Wednesday Quote | సంతోషంగా ఉన్నప్పుడు పొంగిపోండి.. కానీ కష్టాల్లో కృంగిపోవద్దు..-life lessons on happiness and struggles and hurdles ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wednesday Quote | సంతోషంగా ఉన్నప్పుడు పొంగిపోండి.. కానీ కష్టాల్లో కృంగిపోవద్దు..

Wednesday Quote | సంతోషంగా ఉన్నప్పుడు పొంగిపోండి.. కానీ కష్టాల్లో కృంగిపోవద్దు..

HT Telugu Desk HT Telugu
Apr 27, 2022 08:59 AM IST

జ్ఞాపకాలు మంచివైనా, చెడ్డవైనా మనతోనే ఉంటాయి. వాటిని మోయక తప్పదు అని ఓ సినీ కవి చెప్పినట్లే.. లైఫ్ మనకి సంతోషాన్ని ఇచ్చినా, బాధ ఇచ్చినా వాటిని మనం మోయాల్సిందే. ఆనందకరమైన విషయాలు జరిగినప్పుడు మంచిగా వాటిని సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే బాధ కలిగే విషయాలు జరిగినప్పుడు ఆ క్షణాన్ని స్వీకరించి.. ఆ పరిస్థితిని ఎలా దాటాలో ఆలోచించాలి.

సంతోషమైనా, బాధకలిగినా స్వీకరించండి..
సంతోషమైనా, బాధకలిగినా స్వీకరించండి..

Wednesday Motivation | మన జీవితం ఎప్పటికీ గులాబీలు పరిచిన మంచం కాదనే వాస్తవాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే.. ఎప్పుడూ పూలే కాదు.. ముళ్లు కూడా ఎదురవుతాయి. అందుకే సంతోషం వచ్చినా, బాధ కలిగినా.. మన జీవితాన్ని ఆస్వాదించాలి. పూర్తిగా జీవించడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఉన్నది ఒకటే లైఫ్ కాబట్టి. జీవితానికి రంగులు అద్దే ఏ అనుభమవమైనా మంచిదే కదా. ఆనందంగా ఉన్నారా నలుగురితో కలిపి సెలబ్రేట్ చేసుకోండి. బాధగా ఉన్నారా, కష్టాలు వెంటాడుతున్నాయా? ఆ సమయంలో జీవితం నేర్పే పాఠాలు నేర్చుకుని ముందుకు సాగండి.

మనం అనుభవించే ప్రతిది మంచి లేదా చెడు జ్ఞాపకాన్ని ఇస్తాయి. చెడు జ్ఞాపకం దుఃఖం ఇస్తుంది కాబట్టి.. మంచి వాటికే ప్రాముఖ్యత ఇస్తాము. కానీ బాధలు ఉన్నప్పుడే కదా.. నిజమైన సంతోషానికి విలువ తెలిసేది. రోజులో డే అండ్ లైట్ ఎలాగో.. జీవితంలో సంతోషం, బాధ కూడా అలాంటివే. చీకటిగా ఉందని బాధపడతామా? వెలుగు కోసం వెతుక్కుంటాం.. లేదా ఉదయం అవుతుందనే ఆశతో ఉంటాం. అలాగే బాధలో ఉన్నప్పుడు కృంగిపోకుండా దానిని పోగొట్టుకునే వెలుగును వెతుక్కోవాలి. అవి ఇచ్చే అనుభవాలు ఎప్పటికీ మనకు పాఠాలే. కొన్ని సంఘటనలు అందమైన పాఠాలు నేర్పితే.. మరికొన్ని మన జీవితాల సారాంశం, ఉనికిని అర్థం చేసుకునేలా చేస్తాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్