి మీరిపోతూ ఉంటుంది. దానివల్ల వారు దేనికి ఆన్సర్​బుల్​గా ఉన్నారో కూడా మరచిపోతూ ఉంటారు. ప్రతీది తమకే తెలుసు అనే ఓవర్ కాన్ఫిడెన్స్​ వారిలో నిండిపోతూ ఉంటుంది. దానివల్ల వాళ్లు చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నామనుకుని తప్పటడుగులు వేస్తూ ఉంటారు. వివేకవంతులు ఎప్పుడూ పరిస్థితిని అంచనా వేసి.. తదనుగుణంగా వ్యవహరిస్తారు. ఇది గతంలో మనం చేసిన తప్పులను సరిదిద్దుకోవడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

ఏ తప్పు చేయని వ్యక్తి కొత్తగా జీవితంలో నేర్చుకునేదేమి లేదు. తప్పులు చేసిన వాడే.. కొత్తగా ఏదైనా నేర్చుకోగలుగుతాడు. తప్పుల నుంచి.. అనుభవాలనుంచి ఏమి నేర్చుకోని వ్యక్తి గుడ్డెద్దు చేనులో పడినట్లుగానే వ్యవహరిస్తాడు. కానీ తెలివితేటలను ఉపయోగించుకుంటూ.. పరిస్థితులను అంచనా వేస్తూ.. ఎప్పటికప్పుడూ తనని తాను సరిదిద్దుకుంటూ.. కొత్త విషయాలను నేర్చుకుంటూ.. పాత విషయాలను గుర్తుపెట్టుకుంటూ.. ఓ ప్రణాళికతో ముందుకు వెళ్లేవాడు.. ఇప్పుడు కాకున్నా.. ఎప్పటికైనా సక్సెస్ అవుతాడు.

బట్టి పట్టేసి చదివేస్తే.. పరిక్షల్లో మార్కులు రావొచ్చు. కానీ.. అర్థం చేసుకుని చదివితే.. అది ఎప్పటికీ నీతోనే ఉంటుంది. అలాగే ఏ పరిస్థితినైనా మనం అర్థం చేసుకునే తీరులోనే మన విజ్ఞానం దాగి ఉంటుంది. ఇది మీరు వ్యక్తిగతంగా, సామాజికంగా ఎదగడానికి సహాయం చేస్తుంది. మన సొంత నిర్ణయాలను ఆత్మపరిశీలన చేసుకోవడానికి.. వాటి వల్ల జరిగే పరిణామాలను అంచనా వేయడానికి కూడా మీరు సమయం కేటాయించుకోవాలి. స్మార్ట్​నెస్​ అనేది అందరికీ కనిపించాల్సిన అవసరం లేదు. అది మానసికంగా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి పనికి వస్తే చాలు. అనుకోని పరిస్థితి ఎదురైనప్పుడు.. ఏదిపడితే అది చేయడం కాకుండా.. ఏది చేస్తే మంచిదనే ఆలోచనతో ముందుకు సాగడమే వివేకం. పైగా తెలివైన వ్యక్తి ముందు వింటాడు. తర్వాత వాటిని అర్థం చేసుకుని.. అనువుగా మాట్లాడతాడు. అవతలి వాళ్లుచెప్పేది వినకుండా.. మీ ఫీలింగ్స్ చెప్పేసి.. మీకు నచ్చినవి అనేసుకుని మాట్లాడేయడం తెలివైన పని అనిపించుకోదు. కొన్నిసార్లు మాటల కంటే మౌనమే శక్తివంతమైన ఆయుధం గ్రహించడమే నిజమైన తెలివితేటలు అనిపించుకుంటాయి.

తదుపరి వ్యాసం