Thursday Motivation : ధైర్యంగా ముందడుగు వేయండి.. విజయం మీ సొంతం అవుతుంది..
ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు పూర్తిగా నిరాశ, నిస్పృహలతో నిండిపోయి ఉంటున్నారు. వీటిని జయించడానికి మనకు సంకల్ప శక్తి, ధైర్యం కావాలి. నిజానికి సమస్యలను ఎదురించగలిగే ధైర్యం లేకపోవడం వల్లనే చాలా మంది విజయానికి ఆమడ దూరంలో మిగిలిపోతున్నారు.
Thursday Thought : ఒక్కోసారి మనలోని భయం ఎలా ఉంటుందంటే.. విజయానికి దగ్గరగా తీసుకెళ్లి.. అడుగు దూరంలో ఆపేస్తుంది. ఎందుకంటే అక్కడ ధైర్యంగా అడుగు వేయాల్సిన సమయంలో భయంతో ఆగిపోతాము. ఆ భయాన్ని జయించిన వ్యక్తి అడుగు ముందుకు వేస్తాడు. విజయం సాధిస్తాడు. భయమనేది కేవలం తాత్కాలికమైనదేనని మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకున్న నాడు.. మీరు విజయానికి దగ్గరగా వెళ్తారు. ఎందుకంటే భయం మనలో అస్పష్టతను పెంచి.. పరిస్థితులను క్లిష్టతరంగా మార్చేస్తుంది. అప్పుడు మీరు విజయానికి దగ్గరగా వెళ్లినా.. విజయం సాధించలేరు.
ట్రెండింగ్ వార్తలు
నేటి పోటీ ప్రపంచంలో గెలుపు పొందాలంటే.. సంకల్ప శక్తి, ధైర్యం, ఓర్పు ఉండాలి. ఇవి మీలోని నిరాశను, ఆందోళనను దూరం చేస్తాయి. క్రమంగా భయం తగ్గి.. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. భయాన్ని మీరు దాటేసినప్పుడు పెద్దగా కష్టపడ్డాము అని కూడా అనిపించదు. కొంచెం దూరంలో విజయం లభిస్తుంది అనుకున్నప్పుడు... మీరు ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి. అప్పుడే మీకు సక్సెస్ వస్తుంది. అతిగా ఆలోచించడం వల్ల పరిస్థితులు మారిపోతాయి. మీరు విజయానికి దూరం అవుతారు. చివరికి ఫలితం దక్కకుండా పోతుంది. ఏ పోటీలోనైనా పాల్గొనేటప్పుడు మీరు వైఫల్యం, భయం వంటి అసమానతలను దూరం చేసుకునేందుకు కృషి చేయాలి.
దేనికైనా భయపడి అవకాశాలను ఎప్పుడూ వదులుకోకూడదు. విజయం అంతిమం కాదని.. అపజయం ప్రాణాంతకం కాదని గుర్తుంచుకోవాలి. అసలైన మజా మనం చేసే ప్రయత్నాలలోనే ఉంటుంది. ఫెయిల్ అవుతామేమో అనే భయాన్ని మీరు జయిస్తే చాలు.. విఫలం కూడా మీకు అద్భుతంగానే ఉంటుంది. జీవితంలో మనం ఏ పని చేసినా ఫలితం గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు, భయపడకూడదు. జస్ట్ మీ ప్రయత్నం కరెక్ట్‌గా చేస్తే చాలు. ఈ ప్రపంచంలోని గొప్ప గురువులు అంతా.. తప్పులు చేసి.. భయాన్ని జయించినవారే.
సంబంధిత కథనం