Thursday Motivation : కష్టమనేది లేని రోజంటూ లేదు కదా.. కన్నీరు దాచుకుంటూ సాగిపోక తప్పదుగా..
03 November 2022, 6:20 IST
- Thursday Motivation : మీరు వెళ్లే దారి ఎంత వరస్ట్‌గా ఉన్నా.. మీకు మంచే జరుగుతుందని నమ్మండి. ఆ దారి మీకు వేటిని ఇచ్చినా.. వీటితో మనకు అవసరం ఏంటి అని వదిలేయకుండా.. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగండి. ఏదొక రోజు కచ్చితంగా మీరు అనుకున్న దానిని సాధిస్తారు.
కోట్ ఆఫ్ ద డే
Thursday Motivation : కొన్నిసార్లు కష్టమని తెలిసినా.. ఆ దారిలోనే వెళ్లాల్సి వస్తుంది. మనకు కావాల్సింది దక్కించుకోవాలి అనుకున్నప్పుడు.. ఆ దారి ఎంత కష్టంగా ఉన్నా ముందుకు సాగాలి. ఇప్పుడున్న కష్టాల కంటే ఇంకా ఎక్కువ కష్టాలు రావొచ్చు అనే ధోరణితో ముందుకు సాగండి. దీనివల్ల కష్టాలు వచ్చినా.. రాకపోయినా.. మీరు బెదరకుండా ఉంటారు. మంచి జరుగుతుంది. అనుకున్నది సాధిస్తాము. ప్రయత్నిచండంలో తప్పేమిలేదు అనే ధోరణితో ముందుకు వెళ్లినప్పుడు.. మీకు కావాల్సిన దానిని కచ్చితంగా దక్కించుకుంటారు.
అలాగే దారిలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగండి. అంతేకానీ వీటితో నాకేమి ప్రయోజనం ఉంటుంది అనుకోవద్దు. అలాంటి అవకాశాలు మీకు అరుదుగా వస్తాయి. అవి మీ ప్రయాణంలో ఓ బూస్ట్ ఇస్తాయి. కానీ పెద్ద దానికోసం ఎదురు చూస్తూ.. ఈ చిన్నవాటితోనే ఆగిపోకండి. మీ టార్గెట్ 10 మైళ్లు అయితే.. కనీసం 10 మైళ్లు వెళ్తామని ప్రిపేర్ అయ్యి వెళ్లండి. ఒక్కరోజులో అయినా.. వారం రోజుల్లో అయినా.. మీ టార్గెట్‌ని రీచ్ అవ్వండి. అక్కడి వెళ్లాక ఇంకా ముందుకు వెళ్లాల వద్దా అనేది మీ ఓపిక.
మీ మనసు, శరీరాన్ని మీ టార్గెట్ రీచ్ అవ్వడానికి సిద్ధం చేయండి. జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదు. మీరు ఎంత సిద్ధమైనా.. ఏదొక పాయింట్లో మీరు అలసిపోతారు. లేదా వచ్చే కష్టాలకు భయపడిపోతారు. లేదంటే విరక్తి చెందో ఆగిపోతారు. అలా మీరు ఆగిపోకుండా ఉండాలంటే.. ప్రయాణం మొదలుపెట్టే ముందే అన్నింటికి సిద్ధమై అడుగు ముందుకు వేయాలి. ఏ కష్టం వచ్చినా నేను ఆగిపోను అనే సంకల్పంతో ముందుకు సాగాలి. పరిస్థితులు ఎంత క్లిష్టంగా మారినప్పటికీ.. మీరు ఎల్లప్పుడూ మీ బెస్ట్ ఇవ్వడంపైనే.. దృష్టి సారించండి.
మీ విశ్వాసాన్ని ఎప్పటికీ కోల్పోకుండా చూసుకోండి. వెనక్కి లాగడానికి చాలా దుష్ట శక్తులు, కారణాలు మనల్ని వెంటాడతాయి. వాటికి భయపడకుండా.. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. మీ ఆ పరిస్థితులకు సిద్ధమైనప్పుడే.. అనుకున్నది సాధిస్తారు. ఎంత కష్టం వచ్చినా అడుగు వెనక్కి వేయరు. మీ బ్యాకప్ ప్లాన్‌ను సిద్ధంగా ఉంచుకోండి. పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోయినా.. ఈ బ్యాకప్ ప్లాన్ మీరు ముందుకు వెళ్లేందుకు సహాయం చేస్తుంది.