తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thursday Motivation : మీకు నచ్చలేదా మార్చడానికి ట్రై చేయండి.. మారలేదా మీ ఆలోచనను మార్చుకోండి..

Thursday Motivation : మీకు నచ్చలేదా మార్చడానికి ట్రై చేయండి.. మారలేదా మీ ఆలోచనను మార్చుకోండి..

20 October 2022, 9:59 IST

google News
    • Thursday Motivation : మీకు ఏదైనా నచ్చలేదనుకో.. మార్చడానికి ప్రయత్నించండి. అది అప్పటికీ మారకపోయినా.. మీరు మార్చలేకపోయినా.. మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోండి. ఎందుకంటే.. మీ దృష్టిలో మీరు అనుకున్నది మీకు ఎంత కరెక్టో.. మీరు మీ ఆలోచనను మార్చుకున్నప్పుడు దానిలోని లోతును అర్థం చేసుకోగలిగే అవకాశముంది.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Thursday Motivation : పిల్లల విషయానికే వద్దాము. పిల్లలు తప్పు చేసినా.. ఒప్పు చేసినా.. పేరెంట్స్​కి నచ్చకపోతే.. వెంటనే దానిని మార్చడానికి ప్రయత్నిస్తారు. వారికి నచ్చజెప్పి.. మార్చడానికి ప్రయత్నిస్తారు. లేదా దెబ్బలతో, బెదిరించో మార్చడానికి ప్రయత్నిస్తారు. కానీ.. మీరు ఏమి చేసినా వారు మారట్లేదు అనిపిస్తే మాత్రం.. మీరు విషయాన్ని చూసే కోణాన్ని మార్చుకోండి. వాళ్లు వద్దు అంటున్నా పదే పదే ఎందుకు అదే పనిని చేస్తున్నారో ఆలోచించండి.

మీరు వద్దు అంటున్నా ఎవరైనా.. అదే పనిని పదే పదే చేస్తున్నారంటే.. మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని గ్రహించండి. ఎందుకంటే అందరి ఆలోచనలు ఒకేలా ఉండవు. ఒక్కొక్కరి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. ఇంట్లో కలిసి ఉండే ఓ ఫ్యామిలికే ఇష్టాలు వేరుగా ఉంటాయి. అలాంటింది.. మీ ఇష్టాలే కరెక్ట్ అవ్వాలని రూల్ లేదు కదా. మీరు చెప్తున్న ఓ వ్యక్తి తన ప్రవర్తన మార్చుకోకపోతే.. ఓ క్షణం ఆలోచించుకోండి. మనమే తప్పుగా ఆలోచిస్తున్నామా? లేదా అవతలి వ్యక్తి పరిస్థితులు ఏంటి.. వాళ్లు మారకపోవడానికి ఏదొక బలమైన రీజన్ ఉండే ఉంటుంది కదా అనుకోవాలి తప్పా.. నేను చెప్పినా వినట్లేదు.. ఇలాంటి వాళ్లకి చెప్పి వేస్ట్.. ఎవరికి బాధ్యత లేదు అని అపరిచితుడులో రామంలా బాధపడకండి. ఎందుకంటే మీలోని అపరిచితుడు బయటకు వచ్చేస్తే మీకే ప్రమాదం.

వ్యక్తి వద్దు అంటున్నా అదే పని చేస్తున్నాడంటే.. అతనికి ఆ పని నచ్చినది అయినా అయి ఉండాలి. అవసరం అయినా అయి ఉండాలి. ఈ రెండూ కాకుంటే పరిస్థితుల ప్రభావం అయినా అయి ఉండాలి. తప్పక అదే పనిని చేస్తూ కూడా ఉండవచ్చు. కాబట్టి ఓసారి అవతలి వాళ్ల వైపు నుంచి కూడా ఆలోచించడం ప్రారంభించండి. దీనివల్ల మీకు, వాళ్లకు కూడా మంచే జరుగుతుంది తప్పా.. అది ఎవరికి ఎటువంటి హానీ చేయదు.

ఒకవేళ వాళ్లకు ఆ పని చేయడమే ఇష్టమైతే.. మీరు వారి ఇష్టాన్ని గౌరవించండి. లేదా తప్పక చేస్తుంటే.. వాళ్లు ఆ పరిస్థితిని ఓవర్​ కామ్ చేయడానికి ధైర్యాన్ని ఇవ్వండి. మీ ఆలోచన మార్చుకున్నా సరే.. వాళ్లు కరెక్ట్​గా అనిపించట్లేదా.. అయితే వాళ్ల చావు వాళ్లు చావని అనుకుని వదిలేయండి. అంతేకానీ.. మీ మాట వినట్లేదని.. వాళ్ల మీదు లేని పోని ఆలోచనలు, కోపం, పగ పెంచేసుకుని.. ఫీల్ అయితే.. మీరు బాధపడతారు. లేదంటే అవతలి వాళ్లను బాధపెట్టిన వాళ్లు అవుతారు.

మీ ఇష్టం మీకు కరెక్ట్​గా ఎలా అనిపిస్తుందో.. వాళ్లకి కూడా అంతే. వాళ్లకు ఇష్టమున్నా.. లేకున్నా.. వాళ్ల అవసరమైనా.. అది వాళ్లకు కరెక్ట్​గానే ఉంటుంది. కాబట్టి.. వాళ్ల సైడ్​ నుంచి కూడా ఆలోచించి.. హ్యాపీగా ముందుకు సాగండి. ఎందుకు బీపీలు పెంచేసుకుని హెల్త్ కరాబ్ చేసుకోవడం. హ్యాపీగా.. జాలీగా ఎంజాయ్ చేయ్ రా అంటూ.. వెంకీ మామ సాంగ్ వినేయండి. మీ కోపాన్ని ఓవర్ కామ్ చేసేయండి.

తదుపరి వ్యాసం