Sunday Motivation : గతంలో ఉంటూ కృంగిపోవడం కన్నా.. కష్టంగా ఉన్నా మారడమే బెటర్..
Sunday Motivation : ఒక టైమ్‌లో మనం కచ్చితంగా మారాల్సిన వస్తుంది. అప్పటివరకు ఓ రకంగా జీవిస్తూ.. నచ్చినవారితో ఉంటూ.. హ్యాపీగా ఉండే జీవితం నుంచి.. ఏదైనా ఓ కారణం వల్ల మనం మారాల్సిన అవసరం వస్తుంది. మారడం మనకు కష్టంగానే ఉండొచ్చు. కానీ ఆ పరిస్థితుల్లో ఆగిపోవడం కన్నా.. మారిపోవడమే మంచిది.
Sunday Motivation : మార్పు అనేది ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. బరువు తగ్గడం అనేది కోరిక కావొచ్చు. కానీ ఆ మార్పుకోసం చేసే ప్రయత్నం చాలా కష్టంతో కూడుకుని ఉంటుంది. కానీ బరువు తగ్గడం కచ్చితంగా అనివార్యమనుకో.. మీకు ఇంకో ఆప్షన్ ఉండదు. కానీ ఫలితం మీకు సంతృప్తిని ఇస్తుంది. అలాగే జీవితంలో అనుకోని సమయంలో మనం మారాల్సి ఉంటుంది. అది మెంటల్‌గా కావొచ్చు. ఫిజికల్‌గా కావొచ్చు. మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మార్పు కోసం కృషి చేయడమంటే.. కచ్చితంగా అది కష్టమైనదే అవుతుంది. కానీ మారాల్సిన అవసరం వచ్చినప్పుడు.. మార్పు కచ్చితంగా అవసరమని మీకు తెలిసినప్పుడు ఇంకో ఆప్షన్ ఉండదు.
చదువు పూర్తి చేసినా.. అల్లరి చిల్లరిగా తిరిగే ఓ కొడుకు ఉన్నాడనుకుందాం. ఆ ఇంటి పెద్ద సంపాదించే వరకు అతనికి ఎలాంటి భయం, బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటాడు. కానీ ఆ ఇంటి పెద్దకి ఏమైనా అయితే.. ఆ బాధ్యత ఆ కుర్రాడిపై పడితే.. అతను అక్కడే ఆగిపోలేడు కదా. ఆగిపోకూడదు కూడా. తన కోసం, ఇంట్లో వాళ్లకోసం తను మారాలి. తను మారితేనే ఆ కుటుంబం మళ్లీ హ్యాపీగా ఉండగలుగుతుంది. ఈ మార్పు ఆ కుర్రాడికి కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఇన్నాళ్లు నాన్న కష్టం తెలియకుండా పెంచాడు కదా. అందుకే అతనికి ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఆ మార్పు అతనిని జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్లేలా చేస్తుంది.
అంటే ఎవరికో ఏదో అయితేనే పని అవుతుందా.. మార్పు వస్తుందా అంటే కాదు. మారాలి.. అనుకున్నది సాధించాలనే కోరిక మనలో ఉంటే కచ్చితంగా మీ కష్టం కూడా ఇష్టంగానే ఉంటుంది. అదే నాన్న కష్టపడుతున్నాడని కొడుకు ఆలోచించి.. తన చెడు అలవాట్లను వదిలి.. కష్టంగా ఉన్నా ప్రయత్నించి సంతోషంగా అమ్మనాన్నలని చూసుకోవచ్చు. మార్పు అనేది అనివార్యమైనప్పుడు.. మారడం తప్పేమి కాదు. ఈ ప్రాసెస్ కష్టంగా ఉన్నా.. అక్కడే ఆగిపోవడం కన్నా.. ముందుకు వెళ్లడమే కరెక్ట్.
మనకి కావాల్సిన వారు దూరమయ్యారని.. కొందరు తమ జీవితం అక్కడితోనే ఆగిపోయిందనుకుంటారు. కానీ మన ఫ్యామిలీ కోసమో.. లేదా మన కోసమో.. ఆ పరిస్థితినుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఓవర్కామ్ చేయాలి. దానిని అధిగమించడం కష్టంగానే ఉంటుంది. కానీ ఒక్కసారి మార్పు మొదలైతే.. అది మీ జీవితాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుకునేలా చేస్తుంది. మన తలరాత మారాలంటే ముందు మనం మారాలి.
సంబంధిత కథనం