Friday Motivation : మీరు అలా ఉంటేనే.. జీవితంలో సక్సెస్ అవుతారు..-friday motivation on if you can stay positive in a negative situation you win ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Friday Motivation : మీరు అలా ఉంటేనే.. జీవితంలో సక్సెస్ అవుతారు..

Friday Motivation : మీరు అలా ఉంటేనే.. జీవితంలో సక్సెస్ అవుతారు..

Geddam Vijaya Madhuri HT Telugu
Dec 09, 2022 06:33 AM IST

Friday Motivation : మన జీవితంలో చాలా దారుణమైన పరిస్థితులు రావొచ్చు. అదే లైఫ్ అంటే. కానీ ఆ సమయంలో కూడా సానుకూలంగా ఉండేవారు.. ఎప్పటికైనా విజయం సాధిస్తారు. అది ఏ రకంగానైనా కావొచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సానుకూలంగా ఉండడం అనేది చాలా పెద్ద, మంచి విషయం. అలాంటి వారు చాలా రేర్.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Friday Motivation : మన జీవితంలో మనం ఎక్కువసార్లు పోరాడేది ఎవరితో తెలుసా? మన శత్రువులు అనుకుంటున్నారేమో.. అది చాలా తప్పు. మనం ఎక్కువసార్లు పోరాడేది మనతోనే. మన మనసును, మన అవసరాన్ని అధిగమించడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. ఎదుటివారినైనా సులభంగా జయిస్తామేమో కానీ.. మనల్ని మనం జయించడం చాలా కష్టం. అలా మనం పూర్తిగా మన చేతిలో ఓడిపోయినప్పుడు మాత్రమే సానుకూలంగా ఉండగలుగుతాము.

ఎవరి జీవితం సజావుగా సాగదు. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. వాళ్లకేంటి బాగుంటారు అనుకోవడం చాలా సులభం. కానీ వాళ్ల జీవితంలోకి వెళ్లి చూస్తేనే తప్పా తెలియదు.. వాళ్లకి ఏమి సమస్యలున్నాయో. కాబట్టి మనకి మాత్రమే కష్టాలు ఉన్నాయనుకుని కుంగిపోకండి. మనం చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో మనం ఎంత ధైర్యంగా, సానుకూలంగా ఉంటున్నామన్నదే మ్యాటర్.

ఒక్కోసారి మన పరిస్థితి మరింత దిగజారిపోవచ్చు. అంతా చీకటి తప్పా వెలుగు లేదు అనుకోవచ్చు. కానీ కాస్త ప్రశాంతంగా, సానుకూలంగా ఉంటే.. మీ జీవితంలో వెలుగు కచ్చితంగా వస్తుంది. చీకటి తర్వాత వెలుగు వస్తేనే రోజు అనేది కంప్లీట్ అవుతుంది. మన సృష్టే అలా డిజైన్ చేయబడింది. అలాంటి మన కష్టం తర్వాత మనకి మంచి జరుగుతుందనుకోవాలి. దానిని నమ్మాలి. ఈ చెడు ఎక్కువసేపు మనతో ఉండదు అనుకోవావి. ఇలా మీరు సానుకూలంగా ఉంటే.. కష్టం మీ దరిదాపుల్లో కూడా ఉండదు. ఒకవేళ ఉన్నా.. దానికి ఎక్కువసేపు మీతో ఉండాలని అనిపించదు. మానసికంగా మనం ఎంత స్ట్రాంగ్​గా ఉంటే.. మనం, మన పరిస్థితులు అంత త్వరగా చక్కబడతాయి. ఒక్కోసారి శారీరక బలం కన్నా.. మానసికంగా బలంగా ఉండడమే చాలా ముఖ్యం.

కష్టం వచ్చినప్పుడు మీరు ఏడుస్తూ.. మిమ్మల్ని లేదా ఎదుటివారిని తిట్టుకుంటూ.. తిండి తిప్పలు మానేసి బాధపడుతూ ఉంటే.. మీ కష్టానికి బలం ఎక్కువైపోతుంది. మీరు చేసే ఈ పనులు మీ కష్టానికి బూస్టప్ ఇస్తాయి. అయితే మీరు పీకల్లోతూ కష్టాల్లో ఉన్నా.. సానుకూలంగా ఉంటూ.. జరిగేదానిని ఎవరూ ఆపలేము అనుకుంటూ.. మీ పని మీరు మంచిగా చేసుకుంటూ పోతే.. ఆ కష్టానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు అది వేరే వాళ్లని వెతుక్కోవడంలో బిజీగా ఉంటుంది. కాబట్టి మీ కష్టాలు మిమ్మల్ని కృంగదీస్తున్న సమయంలో మీరు మీ పనుల్లో మునిగిపోండి. ఏ ఇబ్బంది మిమ్మల్ని ఏది చేయదు అనుకోండి. ఒకవేళ ఏమైనా జరిగినా.. మీరు దానిని కచ్చితంగా భర్తీ చేసుకోగలరని భావించండి. మీకు కచ్చితంగా మంచే జరుగుతుంది. అదే మీకు సక్సెస్​ను తెచ్చిపెడుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం