Saturday Quote : మీరు ప్రేమించిన వ్యక్తిలో.. బెస్ట్ వెర్షన్​ను బయటకు తీసుకురావడమే నిజమైన ప్రేమ..-saturday motivation on the best way to love someone is not to change them but instead help them revel the greatest version of themselves ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Saturday Motivation On The Best Way To Love Someone Is Not To Change Them, But Instead, Help Them Revel The Greatest Version Of Themselves.

Saturday Quote : మీరు ప్రేమించిన వ్యక్తిలో.. బెస్ట్ వెర్షన్​ను బయటకు తీసుకురావడమే నిజమైన ప్రేమ..

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 06, 2022 07:12 AM IST

Saturday Motivation : ఎవరినైనా ప్రేమించాలి అనుకుంటే.. లేదా ప్రేమిస్తే.. వారిని మనకు నచ్చినట్లు మార్చుకోవడం ఉత్తమ మార్గం కాదు. వారిలోని మంచి, బెస్ట్ క్వాలిటీలను బయటకు తీసుకురావడమే ఉత్తమ మార్గం. అందుకే ఎవరినైనా ప్రేమిస్తే.. వారిలోని బెస్ట్ వెర్షన్​ను బయటకు తీసుకురండి. అదే మీరు వారికిచ్చే నిజమైన ప్రేమ.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Saturday Motivation : ప్రేమ అంటే ఇవ్వడమే అంటారు. కానీ ప్రేమను ఎలా ఇస్తారు. మాటాల్లో, చేతల్లో.. ఇలా చెప్పకుంటూ పోతే చాలానే ఉంటాయి. అయితే వీటిలో బెస్ట్ ఏంటో తెలుసా? ప్రేమించిన వారిని అర్థం చేసుకోవడం. అవును మీరు ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే.. వారిని అర్థం చేసుకోవడం ప్రారంభించండి. వీలైనంత సమయం వారితో ఎక్కువగా గడపండి. తద్వారా వారి నుంచి.. వారికి వేటిపై ఆసక్తి ఉంది.. ఎలాంటి లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు.. దానికోసం ఇప్పుడు ఏమి చేస్తున్నారు వంటి విషయాలు మీకు తెలుస్తాయి. ప్రేమించిన వ్యక్తి గురించి ఈ విషయాలు తెలియడం చాలా ఇంపార్టెంట్.

ఇవన్నీ మీ ప్రేమకు సహకరిస్తాయో లేదో పక్కనపెడితే.. మీరు ఈ విషయాలకు కచ్చితంగా సహకరించవచ్చు. ఇలాంటివన్నీ జరగడానికి చాలా సమయం పడుతుంది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కానీ వాటిని ఎలా లైన్​లోకి తీసుకురావాలనేది పూర్తిగా మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఈ విషయాల గురించి మీరు ప్రేమించిన వ్యక్తితో మాట్లాడేందుకు ప్రయత్నించండి. దానికోసం వారు ఏమి చేయవచ్చో సలహా ఇవ్వండి. వారిలోని బెస్ట్ వెర్షన్​ను బయటకు తీసుకురావడానికి ట్రై చేయండి.

ఓ వ్యక్తిలో మంచి, చెడు గుణాలు ఉంటాయి. మీరు ప్రేమించిన వ్యక్తిలో కూడా ఈ గుణాలు ఉండొచ్చు. అయితే మీరు వాటిని గుర్తించి.. ఆ చెడు లక్షణాలు వారి గోల్స్​కు అడ్డంకిగా మారితే.. వాటినుంచి బయటపడేలా చేయండి. అది వారు కెరీర్​ పరంగా లేదా.. జీవితంలో వారు అనుకున్నది సాధించేలా ఎదగడానికి సహాయ పడుతుంది. ఇది మీరు వారికిచ్చే పెద్ద గిఫ్ట్ అవుతుంది.

అవతలి వ్యక్తిలోని లోపాలను ఎల్లవేళలా ఎత్తి చూపే బదులు.. అతను లేదా ఆమె దేనిలో నిష్ణాతులో గుర్తించి.. వారు ఆ నిర్దిష్ట రంగంలో ఎదగడానికి సహాయం చేయడానికి ప్రయత్నించాలి. వారు పడిపోతున్నా ప్రతిసారి.. లేదా వారి మీదు వారు నమ్మకాన్ని కోల్పోతున్న ప్రతిసారి.. మీరు వారికి తోడుగా ఉండాలి. వారిని ఆ ఊహలనుంచి బయటకు తీసుకువచ్చి.. మళ్లీ అడుగులు వేసేలా ప్రోత్సాహించాలి. ఈ ప్రయాణంలో మీరు వారికి తోడున్నట్లు కచ్చితంగా తెలిసేలా చేయాలి. వారి అసమానతలను అధిగమించడానికి సహాయం చేయండి. అసలు ప్రేమ అంటే ఇదే.

ప్రతి వ్యక్తి ఏదో ఒకదానిలో లేదా ఇతర విషయాలలో మంచి ప్రతిభ కలిగి ఉంటాడు. కానీ వారు చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే.. తమ టాలెంట్​ను వారే గుర్తించకపోవడం. సొంత ప్రతిభను గుర్తించే ఓపిక లేకపోవడమే నిజంగా విఫలం కావడం. అందుకే వారు ఏది స్టార్ట్ చేయకముందే ఓటమిని అంగీకరించేస్తారు. కాబట్టి.. మీరు ప్రేమించిన వ్యక్తి కూడా ఇలాంటి వారే అయితే.. వారి టాలెంట్​ను బయటకు తీసుకురావడమే మీ ముందున్న పెద్ద టాస్క్. వారిని ఆ షెల్​ నుంచి బయటకు తీసుకువస్తే.. ముత్యంలా మెరుస్తారు. ఆ విషయాన్ని పదే పదే గుర్తుచేయండి. వారు ఎంత విలువైన వారో తెలియజేయండి. ఇదే మీరు ప్రేమించిన వారికి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్.

అందుకే ఒకరిలోపాలను ఎత్తిచూపి నిరుత్సాహపరిచే బదులు.. వారి ప్రతిభను గుర్తించి.. ఎంక్రేజ్​ చేస్తే.. మీరు ఇద్దరు కలిసి జీవితంలో హ్యాపీగా ముందడుగు వేయగలరు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్